For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  తనను తానే పెళ్లి చేసుకున్న సీరియల్​ నటి.. శృంగారానికి మగాడి అవసరం లేదట

  |

  ఈ మధ్య వివాహతంతు ఎంతో విచిత్రంగా జరుగుతుంది. ఒక అమ్మాయి, మరో అమ్మాయిని వివాహం చేసుకోవడం చూశాం. అలాగే ఒక అబ్బాయి, మరో అబ్బాయి పెళ్లాడటం ఎన్నో సార్లు విన్నాం. ఇక ఇటీవల కాలంలో స్వీయ పెళ్లిళ్లు చర్చనీయాంశమవుతున్నాయి. ఒక అమ్మాయి తనకు తానే వివాహ బంధంతో ఒక్కటి కావడం అన్నమాట. తమపై తమకున్న సెల్ఫ్​ రెస్పెక్టో, ఇతరులపై నమ్మకం లేకపోవడమో వంటి తదితర కారణాలతో తమను తామే పెళ్లి చేసుకుని సింగిల్​గా సంతోషంగా గడపాలనుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో వాళ్లు పలు విమర్శలు, ట్రోలింగ్ బారిన కూడా పడుతున్నారు.

  గుజరాత్​కు చెందిన వారే..

  గుజరాత్​కు చెందిన వారే..

  ఇటీవల గుజరాత్​లోని వడోదరకు చెందిన క్షమాబిందు తనను తానే పెళ్లాడి అందరిని విస్మయానికి గురి చేసిన విషయం తెలిసిందే. ఆమె బాటలోనే గుజరాత్​కు చెందిన మరొక అమ్మాయి సెల్ఫ్​ మ్యారేజ్​ చేసుకుంది. ఆమె ఎవరో కాదు దియా ఔర్​ బాతీ హమ్​ సీరియల్​తో చాలా పాపులారిటీ దక్కించుకున్న బాలీవుడ్​ సీరియల్​ నటి కనిష్క సోని.

   నుదుట సింధూరంతో ఫొటో..

  నుదుట సింధూరంతో ఫొటో..

  ఎంతో బ్యూటిఫుల్​గా ఉండే ఈ సీరియల్​ నటి కనిష్క సోని తనను తాను పెళ్లి చేసుకున్నట్లు ఫొటోలు షేర్ చేస్తూ సోషల్​ మీడియాలో పోస్ట్​ చేసింది. ఆ పిక్స్​లో ఒక హిందూ సాంప్రాదాయ మహిళలాగే నుదుట సింధూరం, మెడలో మంగళసూత్రంతో దర్శనమిచ్చింది కనిష్క.

  నన్ను ప్రేమిస్తున్నా ఏకైక వ్యక్తి..

  నన్ను ప్రేమిస్తున్నా ఏకైక వ్యక్తి..

  ఈ పోస్ట్​కు 'నా కలలన్నింటినీ నాకు నేనుగా సొంతంగా సాధించుకున్నాను. నన్ను ప్రేమిస్తున్నా ఏకైక వ్యక్తిని నేను మాత్రమే. అందుకే నన్ను నేను వివాహం చేసుకుని ఒక్కటి అవుతున్నా' అని రాసుకొచ్చింది. అతి తక్కువ సమయంలోనే ఈ పోస్ట్​ సోషల్ మీడియాలో తెగ వైరల్​ అయింది.

  ద్వేషిస్తూ కామెంట్లు..

  ద్వేషిస్తూ కామెంట్లు..

  ఈ పోస్ట్​ చూసిన నెటిజన్లు వివిధాలుగా స్పందించారు. ఆమెపై కామెంట్ల రూపంలో విరుచుకుపడ్డారు. కనిష్కను, ఆమె చేసిన చర్యను తప్పుబడుతూ ద్వేషిస్తతూ కామెంట్స్​ వదిలారు నెటిజన్లు. దీంతో తనపై ద్వేషం చూపిస్తూ పెట్టిన కామెంట్స్​పై రియాక్ట్​ అయింది కనిష్క. ఒక వీడియోను పోస్ట్ చేసి వారందరికీ సమాధానం చెప్పింది.

  శృంగారం గురించి అడిగారు..

  శృంగారం గురించి అడిగారు..

  ''నన్ను నేను వివాహం చేసుకోవడంపై చాలా మంది రియాక్ట్​ అవుతున్నారు. కొంతమంది అయితే ద్వేషిస్తున్నారు. కామెంట్స్ రూపంలో నా శృంగార జీవితం గురించి అడిగారు. వారందరికి నేను చెప్పేది ఒక్కటే. నేను గుజరాత్​కు చెందిన చాలా సాంప్రదాయమైన కుటుంబానికి చెందిన యువతిని. వివాహం అంటే నాకు చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం.

  అలా జరగదని నాకు అర్థమైంది..

  ఒక మంచి అనుభూతి. పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ ఉండేది. కానీ మాటలకు విలువ ఇచ్చి కట్టుబడి ఉండే వ్యక్తి నా లైఫ్​లో ఇప్పటివరకు నాకు కనపడలేదు. అలా జరుగుతుందని కూడా అనుకోవట్లేదు. అలాంటి అబ్బాయిలు ఉండరని నాకు అర్థమైంది. నేటి టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది.

  శృంగారం ఒక్కటే కాదు..

  శృంగారం ఒక్కటే కాదు..

  ఒక మనిషి లేకుండా నేను నా జీవితాంతం సంతోషంగా జీవించగలను అని నేను నమ్మడానికి కారణం అదే. శృంగారం కోసం ఒక పురుషుడి అవసరం లేదని నేను కచ్చితంగా చెప్పగలను. పెళ్లి అంటే కేవలం లైంగిక జీవితం, శృంగారం ఒక్కటే కాదు. ప్రేమ, నిజాయితీకి సంబంధించింది.

  హాలీవుడ్​ వైపు సంతోషంగా..

  హాలీవుడ్​ వైపు సంతోషంగా..

  అంతేకాకుండా నేను సంపాదిస్తే నాకు ఇంకో మనిషి అవసరం లేదు. నా కలలను స్వేచ్ఛగా నేను నెరవేర్చుకోగలను. ప్రస్తుతం అమెరికాలో ఉన్న నేను నా హాలీవుడ్ సినీ జీవితంవైపు అడుగులు వేస్తున్నాను. అది నాకు ఎంతో సంతోషంగా ఉంది'' అని వీడియో ద్వారా నటి కనిష్క సోని తెలిపింది.

  English summary
  Diya Aur Baati Hum Actress Kanishka Soni Recently Married Herself And Shares On Instagram With Photos. Then She Gets Criticized On Her Post. Recently Kanishka Soni Reacted On The Criticism And Post A Video On Instagram. And Said Do Not A Man For Sexual Life In That Video.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X