»   » అజయ్ వల్లే కాజోల్ నాకు దూరమైంది. ఫోన్ చేసి తిట్టాడు..

అజయ్ వల్లే కాజోల్ నాకు దూరమైంది. ఫోన్ చేసి తిట్టాడు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్‌పై ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు కరణ్ జోహర్ మండిపడ్డారు. అజయ్ వల్లే కాజోల్ తనకు దూరమైందని అన్నాడు. కాజోల్‌తో తన స్నేహం ముగిసిన అధ్యాయమని పేర్కొన్నాడు. కాజోల్, తనకు మధ్య సంబంధాలు చెడిపోవడానికి అజయ్ దేవగన్ కారణమని ఆరోపించారు.

 కాజోల్ గురించి ఏదో అన్నానని అజయ్ తిట్టాడు..

కాజోల్ గురించి ఏదో అన్నానని అజయ్ తిట్టాడు..


‘ఒకరోజు నాకు కాల్ చేసి ఇష్టం ఉన్నట్టు అరిచారు. ఓ పార్టీలో ఆయన భార్య కాజోల్ గురించి ఏదో అన్నానని మండిపడ్డారు. ఆయన నోటి నుంచి వినకూడని మాటలు విన్నాను. ఫొన్ ఎత్తగానే మాట్లడనివ్వకుండా దుర్భాషలాడటం సరికాదు. ఏదైనా ఉంటే ఎదుటి వ్యక్తి చెప్పుకోవడానికి కూడా అవకాశమివ్వాలి' అని కరణ్ జోహర్ అన్నాడు.

 అప్పటి నుంచి అజయ్‌తో మాటల్లేవ్..

అప్పటి నుంచి అజయ్‌తో మాటల్లేవ్..


అజయ్ తో ఆ ఫోన్ సంభాషణ జరిగినప్పటి నుంచి మాటలు లేవని చెప్పారు. ఆ వైరం చిత్రాల విడుదలపై కూడా పడింది. ఇటీవల అజయ్ ‘శివాయ్', కరణ్ ‘యే దిల్ హై ముష్కిల్' చిత్రాలను పోటాపోటిగా విడుదల చేసుకొన్నారు. అజయ్ తో ఉన్న విబేధాలను తన ఆత్మకథ అన్ సూటబుల్ బాయ్ లో ప్రస్తావించారు.

 శివయ్ సందర్భంగా తారాస్థాయికి విభేదాలు

శివయ్ సందర్భంగా తారాస్థాయికి విభేదాలు


శివయ్, యే దిల్ చిత్రాల విడుదల సందర్భంగా అజయ్, కరణ్ మధ్య విబేధాలు తీవ్రస్థాయికి చేరుకొన్నాయి. తన చిత్రం శివాయ్‌పై దుష్ఫ్రచారం చేయాలని సినీ విమర్శకుడు కమల్ ఖాన్‌కు డబ్బులు ఇచ్చాడని కరణ్‌పై అజయ్ దేవగన్ ఆరోపణలు చేశాడు. ఈ ఆరోపణలపై కరణ్ జోహర్ మండిపడ్డాడు.

 కరణ్ వ్యాఖ్యలు షాక్‌కు గురిచేశాయి.. కాజోల్

కరణ్ వ్యాఖ్యలు షాక్‌కు గురిచేశాయి.. కాజోల్


తన భర్త మరొకరిపై మండిపడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండాల్సిందని కరణ్ జోహర్ చేసిన వ్యాఖ్యలపై కాజోల్ మండిపడింది. ఆయన వ్యాఖ్యలు షాకింగ్‌గా ఉన్నాయని ఆమె ట్వీట్ చేసింది. కరణ్ జోహర్ దర్శకత్వం వహించిన కుచ్ కుచ్ హోతా హై, కభీ కుషి కభీ ఘమ్, మై నేమ్ ఈజ్ ఖాన్ చిత్రాల్లో షారుక్ పక్కన కాజోల్ నటించిన సంగతి తెలిసిందే.

English summary
Bollywood director Karan Johar said that his friendship with Kajol closed chapter. Johar blamed Kajol’s husband actor Ajay Devgn for pushing the situation over the edge.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu