వాడి కాళ్లు అక్కడే విరగొట్టేదాన్ని..! | Filmibeat Telugu
ఎవరికీ తొణకకుండా, దేనికి బెణకకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే హీరోయిన్ ఎవరంటే ఠక్కున సమాధానం పేరు కంగన రనౌత్. తనకు విషయం నచ్చకపోతే స్టార్ హీరోనా లేదా సాధారణ పౌరుడా అని లెక్క చేయదు ఈ బాలీవుడ్ క్వీన్. తాజాగా దంగల్ హీరోయిన్ జైరా వసీంకు ఎదురైన విషయంపై కంగన ఘాటుగా స్పందించింది. ఢిల్లీ-ముంబై విమానంలో జైరా వసీం తోటి ప్రయాణికుడి నుంచి లైంగిక వేధింపులకు గురైన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ప్రయాణికుడిని రక్షించడానికి ప్రయత్నాలు జరుగుతున్న విషయంపై కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడింది.
కేసు నుంచి తప్పించేందుకు
జైరా వసీంను విమానంలో వేధించిన ప్రయాణికుడిని పోలీసులు అరెస్ట్ చేయడం అభినందించాల్సిన విషయం. కానీ ఆ వ్యక్తిని కేసును తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. జైరానే ఆ వ్యక్తిని అపార్థం చేసుకొన్నది అని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తున్నది అని కంగన పేర్కొన్నది.
జైరా మీద ఆరోపణలు రావడం
జైరా మీద ఇలాంటి ఆరోపణలు చేయడం చాలా బాధగా ఉంది. బాధితురాలిని తప్పుపట్టడం ఎంత వరకు సమంజసం. లైంగిక వేధింపులకు గురిచేసిన వ్యక్తిని తప్పించే ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి పరిణామాలు చోటుచేసుకొంటున్నాయి.
అతను అమాయకుడా?
జైరా వసీంను వేధించిన వ్యక్తి చాలా అమాయకుడు అని కితాబు ఇస్తున్నారు. అంత అమాయకుడైతే జైరా వీపు ఎందుకు నిమిరాడో. అలా గోకికుంటే ఆ వ్యక్తిని ఊరికనే పోలీసులు అరెస్ట్ చేస్తారా? అని కంగన ప్రశ్నించింది.
మహిళలకు భద్రత ఉంటుందా?
అలా ఆరోపణలు ఉన్న వ్యక్తిని రక్షించే ప్రయత్నం చేస్తే మహిళలకు ఎక్కడైనా భద్రత ఉంటుందా? తమపై లైంగిక దాడికి పూనుకొన్న వ్యక్తిపై ఫిర్యాదు చేయడం, వారి చర్యలను బయటపెట్టే హక్కు మహిళలకు లేదా. అదే నేనైతా ఆ వ్యక్తి కాలిని విరగకొట్టే దానిని అని ప్రశ్నించారు.
అఫైర్ పెట్టుకోమని బెదిరింపులు
తన కెరీర్ తొలినాళ్లలో ఓ స్టార్ హీరో తనతో అఫైర్ పెట్టుకోవాలి అని బెదిరించాడు అని ఇటీవల ఓ విషయాన్ని బయటపెట్టింది. ఆ స్టార్ హీరో ఎవరు అనే విషయాన్ని గోప్యంగా పెట్టడం గమనార్హం. అలాగే హృతిక్ రోషన్‌తో అఫైర్ వ్యవహారం కూడా తీవ్ర వివాదంగా మారిన సంగతి తెలిసిందే.
Slamming the trolling of Dangal actor Zaira Wasim after she alleged molestation on a flight, actor Kangana Ranaut said people should stop passing judgements on her. Kangana faults that there is conspiracy to make relief to the assault. That should not be happen in Zaira Wasim molested case.
Story first published: Monday, December 18, 2017, 19:05 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more