»   » మరింత నాజుకుగా కరీనా.. 3 నెలల్లో 16 కేజీల బరువు హాంఫట్.. వీడియో వైరల్

మరింత నాజుకుగా కరీనా.. 3 నెలల్లో 16 కేజీల బరువు హాంఫట్.. వీడియో వైరల్

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  చోటా నవాబ్ సైఫ్ ఖాన్‌ అలీతో పెళ్లి, కుమారుడు తైమూర్ పుట్టిన తర్వాత కరీనా కపూర్ ఖాన్ తన అందానికి మరింత మెరుగులు దిద్దుకొంటున్నది. బాలీవుడ్‌లో కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చేంతగా నాజుకుగా తయారైంది కరీనా. తాజాగా తుషార్ కపూర్ కుమారుడు లక్ష్య తొలి పుట్టిన రోజు వేడుకలో కరీనా కపూర్ అందం చూసి పలువురు ప్రముఖులు ఆశ్చర్యానికి గురయ్యారట. ప్రస్తుతం కరీనా కపూర్‌కు తాజా చిత్రాలు, వర్కవుట్ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

  మూడు నెలల్లో 16 కేజీలు

  మూడు నెలల్లో 16 కేజీలు

  కుమారుడు తైమూర్ పుట్టిన తర్వాత బాలీవుడ్‌లో పాగా వేసేందుకు కరీనా కపూర్ తీవ్రంగా కసరత్తులు చేస్తున్నది. గత మూడు నెలల్లో దాదాపు 16 కేజీల బరువు తగ్గింది. అందుకోసం కఠినమైన వర్కవుట్లు చేసింది అని బాలీవుడ్‌కు చెందిన మ్యాగజైన్ కథనాన్ని వెలువరించింది.

  12 వారాలపాటు..

  తైమూర్‌కు జన్మనిచ్చిన తర్వాత 12 వారాలపాటు ఉదరానికి సంబంధించిన ఎక్సర్‌సైజులు, యోగా లాంటి తీవ్రంగా చేసింది. ముంబై బాంద్రాలోని అమృతా అరోరా జిమ్‌లో ప్రత్యేకంగా వర్కవుట్లు చేసింది. దాంతో ఆమె ఎక్కువ బరువును కోల్పోయింది అని కథనంలో పేర్కొన్నది.

  ఒమంగ్ కుమార్ బయోపిక్‌లో..

  ఒమంగ్ కుమార్ బయోపిక్‌లో..

  ప్రముఖ బాక్సర్ మేరీకోమ్ బయోపిక్‌ను రూపొందించిన దర్శకుడు ఒమంగ్ కుమార్ తీయబోయే మరో బయోపిక్‌లో నటించేందుకు కరీనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ చిత్రం కోసమే కరీనా తన బరువును తగ్గించుకొనేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తున్నది.

  అక్షయ్ కుమార్ సరసన..

  అక్షయ్ కుమార్ సరసన..

  ప్రస్తుతం వీరే ది వెడ్డింగ్ అనే చిత్రం కరీనా కపూర్ నటిస్తున్నది. ఈ చిత్రాన్ని బాలాజీ ఫిల్మ్స్ అధినేత్రి ఏక్తా కపూర్ నిర్మిస్తున్నది. ఈ చిత్రంలో సోనమ్ కపూర్, స్వర భాస్కర్ తదితరులు నటిస్తున్నారు. అంతేకాకుండా అక్షయ్ కుమార్ నటిస్తున్న పాడ్‌మన్ చిత్రంలో కనిపించనున్నది.

  English summary
  Kareena Kapoor Khan has been working out to get back in shape after the birth of her son Taimur. And that has paid off as the actress has lost 16 kilos in three months. Kareena, who started working out 12 weeks after delivering Taimur does pilates and yoga regularly. She is frequently spotted outside a gym at Bandra with her friend Amrita Arora Ladak.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more