»   » శ్రీదేవితో కలసి గోరు ముద్దలు తిన్నా..కమల్ అప్ సెట్, తమిళ మీడియా అంత బరితెగించిందా!

శ్రీదేవితో కలసి గోరు ముద్దలు తిన్నా..కమల్ అప్ సెట్, తమిళ మీడియా అంత బరితెగించిందా!

Subscribe to Filmibeat Telugu
Kamal Hassan's Emotional Speech On Gossips From Tamil Media

శ్రీదేవి మృతితో బాగా ఎమోషనల్ అయిన నటులలో కమల్ హాసన్ కూడా ఒకరు. శ్రీదేవి, కమల్ హాసన్ జోడి తమిళనాట సూపర్ హిట్ అయింది. పలు సూపర్ హిట్ చిత్రాలు వీరి కాంబినేషన్లో వచ్చాయి. దీనితో తనకు శ్రీదేవి కుటుంబంతో సాన్నిహిత్యం పెరిగిందని కమల్ హాసన్ అంటున్నారు. శ్రీదేవి మృతి గురించి అన్ని చిత్ర పరిశ్రమల్లో, మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. కోలీవుడ్ లో శ్రీదేవి, కమల్ సాన్నిహిత్యం గురించి కొన్ని పుకార్లు వస్తుండడంతో కమల్ హాసన్ స్పందించారు.

సూపర్ హిట్ కాంబినేషన్

సూపర్ హిట్ కాంబినేషన్

కమల్ హాసన్, శ్రీదేవి కలసి పలు చిత్రాల్లో నటించారు. వాటిలో సద్మా, ఆకలిరాజ్యం వంటి సూపర్ హిట్ చిత్రాలు చాలా ఉన్నాయి. దీనితో వీరి కాంబినేషన్ సూపర్ హిట్ గా నిలిచింది.

శ్రీదేవి మరణ వార్తతో

శ్రీదేవి మరణ వార్తతో

శ్రీదేవి మరణించారని వార్త తెలియగానే కమల్ హాసన్ బాగా ఎమోషనల్ అయ్యారు. శ్రీదేవి, తాను కలసి నటించిన చిత్రాలని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో కమల్ ముఖంలో కంటతడి కూడా కనిపించింది.

దేశమంతటా పుకార్లు

దేశమంతటా పుకార్లు

శ్రీదేవి మృతి వివరాలు ఎవరికీ పూర్తిగా తెలియవు. దీనితో అన్ని మీడియా వర్గాల్లో శ్రీదేవి మృతి పట్ల భిన్న కథనాలు వెలువడ్డాయి. ఆ వార్తలని ప్రలువురు ప్రముఖులు ఖండించిన సంగతి తెలిసిందే.

తమిళ మీడియా అంత బరితెగిచిందా

తమిళ మీడియా అంత బరితెగిచిందా

శ్రీదేవి మరణం తరువాత పలు రకాల మీడియా సంస్థలు భిన్న కథనాల్ని ప్రసారం చేస్తున్నాయి. అందుకు తమిళ మీడియా మినహాయింపు కాదు. తమిళ మీడియాలో కమల్, శ్రీదేవి గురించి అభ్యంతరకర కథనాలు వెలువడుతున్నాయి.

కమల్, శ్రీదేవి సాన్నిహిత్యం గురించి

కమల్, శ్రీదేవి సాన్నిహిత్యం గురించి

కమల్, శ్రీదేవి సాన్నిహిత్యం గురించి కొన్ని తమిళ మీడియా సంస్థలు తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నాయి.

కమల్ హాసన్ అప్ సెట్

కమల్ హాసన్ అప్ సెట్

ఈ వార్తలతో కమల్ హాసన్ అప్ సెట్ అయ్యారు. ఇలాంటి వార్తలని ఎలా సృష్టిస్తారు అని అయన ఆగ్రహం వ్యక్తం చేసారు. శ్రీదేవి తనకు చెల్లెలు లాంటి వారని కమల్ హాసన్ వ్యాఖ్యానించారు.

గోరు ముద్దలు తిన్నా

గోరు ముద్దలు తిన్నా

శ్రీదేవి కుటుంబంతో నాకు మంచి అనుబంధం ఉంది. శ్రీదేవి అమ్మగారి గోరుముద్దల్ని తనుకూడా తిన్నానని, దయచేసి ఇలాంటి వార్తలని సృష్టించవద్దని కమల్ హాసన్ ఎమోషనల్ రిక్వస్ట్ చేసారు.

శ్రీదేవి జ్ఞాపకాలలోనే ఇంకా

శ్రీదేవి జ్ఞాపకాలలోనే ఇంకా


శ్రీదేవి తుది శ్వాస విడిచి ఆరు రోజులు గడుస్తున్నా.. ఇప్పటికి సినీలోకం, అభిమానాలు ఆమె జ్ఞాపకాలలోనే ఉన్నారు.

English summary
Kamal Hassan reacts on false news circulating regarding Sridevi. Kamal gets emotional.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X