»   » బెంగాళీ భామను పెళ్లాడిన ‘ఆవకాయ్ బిర్యానీ’ హీరో(ఫోటో)

బెంగాళీ భామను పెళ్లాడిన ‘ఆవకాయ్ బిర్యానీ’ హీరో(ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ తెలుగు నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ ఇటీవల ఓ బెంగాళీ అమ్మాయిని బెంగాళీ సాంప్రదాయంలో పెళ్లాడిన సంగతి తెలిసిందే. తాజాగా మరో తెలుగు నటుడు కూడా బెంగాళీ అమ్మాయిని అదే సాంప్రదాయంలో పెళ్లాడాడు. 'ఆవకాయ్ బిర్యానీ' సినిమా ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నటుడు కమల్ కామరాజు తన ప్రియురాలు పెళ్లాడాడు.

రెండు విభిన్న సాంప్రదాయాలు, బాషలు, ప్రాంతాలకు చెందిన వీరు కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అయ్యారు. ఈ క్రమంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. వధువు తరుపు వారు తమ సాంప్రదాయం ప్రకారం గ్రాండ్‌గా పెళ్లి వేడుక నిర్వహించారు. హైదరాబాద్ లో డిసెంబర్ 13న వివాహ వేడుక జరిగింది.

 Kamal Kamaraju

వీరి వివాహం పూర్తిగా ప్రైవేటు కార్యక్రమంగా జరిగింది. ఈ వేడుకకు క్లోజ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే హాజరయ్యారు. అనంతరం తెలుగు సినిమా పరిశ్రమలోని తన కొలిగ్స్‌కు రిసెప్సన్ పార్టీ ఏర్పాటు చేసారు. ఈ వేడుకకు పెద్ద పెద్ద స్టార్స్ ఎవరూ హాజరు కాలేదు. నిర్మాత మధుర శ్రీధర్, అతితక్కువ మంది టాలీవుడ్ స్టార్స్ మాత్రమే హాజరయ్యారు.

కమల్ కామరాజు బేసికల్‌గా ఆర్కిటెక్చర్‌లో గ్రాడ్యుయేట్. యాక్టింగ్, పేయింటింగ్, స్క్రిప్టు రైటింగ్, ఆర్ట్ డైరెక్షన్, ఫోటోగ్రఫీ తదితర విభాగాల్లో తన టాలెంటు నిరూపించుకున్నాడు. అతని గర్ల్ ఫ్రెండ్ సుప్రియా బిస్వాస్ హైదరాబాద్‌లోని ఓ మల్టీనేషనల్ కంపెనీలో పని చేస్తోంది. వీరి ఎంగేజ్మెంట్ అక్టోబర్ నెల మొదటి వారంలో జరిగింది. ఈ ఫంక్షన్‌కు అపుడు దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా హాజరయ్యారు.

English summary
Popular actor Brahmaji's son Sanjay Roy and his girlfriend recently had a Bengali style wedding. Just a week after this event, another Tollywood actor has united with his girlfriend in the same style of marriage. He is none other than multifaceted star Kamal Kamaraju, who tied the knot with his longtime girlfriend Supriya Biswas in Bong style. Later, the newly-married couple also hosted a reception party to film fraternity.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu