For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కరాటే కల్యాణి వివాదంలో కొత్త మలుపు.. ఆమె కోసమే వెళ్లా.. యూట్యూబర్స్ ను వదిలేది లేదు అంటూ!

  |

  సినీనటి కరాటే కళ్యాణి అనూహ్య పరిణామాలతో మళ్లీ వార్తల్లోకి వచ్చారు. గతంలో బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా ఎంటర్ అయి తర్వాత బయటకు వచ్చేసిన ఆమె బిజెపిలో చేరి ప్రస్తుతం హిందుత్వ వాదం వినిపిస్తున్నారు. తాజాగా ఆమె శ్రీకాంత్ రెడ్డి అనే ఒక యూట్యూబర్ మీద దాడి చేసి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అయితే తొలుత రెండు లక్షలు ఇస్తాను వస్తావా అన్నట్టు మాట్లాడటంతోనే చేయి చేసుకున్నానని పేర్కొన్న ఆమె ఇప్పుడు మరో కథ తెర మీదకు తీసుకువచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే

  సినిమాలు-సీరియల్స్ లో

  సినిమాలు-సీరియల్స్ లో

  సినిమాల్లో పలు పాత్రల్లో నటించి పేరుతెచ్చుకున్నారు కరాటే కళ్యాణి. అయితే చాలా సినిమాల్లో కనిపించారు కానీ ఎక్కువగా ఫేమస్ అయింది మాత్రం కృష్ణ అనే సినిమాలో బ్రహ్మానందం ఇంట్లో పనిమనిషి క్యారెక్టర్ ద్వారానే.. ఆ సినిమాలో బ్రహ్మానందంతో ఎఫైర్ నడిపించే పనిమనిషిగా ఆమె నటించి ప్రేక్షకుల అందరినీ అలరించింది. ఆ తర్వాత కూడా సినిమాల్లో అడపాదడపా కనిపిస్తూ వచ్చిన ఆమె సీరియల్స్ లో కూడా మంచి పాత్రలే చేసింది.

  మార్చి చెప్పారు

  మార్చి చెప్పారు

  అనూహ్యంగా బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తర్వాత ఎలిమినేట్ అయి బయటకు వచ్చాక కొన్నాళ్లపాటు ఏలాంటి ఆఫర్లు రాక పోవడంతో బీజేపీ తీర్థం పుచ్చుకుని బీజేపీలో యాక్టివ్ అయ్యారు. దీంతో బీజేపీ హిందుత్వ వాదం తలకెత్తుకొని గోరక్షణ వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. అనూహ్యంగా ఆమె శ్రీకాంత్ రెడ్డి అనే యూట్యూబర్ మీద దాడి చేయడంతో వార్తల్లోకెక్కారు.. అయితే అసలు ఏం జరిగిందో ముందు ఒక రకంగా చెప్పిన ఆమె తర్వాత పలు మీడియా సంస్థలతో మాట్లాడుతూ దాన్ని మార్చి చెప్పారు.

  ఇల్లు కొనుక్కుని

  ఇల్లు కొనుక్కుని

  తొలుత శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి తనను అసభ్యంగా మాట్లాడాడని, అసభ్యంగా ఒంటి మీద చేతులు వేసాడు అని అందుకే అతని మీద దాడి చేశానని ఆరోపించిన ఆమె, ఇప్పుడు మాత్రం డబ్బులు ఇస్తాను వస్తావా అని అసభ్యంగా మాట్లాడటంతో దాడి చేశాను అని పేర్కొన్నారు. తన సోదరుడు కొత్తగా ఇల్లు కనుక్కున్నాడు అని ఆ ఇంటి షిఫ్టింగ్ ప్రాసెస్ లో ఉండగా తాను యూసఫ్ గూడ ప్రాంతానికి వెళ్లానని ఆమె పేర్కొన్నారు.

  ఆమె చెప్పడంతోనే

  ఆమె చెప్పడంతోనే

  అదే ప్రాంతంలో తనకు తెలిసిన అమ్మాయి శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి తనతో యూట్యూబ్ వీడియోలు చేసి అవి డిలీట్ చేయమంటే చేయడం లేదని అతనిని కొంచెం భయపెట్టి వీడియోలు డిలీట్ చేయమని కోరిందని, ఆ అమ్మాయి అదే రోడ్డు మీద వెళుతూ శ్రీకాంత్ రెడ్డి ఇల్లు ఇక్కడే అని మీరు ఒకసారి చెబితే వింటాడు అని పేర్కొందని కరాటే కళ్యాణి చెప్పుకొచ్చారు..

  నీకైతే రెండు లక్షలు అంటూ

  నీకైతే రెండు లక్షలు అంటూ

  ఈ నేపథ్యంలోనే శ్రీకాంత్ రెడ్డి ఇంటి వద్దకు వెళ్లి చూడగా అప్పటికే అతను బాల్కనీలో నుంచుని ఉన్నాడు అని శ్రీకాంత్ రెడ్డి అంటే మీరేనా అని చాలా మర్యాదగా అడిగానని నేనే ఏంటి అని చాలా దురుసుగా అడిగాడు అని ఆమె పేర్కొన్నారు. అయినా సరే నేను మీతో మాట్లాడాలి మీరు వస్తారా నన్ను పైకి రమ్మంటారా అని అడిగాను అయితే అతను నిర్లక్ష్యంగా అసలు నువ్వు ఎవరు నేను వీడియోలు డబ్బులు ఇచ్చి చేస్తాను ఇప్పుడు ఇంకా ఏమీ లేదు అని అన్నాడని అన్నారు. వాళ్ళకు కాబట్టి 10000, 15000 ఇచ్చి వీడియోలు చేస్తున్నాను అదే నీకు అయితే రెండు లక్షలు ఇచ్చి చేస్తాను, నువ్వు కూడా అలాగే డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పాలని అన్నాడని కరాటే కళ్యాణి పేర్కొంది..

  ఎవరినీ వదలను

  ఎవరినీ వదలను

  అప్పటికే తనకు కోపం నషాలానికి అంటుతున్నా మరోసారి గట్టిగా మీరు కిందకు వస్తారా నన్ను పైకి రమ్మంటారా అని అడిగితే అతని కిందకు వచ్చాడని, కిందికి వచ్చాక కూడా అసభ్యంగా మాట్లాడుతూ నేను ప్రాంక్స్ డబ్బులు ఇచ్చే చేస్తున్నాను, అలాగే చేస్తానని చాలా దురుసుగా ప్రవర్తించాడని కరాటే కళ్యాణి పేర్కొంది. ఇక ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన కళ్యాణి ఇలాంటి వీడియోలు చేసి ఎవరిమీ వదిలేది లేదని, ఇంకా ఎవరో ప్రాంక్ పోరీలు దివ్య అని, కత్తర్ పాప అని ఉన్నారని వాళ్లను కూడా బయటకు లాగుతామని హెచ్చరించారు.. ఇలాంటి వీడియోలు చేసి యువతను చెడగొడుతున్నారు అని కరాటే కళ్యాణి ఆరోపించారు.

  English summary
  Karate kalyani says a new version on street fight with youtuber srikanth reddy.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  Desktop Bottom Promotion