»   » షూటింగులో గాయపడ్డ హీరో....

షూటింగులో గాయపడ్డ హీరో....

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగుళూరు: కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర షూటింగులో గాయపడ్డారు. తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్ అయిన కాంచన-2 చిత్రాన్ని కన్నడంలో 'కల్పన 2' పేరుతో రీమేక్ చేస్తుండగా షూటింగ్ స్పాట్లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మల్లేశ్వరం ప్రాంతంలో జరుగుతోంది. సినిమాలో కబడ్డీ సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా ఉపేంద్ర గాయపడ్డాడు. దాంతో షూటింగ్ కి కొద్దిసేపు ఆపేసారు, అయితే ప్రథమ చికిత్స అనంతరం తిరిగి షూటింగ్ లో పాల్గొన్నాడు ఉపేంద్ర.

Kannada Star Upendra injured in Kalpana 2 Shooting

ఉపేంద్రకు జనవరిలో ఒకసారి కాలికి గాయం కాగా, ఇప్పుడు అదే గాయం తిరగబెట్టింది. అయినప్పటికీ ఆ గాయాన్ని ఏ మాత్రం లెక్క చేయకుండా నిర్మాత శ్రేయస్సు ని దృష్టిలో పెట్టుకొని షూటింగ్ లో పాల్గొన్నాడట ఉపేంద్ర .

ఈ చిత్రంలో ప్రియమణి, అవంతికా శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనంత రాజు దర్శకత్వం వహిస్తున్నాడు. ఉపేంద్ర ఏదైనా సినిమాకు కమిటైతే కమిట్మెంటు పని చేస్తారనే పేరుంది. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Read more about: upendra, ఉపేంద్ర
English summary
Kannada Real star Upendra was recently got injured while shooting for his upcoming Kannada movie Kalpana 2.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu