»   » హృతిక్.. నీవు అంకుల్‌వి.. నీ వెనుక పడాల్సిన అవసరం లేదు.. కంగన సోదరి ఫైర్

హృతిక్.. నీవు అంకుల్‌వి.. నీ వెనుక పడాల్సిన అవసరం లేదు.. కంగన సోదరి ఫైర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

కంగన రనౌత్ తనను లైంగికంగా రెచ్చగొడుతూ మెయిల్స్ పంపిందని బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ చేసిన వ్యాఖ్యలపై ఆమె చెల్లెలు రంగోలి చండెల్ స్పందించింది. తన సోదరి కంగన రనౌత్ ప్రతిష్ఠను దెబ్బ తీసే విధంగా వ్యాఖ్యలు చేసిన హృతిక్‌పై మండిపండింది. నీవు ఒక అంకుల్‌వి. నీతో సెక్స్ కోరుకునే అవసరం నా సోదరికి లేదు అని రంగోలి పేర్కొన్నది. గత కొద్దికాలం సద్దుమణిగిందనుకొన్న హృతిక్, కంగనా ప్రేమ వ్యవహారం మరోసారి భగ్గుమంటున్నది. ఇటీవల ఓ హింది టెలివిజన్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హృతిక్ ప్రవర్తనను కంగన బయటపెట్టింది. దాంతో కంగన తనను రెచ్చగొడుతూ ఈ-మెయిల్స్ పంపేదని ఇటీవల మీడియాకు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో రంగోలి చండెల్ రంగంలోకి దిగింది. వరుస ట్వీట్లతో హృతిక్‌పై మాటల దాడి చేసింది.

 హృతిక్ తన సోదరి కంగన వెంటపడ్డారు

హృతిక్ తన సోదరి కంగన వెంటపడ్డారు

తన భార్య సుజానేతో వైవాహిక సంబంధాలు చెడిపోయిన సమయంలో హృతిక్ తన సోదరి కంగన వెంటపడ్డారు. తన బాధను చెప్పుకొని కంగన ఓదార్పు కోరాడు. లేకపోతే అంకుల్ లాంటి వయసు ఉన్న హృతిక్‌తో ప్రేమ వ్యవహారం జరుపాల్సిన అవసరం కంగనకు లేదు అని చండెల్ పేర్కొన్నది.

తను నాకు లైంగికంగా రెచ్చగొట్టే మెయిల్స్‌ పంపింది : హృతిక్‌రోషన్‌
 ఇలా ముఖం దాచుకుంటున్నావా?

ఇలా ముఖం దాచుకుంటున్నావా?

తనను లైంగికంగా వేధిస్తున్నారనే ఆరోపణలపై చేసిన పాత ఫిర్యాదును హృతిక్ ఓ టెలివిజన్‌కు ఇవ్వడాన్ని రంగోలి తప్పుపట్టింది. నీవు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం నిరాధారమైన ఆరోపణలతో ఇలా ముఖం దాచుకుంటున్నావా? అని నిలదీసింది.

 నీవు అంకుల్ లాంటోడివి

నీవు అంకుల్ లాంటోడివి

హృతిక్.. నీ మొదటి సినిమా రిలీజ్ అయినప్పుడు కంగన ఓ స్కూల్ విద్యార్థి. కంగనాకు నీవు అంకుల్ లాంటోడివి. నా సోదరి నిన్ను అంకుల్ అని పిలువడానికి అర్హుడివి అని రంగోలి చెడామడా వాయించింది. నిరాధారమైన వ్యాఖ్యలు చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని హృతిక్‌ కుటుంబ సభ్యులకు సూచించింది. ఇలాంటి చీప్ ట్రిక్కులకు ప్రయత్నించకుండా భార్యా, పిల్లలను బాగా చూసుకుంటే మంచింది అని ట్వీట్‌లో పేర్కొన్నది.

 నీలాంటోడి వెంట పడే

నీలాంటోడి వెంట పడే

అందమైన, సంపన్నవంతురాలైన కంగనా నీలాంటోడి వెంట పడే అవసరం లేదు. నీవే మా సోదరి వెంటపడి వేధించావు. ఎవరు ఎవరి వెనుక పడ్డారో సినిమా పరిశ్రమలో అందరికీ తెలుసు. అంకుల్ దయచేసి ఇలాంటి అబద్దాలు చెప్పడం మానుకొని కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో అని రంగోలి వరుస ట్వీట్లతో హృతిక్ రోషన్‌పై ధ్వజమెత్తింది.

English summary
Rangoli Chandel lashed out at Hrithik Roshan for maligning her sister Kangana Ranaut's image. Rangoli Chandel Tweete that Kangana was in school when your first film came if not in the industry she would have called you her uncle. Young beautiful talented rich girl like Kangana doesn't need to stalk an uncle like you, u were after her she was never after you.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu