»   » గర్భం దాల్చడం, మాతృత్వంపై టిప్స్ ఇస్తున్న హాట్ హీరోయిన్

గర్భం దాల్చడం, మాతృత్వంపై టిప్స్ ఇస్తున్న హాట్ హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

న్యూఢిల్లీ: గర్భం దాల్చడం, బిడ్డకు జన్మనివ్వడం, ప్రెగ్నెన్సీ తర్వాత పెరిగే బరువు వంటి అంశాల గురించి సరైన అవగాహన లేక సతమతం అవుతున్నారా? ఇలాంటి విషయాలపై ఇకపై ఎలాంటి బెంగ అవసరం లేదంటోంది బాలీవుడ్ హాట్ హీరోయిన్ కరిష్మా కపూర్. ఇప్పటికే ఇద్దరికి జన్మనిచ్చిన కరిష్మా ఇలాంటి అంశాల గురించి కూలంకశంగా వివరిస్తూ ఓ పుస్తకం తయారు చేసింది.

'మై యమ్మీ మమ్మీ గైడ్' పేరుతో రూపొందిన ఈ పుస్తకారం మంగళవారం(సెప్టెంబర్ 17)న విడుదలైంది. గుర్గావ్‌లోని ల్యాండ్ మార్క్ బుక్ స్టోర్‌లో ఈ పుస్తకం విడుదల కార్యక్రమం జరిగింది. గర్భం దాల్చడం, మాతృత్వం లాంటి అంశాలతో ఈ పుస్తకం అందకినీ అర్థమయ్యే రీతిలో ఉంటుంది.

Karisma Kapoor

'ఈ పుస్తకం భారతీయ మహిళలకు గర్భం, మాతృత్వం వంటి విషయాల్లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది' అని 39 ఏళ్ల కరిష్మా వెల్లడించింది. ప్రెగ్నెన్సీ తర్వాత భారీగా పెరిగిన శరీర బరువును ఎలా తగ్గించుకోవాలనేదానిపై ఇందులో పలు చిట్కాలు కూడా ఉన్నాయట.

కరిష్మా ఇద్దరు పిల్లలకు తల్లి. ఆమెకు 7 సంవత్సరాల కూతురు సమైరాతో పాటు, 2 సంవత్సరాల వయసున్న కుమారుడు కియాన్ ఉన్నారు. ఇటు ఇంటి బాధ్యతలను, అటు తన నట జీవితాన్ని అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తోందిన కరిష్మా. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత కూడా తన శరీరాన్ని ఎంతో అందంగా మెయింటేన్ చేస్తోంది.

English summary
Worried about pregnancy, childbirth, post pregnancy weight and more related topics? All you desi mothers have a new book in store for you. Bollywood actress Karisma Kapoor launched her book 'My Yummy Mummy Guide' on Tuesday, September 17. The book is on pregnancy and motherhood.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu