ఫోటోలు : కరిష్మా బర్త్‌డే సెలబ్రేట్ చేసిన కరీనా
లండన్ : బాలీవుడ్ హీరోయిన్ కరిష్మా కపూర్ తన 39వ పుట్టినరోజు వేడుకలను ఇటీవల లండన్లో చెల్లి కరీనా కపూర్‌తో కలిపి జరుపుకుంది. ఈ ప్రత్యేకమైన రోజు అక్కయ్య కోసం స్పెషల్ డైమండ్ బ్రాస్ లెట్ గిఫ్టుగా ఇచ్చింది కరీనా. ఈ బర్త్ డే పార్టీలో కరీనా బర్త సైఫ్ అలీ ఖాన్ కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది.
కరీనా కపూర్‌ను తన కూతురులా చూసుకుంటానని కరిష్మా గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కరీనా లాంటి సోదరి తనకు లభించడం తన జీవితానికి లభించిన గొప్ప బహుమతిగా భావిస్తానని తెలిపారు. ఇద్దురు అక్కాచెల్లెల్లూ ఎల్లప్పుడూ ఒకరికొకరు మద్దతుగా, ఎవరూ వేరు చేయలేని విధంగా కలిసి ఉంటారట.
రన్‌ధీర్ కపూర్, బబితల పెద్ద కూతురైన కరిష్మా ప్రేమఖైదీ చిత్రం ద్వారా బాలీవుడ్ కెరీర్ ప్రారంభించారు. రాజా హిందుస్తానీ, దిల్ తో పాగల్ మై, జుబేదా, ఫిజా చిత్రాల్లో కరిష్మా తన అద్భుతమైన, మెమొరబుల్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. వ్యాపార వేత్త సంజయ్ కపూర్‌ను కరిష్మా పెళ్లాడారు. వీరికి ఒక ఆడ, ఒక మగ సంతానం. స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...

కరిష్మా తన 39వ పుట్టినరోజు వేడుకను లండన్ లో సోదరి కరీనాతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది.

కరిష్మా కపూర్ లండన్ రావడంతో అక్కడ ఆమెను చూసిన కొందరు ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపారు.

లండన్లో జరిగిన కరిష్మా పుట్టినరోజు వేడుకల్లో కరీనా భర్త సైఫ్ అలీ ఖాన్ కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది.

ఈ ఫోటోలో అక్కాచెల్లెళ్లు ఎంతో చూడముచ్చటగా కనిపిస్తున్నారు కదూ. కరిష్మాకు పుట్టినరోజు కానుకగా స్పెషల్ డైమండ్ బ్రాస్‌లెట్ గిఫ్టుగా ఇచ్చిందట కరీనా.

ఓ సినిమా ఫంక్షన్లో కరిష్మా కపూర్, కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ కలిసి ఇలా స్టైలిష్ గా ఫోటోలకు ఫోజు ఇచ్చారు.

కరీనా పెళ్లి వేడుకలో అక్కాచెల్లెళ్లు ఇలా ఫోజు ఇచ్చారు.

హీరోయిన్ సినిమా షూటింగ్ సందర్భంగా కరిష్మా సెట్స్ ను సందర్శించింది. ఆ సందర్భంగా దిగిన ఫోటో ఇది.

కూతురు సమీరాతో కలిసి కరిష్మా, కరీనా

కరిష్మా కపూర్ భర్త సంజయ్ కపూర్‌తో కలిసి కరీనా కపూర్ ఇలా ఫోటోలకు ఫోజు ఇచ్చారు.

అభిమానులను ఈ ఇద్దరు స్టార్ సిస్టర్స్ ఎంతగానో ప్రేమిస్తారు. వారు ఎక్కడ కనిపించినా తప్పకుండా వారితో ఫోటోలు దిగడానికి ఇష్టపడతారు.

సెక్సీ లుక్ విషయంలో ఈ ఇద్దరు అక్కా చెల్లెళ్లు ఎవరికి వారే సాటి. ఒకప్పుడు కరిష్మా బాలీవుడ్‌ను ఓ ఊపు ఊపితే, ఇప్పుడు కరీనా తన హవా చాటుతోంది.


Click it and Unblock the Notifications











