»   » రక్తం వచ్చేలా హింసించాడు: హీరోయిన్ షాకింగ్ స్టేట్మెంట్

రక్తం వచ్చేలా హింసించాడు: హీరోయిన్ షాకింగ్ స్టేట్మెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ మీడియా ముందుకు వచ్చినప్పుడల్లా సంచలన విషయాలు బయట పెడుతున్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోలి గురించి షాకింగ్ కామెంట్ చేశారు.

'ది టౌన్ హాల్ విత్ బర్కా దత్' అనే కార్యక్రమంలో పాల్గొన్న కంగనా ఈ సందర్భంగా ఆదిత్య పంచోలీ గురించి వెల్లడించింది. తనను అతడు ఎంతో తీవ్రంగా హింసించే వాడని, అపుడు తాను మైనర్ అని, ఏం చేయాలో అర్థం అయ్యేది కాదని తెలిపింది.

ఆదిత్య చాలా డేంజర్

హృతిక్ రోషన్‌తో వివాదం సమయంలో ఆదిత్య పంచోలీ హృతిక్‌ రోషన్‌కు సపోర్టుగా నిలిచాడని, హృతిక్‌ కంటే ఆదిత్య చాలా డేంజర్‌ అంటూ అతడు తన పట్ల ఎంత హింసాత్మకంగా ప్రవర్తించాడో కంగనా చెప్పుకొచ్చింది.

రక్తం వచ్చేలా కొట్టాడు

రక్తం వచ్చేలా కొట్టాడు

‘ఆదిత్య పంచోలి నా తండ్రి వయసు వ్యక్తి. ఆయన కూతురు కంటే చిన్నదాన్ని. నాకు 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చాను. అతడితో కలిసి పని చేస్తున్న సమయంలో ఆదిత్య నన్ను తలపై రక్తం వచ్చేలా కొట్టాడు... అని కంగనా రనౌత్ వెల్లడించింది.

ఆదిత్య భార్య సాయం చేయలేదు

ఆదిత్య భార్య సాయం చేయలేదు

ఆదిత్య పంచోలి తనను తీవ్రంగా హింసిస్తుండటంతో ఆయన భార్య జరీనా వాహబ్‌ను ఆశ్రయించాను. కానీ ఆమె నుండి సహాయం అందలేదు. ఆదిత్య ఇంటికి రావడంలేదు. అతడు రాక పోవడంతో తాను చాలా హాయిగా ఉన్నట్లు ఆమె తనతో చెప్పిందని కంగనా వెల్లడించారు.

పోలీసులకు చెప్పడానికి భయపడ్డాను

పోలీసులకు చెప్పడానికి భయపడ్డాను

ఆదిత్య పంచోలి గురించి పోలీసులకు కంప్లైంట్ చేద్దామనుకున్నాను. పోలీస్ స్టేషన్ వరకు విషయం వెలితే విషయం తమ ఇంటికి చేరుతుందని.... అలా జరిగితే వారు మళ్లీ నన్ను ఇంటికి తీసుకెళతారు అని భయపడ్డట్లు కంగనా తెలిపారు.

ధైర్యం చేసి కంప్లయింట్ చేశాను

ధైర్యం చేసి కంప్లయింట్ చేశాను

అయితే దైర్యం చేసి పోలీసులను ఆశ్రయించాను. అయితే పోలీసులు అతడిని పిలిచి చిన్న వార్నింగ్ ఇచ్చి వదిలి పెట్టారు. అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు అని కంగనా రనౌత్ వెల్లడించారు.

English summary
Kangana accused Pancholi was violent with her, while Pancholi accused Kangana of using him to gain a foothold in the industry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu