»   » నువ్వో కమేడియన్ వి దేవుడివి కాదు: ఇంకా రగులుతోన్న కమెడియన్ల గొడవ

నువ్వో కమేడియన్ వి దేవుడివి కాదు: ఇంకా రగులుతోన్న కమెడియన్ల గొడవ

Posted By:
Subscribe to Filmibeat Telugu

కామెడీ నైట్స్ విత్ కపిల్ ద్వారా దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న కపిల్ శర్మ మరోసారి తన దుండుకు చర్యల ద్వారా వార్తల్లోకి ఎక్కాడు. తన సహనటుడు సునీల్ గ్రోవర్ పై కపిల్ చేయిచేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్, సిడ్నీలలో ప్రదర్శనలు ఇచ్చి భారత్ కు తిరిగి వస్తున్న క్రమంలో విమానంలో కపిల్ శర్మ సహనటుడు సునీల్ గ్రోవర్ పై చేయిచేసుకున్నట్టు తెలిసింది. ఆ సమయంలో కపిల్ మధ్యం మత్తులో ఉన్నాడని, తన సీటు దగ్గరి నుండి లేచి గ్రోవర్ సీటు వద్దకు వచ్చిన కపిల్ శర్మ బండబూతులు గ్రోవర్ పై చేయిచేసుకున్నట్టు వచ్చిన వార్తలు కపిల్ శర్మ కామెడీ తో పరిచయం ఉన్న వాళ్లందరికీ ఆసక్తిగా కనిపించాయి... ఇంతకీ ఆరోజు ఏం జరిగిందంటే......

టీమ్ స‌భ్యుల‌పై మండిప‌డ్డాడు

టీమ్ స‌భ్యుల‌పై మండిప‌డ్డాడు

అదే విమానం లో ఉన్న ప్రత్యక్ష సాక్షి చెప్పిన కథనం ఇదీ నేను తిన‌డం మొద‌లుపెట్ట‌క‌ముందే మీరెలా తింటారంటూ క‌పిల్ టీమ్ స‌భ్యుల‌పై మండిప‌డ్డాడు. దీంతో వాళ్లంతా సగం తిన్న భోజనం ప్లేట్ల‌ను తిరిగి సిబ్బందికి ఇచ్చేశారు. ఈ స‌మ‌యంలోనే సునీల్ గ్రోవ‌ర్.. క‌పిల్‌ను బుజ్జ‌గించేందుకు ప్ర‌య‌త్నించాడు.

షూతో సునీల్‌ను కొట్టాడు

షూతో సునీల్‌ను కొట్టాడు

దీంతో క‌పిల్ సీట్‌లో నుంచి లేచి త‌న షూతో సునీల్‌ను కొట్టాడు అని ఆ వ్య‌క్తి తెలిపాడు. సునీల్ కాల‌ర్ ప‌ట్టుకొని లాగి ప‌దే ప‌దే కొట్టిన‌ట్లు చెప్పాడు. ఈ గొడ‌వ‌లో క‌పిల్ టీమ్‌లోని ఓ మహిళా స‌భ్యురాలికి కూడా గాయ‌మైంది. అయినా సునీల్‌.. అత‌న్ని శాంతింప‌జేసేందుకు ప్ర‌య‌త్నించాడు.

మీ అంద‌రి కెరీర్ నాశ‌నం చేసేస్తా

మీ అంద‌రి కెరీర్ నాశ‌నం చేసేస్తా

దీంతో క‌పిల్ మ‌రింత రెచ్చిపోయాడ‌ని, ఎకాన‌మీ క్లాస్‌లో కూర్చుకున్న ప్ర‌యాణికులకు కూడా వినిపించేలా పెద్ద‌గా తిట్ట‌డం మొద‌లుపెట్టాడ‌ని ప్ర‌త్య‌క్ష సాక్షి చెప్పాడు. మిమ్మ‌ల్ని నేను త‌యారుచేశాను. మీ అంద‌రి కెరీర్ నాశ‌నం చేసేస్తా. మీ టీవీ వాళ్లు ఏమ‌నుకుంటున్నారు? అంద‌రినీ తీసేస్తా అంటూ క‌పిల్ టీమ్ స‌భ్యుల‌ను బెదిరించిన‌ట్లు ఆ వ్య‌క్తి వెల్ల‌డించాడు.

సిబ్బంది బెదిరించాల్సి వ‌చ్చింది

సిబ్బంది బెదిరించాల్సి వ‌చ్చింది

గ‌తంలో సునీల్ ఓసారి త‌న‌ షో నుంచి వెళ్లిపోయి తిరిగి రావ‌డాన్ని కూడా ఈ సంద‌ర్భంగా అత‌ను ప్ర‌స్తావించిన‌ట్లు చెప్పాడు. క‌పిల్ గొడ‌వ ఎక్కువ కావ‌డంతో విమానం దిగ‌గానే సెక్యూరిటీని పిలుస్తామ‌ని కూడా సిబ్బంది బెదిరించాల్సి వ‌చ్చింది. అయినా క‌పిల్ మాత్రం విన‌లేదు.

షోను వ‌దిలిపెట్టారు

షోను వ‌దిలిపెట్టారు

ఈ గొడ‌వ‌తో తీవ్ర అసంతృప్తికి గురైన సునీల్ గ్రోవ‌ర్ క‌పిల్‌శ‌ర్మ షోకు గుడ్‌బై చెప్పాడు. అత‌నికి మ‌ద్ద‌తుగా అలీ అస్గ‌ర్‌, చంద‌న్ ప్ర‌భాక‌ర్ కూడా షోను వ‌దిలిపెట్టారు.ఇప్పటివరకు కూడా వీరిద్దరూ చాలా షోలు చేసారు. కానీ ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ఈ సంఘటన చోటుచేసుకోలేదు.

జరిగిన దానికి సిగ్గుపడుతున్నా

జరిగిన దానికి సిగ్గుపడుతున్నా

ఈ సంఘటన జరిగిన తర్వాత కపిల్ శర్మ గ్రోవ్ కి క్షమాపణ చెప్పారు. జరిగిన దానికి సిగ్గుపడుతున్నా అన్నారు. ట్విట్టర్ ద్వారా కపిల్అ, నిల్ గ్రోవ్ కి తన క్షమాపణ విషయాన్నీ తెలియచేసాడు. అంతేకాకుండా దీనికి ప్రతిస్పందనగా అనిల్ గ్రోవ్ కూడా రిప్లయ్ పంపాడు.

నన్ను బాగా అవమానించావు

నన్ను బాగా అవమానించావు

కపిల్ నువ్వు అంటే నాకు ఏమీ కోపంగా లేదు ముఖ్యంగా మొన్న నాకు జరిగిన షోలో నువ్వు నన్ను బాగా అవమానించావు. దానికి నేను బాగా కృంగిపోయాను అన్నాడు. అందరూ నీలాగా టాలెంటెడ్ పీపుల్ వుండరు కదా..? ఆ విషయాన్నీ నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలి.

నీలాగా సక్సెస్ అయిన వారే ఉండరు

నీలాగా సక్సెస్ అయిన వారే ఉండరు

అంతేకాకుండా మనం ఒకరికి ఒకరం గౌరవం ఇచ్చుకున్నపుడే కదా అవతలి వాళ్ళు కూడా మనల్ని గౌరవిస్తారని చెప్పాడు. కాబట్టి మనకి మనుషులకి కుసింత తారతమ్యాలు ఉంటాయి కాబట్టి వాటిని మనం అందరం పాటించాలి అన్నాడు. అలాగే అందరు నీలాగా సక్సెస్ అయిన వారే ఉండరు.

నువ్వు దేవుడివి కాదు గుర్తుపెట్టుకో

నువ్వు దేవుడివి కాదు గుర్తుపెట్టుకో

నాలాగా కొందరు వుంటారు వారిని గౌరవించినప్పుడే మనం సమాజంలో ఉండగలము అని రిప్లయ్ పంపించాడు. ముఖ్యంగా నువ్వు ఒకటి మరిచిపోకు నువ్వు దేవుడివి కాదు గుర్తుపెట్టుకో.. అంటూ ఇంకా తన కోపం తగ్గలేని చెప్పేసాడు. ఈ కమేడియన్ల గొడవ కేవలం బాలీవుడ్ కే పరిమితం కాలేదు దేశవ్యాప్తంగా కపిల్ షో ని అభిమానించే వాళ్ళంతా ఈ విషయమై చెర్చించుకుంటున్నారు.

English summary
Comedian Kapil Sharma’s ugly spat with co-star Sunil Grover happened after Kapil abused his crew for starting to eat in the flight while he was still drinking.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu