»   »  ఈగ విలన్ కి ఏమైందీ..? షూటింగ్ లో అస్వస్థత అటునుంచి అటే హాస్పిటల్ కి

ఈగ విలన్ కి ఏమైందీ..? షూటింగ్ లో అస్వస్థత అటునుంచి అటే హాస్పిటల్ కి

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈగ విలన్ గా మనకు పరిచయమైన కన్నడ స్టార్ సుదీప్ హాస్పీతల్ లో చేరాడు. బాహుబలి లోనూ కనిపించిన సుదీప్ ఇప్పుడు కన్నడలో హీరో గా "హెబ్బులి" అనే చిత్రాన్ని చేస్తున్నాడు "హెబ్బులి" చిత్రంలో డిఫరెంట్ లుక్‌లో కమెండో పాత్రను చేయనున్న సుదీప్, పాత్ర కోసం సరికొత్త కాస్ట్యూమ్స్‌తో వెరైటీ హెయిర్ స్టైల్‌తో కొత్తగా కనిపించనున్నాడు. ఈ చిత్రంలో సుదీప్ సరసన అమలాపాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

అయితే హెబ్బులి చిత్రీకరణ జరుగుతున్న సమయంలో సుదీప్ అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. .ప్ర‌స్తుతం హెబ్బులి షూటింగ్ బెంగ‌ళూరులో జ‌రుగుతోంది. ఈ మూవీ షూటింగ్‌లో భాగంగా ఓ సీన్‌ను షూట్ చేస్తున్న టైంలో ఉదయం నుంచి స్వల్ప అస్వస్థతో ఉన్న సుదీప్‌కు సాయంత్రానికి కడుపునొప్పి తీవ్రత‌రం అయ్యింది.

Kannada Star Sudeep rushed to hospital

దీంతో సోమవారం ఆయనను హుటాహుటిన నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ప్రమాదం ఏమీ లేదని గ్యాస్ట్రిక్ సమస్యవల్ల సుదీప్ అస్వస్థతకు గురయ్యాడని యూనిట్ సభ్యులు తెలిపారు. దీంతో షూటింగ్ వాయిదా పడింది.

సుదీప్ హెబ్బులి అనే చిత్రంతో పాటు ఓ బైలింగ్యువల్ మూవీలోను నటిస్తున్నాడు. "ముడింగ ఇవాన పుడి" అనే టైటిల్ తో ఈ చిత్రం తమిళంలో విడుదల కానుండగా, కోటిగొబ్బా 2 అనే టైటిల్ ని కన్నడకు ఫిక్స్ చేసారట.ఈ చిత్రాన్ని కె.స్. రవికూమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. నిత్యామీనన్, సుదీప్ సరసన కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ని కూడా విడుదల చేశారు.

English summary
kicchaa hospitalized a few days back for a severe case of acidity and was rushed to the hospital. But the actor was discharged later on the same day...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu