»   » గంగలో కంగన ని చూసి పిచ్చెక్కిపోతున్నారు : టాక్ ఆఫ్ సోషల్ మీడియా "మణికర్ణిక"

గంగలో కంగన ని చూసి పిచ్చెక్కిపోతున్నారు : టాక్ ఆఫ్ సోషల్ మీడియా "మణికర్ణిక"

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ లో "గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం, కంచె, గౌతమిపుత్ర శాతకర్ణి" వంటి వైవిధ్యమైన చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడంతోపాటు తెలుగు సినిమా ఖ్యాతిని పెంపొందింపజేసిన దర్శకుడు క్రిష్ జాగర్లమూడి బాలీవుడ్ లోనూ "గబ్బర్ ఈజ్ బ్యాక్"తో తానేమిటో, తన సినిమా ఎలా ఉంటుందో నిరూపించుకున్నాడు.

ఝాన్సీ లక్ష్మీభాయి జీవితం ఆధారంగా

ఝాన్సీ లక్ష్మీభాయి జీవితం ఆధారంగా

తాజాగా క్రిష్ తెరకెక్కించనున్న బాలీవుడ్ చిత్రం "మణికర్ణిక". వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయి జీవితం ఆధారంగా తెరకెక్కనున్న ఈ చారిత్రక చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ టైటిల్ పాత్ర పోషిస్తోంది.'బాహుబలి' రచయిత విజయేంద్రప్రసాద్ ఈచిత్రానికి కథ అందించారు.

కంగనా రనౌత్ లీడ్ రోల్

కంగనా రనౌత్ లీడ్ రోల్

ఈ చిత్రంలో కంగనా రనౌత్ లీడ్ రోల్ చేస్తోంది. శంకర్-ఎస్సాన్-లాయ్ సంయుక్తంగా సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని జీ స్టూడియోస్, కమల్ జైన్ సమర్పణలో కైరోస్ కొంటెంట్ స్టూడియోస్ బేనర్లో సంజయ్ కుట్రీ, నిషాద్ పిట్టి సహనిర్మాతలుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

అసలు పేరు మణికర్ణిక

అసలు పేరు మణికర్ణిక

ఝాన్సీ రాణి లక్ష్మి భాయి అసలు పేరు మణికర్ణిక. మరాఠా బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఆమె1828 లో వారణాసిలో జన్మించారు. అందుకే సినిమాను అక్కడి నుండే ప్రారంభించాలని నిర్ణయించిన క్రిష్ ఫస్ట్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం వారణాసిలో ఏర్పాటు చేసారు.

టాక్ ఆఫ్ ఫిలిం ఇండస్ట్రీ

టాక్ ఆఫ్ ఫిలిం ఇండస్ట్రీ

అయితే ఈ కార్యక్రమానికి ముందు కంగనా గంగా నది లో మునక లు వేయటం ఇప్పుడు టాక్ ఆఫ్ ఫిలిం ఇండస్ట్రీ అయ్యింది. హర హర మహాదేవ్ అంటూ ఆరుసార్లు మునిగింది స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్. ఆ తరువాత కూడా ఒక వీడియో తీసుకుంటాం మరోసారి మునగవా అంటూ మీడియా వారు రిక్వెస్ట్ చేస్తే.. వారి కోసం మరో రెండుమూడుసార్లు మనిగింది క్వీన్.

గంగలో మునకలేసింది

గంగలో మునకలేసింది

రెండు రోజుల కిందట గంగానది తీరాన.. కాశి నగరంలో.. ''మణికర్ణిక'' సినిమా షూటింగ్ మొదలైంది. ఈ సందర్భంగా పట్టు బట్టల్లో.. అది కూడా డిజైనర్ వేర్ లో.. హారతిని అందుకుని.. గంగలో మునకలేసింది ఈ స్టార్ బ్యూటి. ఆ త‌ర్వాత కాశీ విశ్వ‌నాథుని ద‌ర్శించుకొని మ‌ణిక‌ర్ణిక పోస్ట‌ర్ లాంచ్ చేసింది కంగనా. అయితే ఇప్పుడు కంగనా గంగా స్నానం ఫొటోలు పిచ్చిపిచ్చిగా వైరల్ అవుతున్నాయ్.

సామాజిక మాధ్యమాల్లో హల్ చల్

సామాజిక మాధ్యమాల్లో హల్ చల్

లేత పింక్ చీర ధరించి కట్ స్టోన్ జువెల్లరీతో సెట్స్ కు చేరుకున్న కంగన రనౌత్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. ఇదే ఘాట్ ద‌గ్గ‌ర గంగా హార‌తిలోనూ ఆమె పాల్గొన్న‌ది. ఈ సినిమా కోసం రాణి ల‌క్ష్మీభాయి గురించి రీసెర్చ్ చేసే ప‌నిలో ఉంది. ఝాన్సీతోపాటు ఇత‌ర ప్ర‌దేశాల‌కు వెళ్తాన‌ని కంగనా చెప్పింది.

 విజ‌యేంద్ర‌ప్ర‌సాద్

విజ‌యేంద్ర‌ప్ర‌సాద్

ఈ చారిత్రాత్మ‌క మూవీకి క‌థ‌ను విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ అందించారు.. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క్రిష్ ఈ మూవీకి డైరెక్ట‌ర్.. వ‌చ్చే ఏడాది ఏప్రిల్లో ఈ మూవీ విడుద‌ల కానుంది. పాపులర్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 27 న మణికర్ణిక చిత్రం విడుదల కానుంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను జీ స్టూడియో నిర్మిస్తోంది.

English summary
To launch the poster of her next film Manikarnika: The Queen of Jhansi, an event was organized at Dashwamedh ghat in Varanasi where she took five dips in river Ganga and also performed Ganga Harati.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu