»   » పూనంపాండే కోర్టు కేసు...స్వల్ప వూరట

పూనంపాండే కోర్టు కేసు...స్వల్ప వూరట

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగళూరు : వివాదాస్పద నటి పూనంపాండేకు ఆరో అదనపు మేజిస్ట్రేట్‌ కోర్టు జారీ చేసిన వారెంటుపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ హెచ్‌.ఎన్‌.నాగమోహనదాస్‌ స్టే ఇచ్చారు. భారత క్రికెట్‌ జట్టు ప్రపంచ కప్‌ గెల్చుకుంటే జట్టు ముందు తాను నగ్న ప్రదర్శన చేస్తానని ప్రకటించటంతో పాటు తన దుస్తులపై దేవతల చిత్రాలతో పూనంపాండే పలుమార్లు బహిరంగ ప్రదర్శనలు ఇవ్వటంపై న్యాయవాది ఉమేష్‌ ఆరో ఏసీఎంఎం కోర్టులో అర్జీ వేశారు. పలుమార్లు ఆమె విచారణకు గైర్హాజరయ్యారు.

జనవరి 10వ తేదీన విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఆ విచారణకూ గైర్హాజరు కావటంతో ఫిబ్రవరి 12వ తేదీ నాటి విచారణకు పూనమ్‌ పాండేను హాజరు పరచాలంటూ ఏసీఎంఎం కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. ఈ ఆదేశాల్ని ప్రశ్నిస్తూ పూనమ్‌ పాండే తరపు న్యాయవాది హైకోర్టులో అర్జీ వేశారు. అర్జీను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చారు.

అందాల ఆరబోతతో పబ్లిసిటీ పెంచుకోవడం ఎలానో పూనమ్ పాండేకు తెలిసినంతగా ఎవరికీ తెలియదేమో. కింగ్ ఫిషర్ క్యాలెండర్‌పై అందాలు ఆరబోయడం మొదలైన పూనమ్ పాండే జోరు...ఆ తర్వాత ట్విట్టర్ వేదికగా చేసుకుని తన అందాల ఆరబోతతో సెన్సేషన్ సృష్టిస్తూ ముందుకు సాగింది. దేశంలోని ప్రముఖులపై కామెంట్లు చేస్తూ మీడియా దృష్టిని తన వైపుకు తిప్పుకుంది.

కెమెరా ముందు శృంగార సీన్లు చేయడానికి తాను ఎలాంటి ఇబ్బంది ఫీలవ్వనని తెగేసి చెప్పింది. పూనమ్ తన తొలి సినిమా 'నషా'లో కూడా శృంగార సీన్లు ఇరగదీసింది. ఆ సినిమా ప్లాపైనప్పటికీ ఆ సీన్లను మాత్రం ఆమె అభిమానులు బాగా ఎంజాయ్ చేసారు. పూనమ్ ఇలా బోల్డ్ స్టేట్‌మెంట్ ఇవ్వడం వెనక....సినిమా అవకాశాలు దక్కించుకోవాలనే మెగాప్లాన్ ఉందని పలువురి వాదన. కాగా....పూనమ్ ప్రస్తుతం ఐటం సాంగులపై దృష్టి సారించింది. కన్నడలో 'లవ్ పాయిజన్' అనే చిత్రంలో స్పెషల్ సాంగు చేసింది.

English summary
The Karnataka high court on granted an interim stay on the execution of a warrant issued by a city court against model Poonam Pandey. Justice HN Nagamohan Das passed this order following a petition filed by her.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu