»   » ‘మల్లిగాడు’గా వస్తున్న హీరో కార్తి

‘మల్లిగాడు’గా వస్తున్న హీరో కార్తి

Posted By:
Subscribe to Filmibeat Telugu
యుగానికి ఒక్కడు, ఆవారా, నా పేరు శివ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ హీరో కార్తి త్వరలో 'మల్లిగాడు'గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కార్తి తమిళంలో నటించిన 'పారుతి వీరన్' చిత్రాన్ని తెలుగులో 'మల్లిగాడు' పేరుతో అనువదిస్తున్నారు.

ఈ చిత్రంలో ప్రియమణి హీరోయిన్ గా నటించింది. ప్రియమణి పోషించిన ఆ పాత్రకు జాతీయ అవార్డు కూడా దక్కింది. తమిళ టాప్ డైరెక్టర్లలో ఒకరైన అమీర్ సుల్తాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సూర్య పల్లెటూరి యువకుడి పాత్రలో నిపించనున్నాడు.ఈ ప్రేమ కథా చిత్రంలో ప్రేక్షకుల గుండెలు పిండేసేలా ఉండే ఈ చిత్ర క్లైమాక్స్ సినిమాకు హైలెంట్ అంటున్నారు.

పారుతి వీరన్ చిత్రం తమిళనాడులో ఫిబ్రవరి 23, 2007లో విడుదలై భారీ విజయం సాధించింది. 365 రోజులు నడిచిన సినిమాగా సినిమాగా రికార్డులకెక్కింది. అప్పుడు కేవలం రూ. 5 కోట్లతో నిర్మాణమైన ఈచిత్రం బాక్సాఫీసు వద్ద రూ. 65 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ చిత్రానికి ఎడిటింగ్: రాజా మహ్మద్, సినిమాటోగ్రఫీ: రామ్ జీ, సంగీతం యువన్ శంకర్ రాజా, నిర్మాత: కె.ఇ గ్నానవేల్ రాజా.

English summary
Tamil Actor Surya’s brother Karthi, who has already impressed Telugu audience with films like Yuganiki Okkadu, Aawara and Naa Peru Shiva, is all set to strike again with another dubbed film. Karthi’s debut film Paruthi Veeran is being dubbed in Telugu as Malligadu.
Please Wait while comments are loading...