twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తొక్కేయాలని చూశారు, రేపు రజనీ వచ్చినా విమర్శిస్తా: కమల్ హాసన్

    తమిళనాడు మాజీ సీఎం జయలలితపై కమల్ హాసన్ విమర్శలు చేశారు. తప్పు చేయకున్నా తనను తొక్కేయాలని చూసిందన్నారు.

    By Bojja Kumar
    |

    తన మనసులో ఉన్న మాటను నిర్మొహమాటంగా చెప్పే నటుల్లో ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఒకరు. ఎదుటి వారు అధికార పార్టీ వారైనా కమల్ మాటలో మార్పు ఉండదు. గతంలో జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కూడా కమల్ హాసన్ అలాగే మాట్లాడేవారు, విమర్శలు చేసేవారు.

    కమల్ హాసన్ తనపై చేసిన వ్యాఖ్యలను మనసులో పెట్టుకున్న జయలలిత 'విశ్వరూపం' మూవీ విడుదల సమయంలో కావాలనే ఆయన్ను ఇబ్బంది పెట్టిందనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ విషయమై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కమల్ హాసన్ స్పందించారు.

    నన్ను తొక్కేయాలనుకుంది నిజమే

    నన్ను తొక్కేయాలనుకుంది నిజమే

    జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తనను టార్గెట్ చేసుకుని తొక్కేయాలని చూశారని కమల్ హాసన్ సంచలన ఆరోపణలు చేశారు. 'తంది' అనే తమిళ టీవీ ఇంటర్వ్యూలో కమల్ ఈ కామెంట్స్ చేశారు.

    Recommended Video

    Kamal Haasan Reacts on Rajinikanth Political Entry!
    విశ్వరూపం సమయంలో

    విశ్వరూపం సమయంలో

    విశ్వరూపం చిత్రం విడుదల సమయంలో ఏర్పడిన అడ్డంకులను ప్రస్తావిస్తూ, తన సినీ జీవితాన్ని జయలలిత గురిపెట్టారని, తాను ఏ సామాజిక వర్గాన్నీ కించపరచకున్నా తనను కావాలని టార్గెట్ చేశారని కమల్ హాసన్ తెలిపారు.

    చాలా బాధపడ్డాను

    చాలా బాధపడ్డాను

    విశ్వరూపం రిలీజ్ సమయంలో రాజకీయ నాయకుల కారణంగా నా జీవితంలో ఎప్పుడూ లేనంత క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాను. నన్ను చాలా విసిగించారు. అందుకే అపుడు తాను రాష్ట్రాన్ని విడిచి వెళతానని చెప్పినట్లు కమల్ హాసన్ గుర్తు చేసుకున్నారు.

    రేపు రజనీకాంత్ వచ్చినా విమర్శిస్తా

    రేపు రజనీకాంత్ వచ్చినా విమర్శిస్తా

    మన దేశంలో వాక్ స్వాతంత్రం ఉంది.... మనకు నచ్చని పనులను విమర్శించడం మన హక్కు, ఈ విషయంలో తాను కాంప్రమైజ్ కాలేను. రేపు రజనీకాంత్ పార్టీ పెట్టినా ఏదైనా నా మనసుకు నచ్చనిది జరిగితే విమర్శిస్తానని అన్నారు.

    ఆ మహా నటులే చదువుకోలేదు నేనెంత?

    ఆ మహా నటులే చదువుకోలేదు నేనెంత?

    మీకు తగిన విద్యార్హత లేదనే విమర్శలపై స్పందిస్తూ...కామరాజ నాడార్, శివాజీ గణేశన్, ఎంజీ రామచంద్రన్ లాంటి సినీ ప్రముఖులు కూడా ఎలాంటి ఉన్నత విద్యనూ అభ్యసించలేదని, ఇక్కడ ప్రజల మన్ననలు పొందడమే ముఖ్యమని కమల్ హాసన్ చెప్పుకొచ్చారు.

    English summary
    Kamal Haasan has made sensational comments about the late Jayalalithaa, the former Chief Minister of Tamilnadu, and kamal squarely blamed Jayalalitha that she was the reason for all the troubles he had faced for ‘Vishwaroopam’.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X