‘గోవిందుడు అందరివాడేలే’లో కమిలిని గెటప్(ఫొటో)

By Srikanya

హైదరాబాద్ : రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'గోవిందుడు అందరివాడేలే' . కాజల్‌ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్‌, కమలిని ముఖర్జీ ప్రధాన పాత్రధారులు కనపడనున్నారనే సంగతి తెలిసిందే. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కోసం కమిలిని లుక్ పూర్తి సంప్రదాయబద్దంగా మార్చిసినట్లు సమాచారం. ఈ మేరకు ఈ చిత్రంలో ఫొటో బయిటకు వచ్చింది. ఇక్కడ ముక్కపుడుక పెట్టుకుని అచ్చ తెలుగు అమ్మాయిలా ఉన్న ఆమె లక్ ని చూడవచ్చు. బండ్ల గణేష్‌ నిర్మాత.

పల్లెటూరిలో పుట్టిన ఓ యువకుడు విదేశాల్లో చదువుకుని తిరిగి స్వగ్రామానికి చేరతాడు. ఎన్నో ప్రేమానురాగాల మధ్య ఉన్న ఆకుటుంబం ఒక్కసారిగా కుదుపులకు లోనవుతుంది. ఇంట్లో నాన్న, బాబాయ్‌ల మధ్య పొడసూపిన విబేధాలు చూసి ఆ యువకుడు ఏం చేశాడు? ఆ ఇద్దరిని కలిపేందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడన్నది తెరపైనే చూడాలంటున్నారు 'గోవిందుడు అందరివాడేలే 'యూనిట్.

Kamalini Mukherjee traditional look in GAV

ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన ఓ సెట్‌లో జురుగుతోంది. ఇందులో రామ్‌చరణ్‌పై ఓ పాట చిత్రీకరిస్తున్నారని యూనిట్‌ వర్గాలు అంటున్నాయి. 'ఈ పాట సినిమాకి హైలైట్‌గా ఉంటుంది. ఇందులో ఓ సరదా గెటప్‌ వేశాను. ఆ గెటప్‌కి సంబంధించిన ఫోట్‌ త్వరలో విడుదల చేస్తానని చరణ్‌ ట్విట్‌ చేశారు. నాతో పాటు కాజల్‌ అభినయం, నాకు, ప్రకాష్‌రాజ్‌కు మధ్య చోటుచేసుకునే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టకుంటాయని ఆయన తెలిపారు. ఇందులో శ్రీకాంత్‌, ప్రకాష్‌రాజ్‌, కమిలిని ముఖర్జీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి యువన్‌శంకర్‌రాజా సంగీతం అందిస్తున్నారు.

చాలా కాలం తర్వాత సొంతగడ్డపై అడుగుపెట్టిన ప్రవాస భారతీయుడిగా పోనీ టెయిల్‌తో కనిపించబోతున్నాడు రామ్‌చరణ్‌. . ఇందులో ప్రధాన పాత్రధారుల ఆహార్యం, ఆభరణాలు అన్నీ కొత్తగా ఉండబోతున్నాయి. ఇందులో రామ్‌చరణ్‌ పంచెకట్టుతో ఎడ్లబండిపై తన తాత పాత్రధారి ప్రకాష్ రాజ్ తో తిరుగుతూ కనిపిస్తాడు.

శ్రీకాంత్, కమిలినీ ముఖర్జీ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు నటినటులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, నిర్మాత: బండ్ల గణేష్, సమర్పణ: శివబాబు గండ్ల, దర్శకత్వం: కృష్ణవంశీ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X