»   » బాహుబలి ఎఫెక్ట్: మరో తెలుగు సినిమాను కొన్న కరణ్ జోహార్!

బాహుబలి ఎఫెక్ట్: మరో తెలుగు సినిమాను కొన్న కరణ్ జోహార్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ బాహుబలి తర్వాత మరో తెలుగు సినిమాను కొనుగోలు చేసారు. రానా ద‌గ్గుబాటి హీరోగా పివిపి బ్యాన‌ర్‌పై సంక‌ల్ప్ రెడ్డి తెర‌కెక్కిస్తున్న ఘాజి చిత్రాన్ని హిందీలో విడుదల చేయబోతున్నారు.

1971లో ఇండియా, పాకిస్థాన్ యుద్ధంలో ఇండియ‌న్ నేవీలో కీల‌క‌పాత్ర పోషించిన ఈ యుద్ధ‌నౌక స‌ముద్రంలోనే మునిగిపోయింది. దాన్ని ఆధారంగా చేసుకుని భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో విజువ‌ల్ ఎఫెక్ట్స్ ప్రేక్ష‌కుల‌ను థ్రిల్ చేసేలా రూపొందిస్తుండటంతో కరణ్ జోహార్ ఈ సినిమాను కొనడానికి ముందుకు వచ్చారు.


Karan Johar To Release Rana's Ghazi

బాహుబలి కంటే ముందు రానా హిందీ ప్రేక్షకలు సుపరిచితం. హిందీలో రెండు మూడు చిత్రాల్లో నటించాడుకూడా. 'పింక్' చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకకున్న తాప్సీ, కె.కె.మీన‌న్ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తుండ‌టంతో కరణ్ జోహార్ ఈసినిమాను తీసుకోవడానికి ఆసక్తి చూపారు.


ఈ సినిమాలో నటిస్తుండటంపై తాప్సీ చాలా హ్యాపీగా ఉంది. సహజంగా కనిపించడానికి ప్రత్యేక ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నానని చెప్తోంది. ఇలాంటి సినిమాలు ఎప్పుడో కానీ రావని, అలాంటిది ఈ సినిమాలో నటించే అవకాశం రావడం తన అదృష్టం అని చెప్తోంది.

English summary
Ghazi is India’s first Navy film which is based on the mysterious happenings that led to the sinking of the Pakistani war submarine during 1971. Prasad Potluri has produced the film under PVP Cinema banner. Going by the buzz, the Hindi version of the film will be released by popular Bollywood producer Karan Johar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu