»   » బాహుబలి చేస్తూ పెరిగాను, మనసుని తాకేలా... ఎస్.ఎస్.రాజమౌళి కుమారుడి లేఖ

బాహుబలి చేస్తూ పెరిగాను, మనసుని తాకేలా... ఎస్.ఎస్.రాజమౌళి కుమారుడి లేఖ

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి.. టాలీవుడ్ స్థాయిని ప్రపంచ వ్యాప్తంగా చర్చల్లోకి తీసుకెళ్లిపోయిన ప్రాజెక్ట్ ఇది. తెలుగు నుంచి ఇలాంటి సినిమా వస్తుందని ఎవరూ ఊహించని రేంజ్ ను అందుకుంది. దేశంలో తొలిసారిగా వెయ్యి కోట్ల రూపాయల కలెక్షన్ ను అందుకునే చిత్రంగా బాహుబలి2 నిలవనుందని అంచనా వేస్తున్నారంటే.. ఈ మూవీ స్థాయి అర్ధమవుతుంది.

బాహుబలి ది కంక్లూజన్

బాహుబలి ది కంక్లూజన్

ఏప్రిల్ 28న బాహుబలి ది కంక్లూజన్ రిలీజ్ కానుంది. ఇవాళ రేపటి నుంచి ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను హై లెవెల్ లో స్టార్ట్ చేసేయనున్నారు జక్కన్న అండ్ టీం. బాహుబలి2కి ముందు రెండు వారాలు.. వెనుక 4 వారాలు మరో సినిమా రిలీజ్ చేసేందుకు ఏ భాషలోనూ ఎవరూ ధైర్యం చేయడం లేదంటే.. బాహుబలి ఎంతగా భయపెడుతున్నాడో అర్థమైపోతుంది...

ఒక ఎమోషనల్ లెటర్

ఒక ఎమోషనల్ లెటర్

ఐదేళ్లకు పైగా సుదీర్ఘంగా సాగిన 'బాహుబలి' ప్రయాణం ముగింపు దశకు వచ్చేసిన నేపథ్యంలో కార్తికేయ ఒక ఎమోషనల్ లెటర్ రాసి.. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అది ఫిలిం సర్కిల్స్‌లో చర్చనీయాంశం అవుతోంది. నెటిజన్లు కూడా దాని గురించి చాలా పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు.

ఆరేళ్లకు పైగా కాలం

ఆరేళ్లకు పైగా కాలం

నిర్మాణం ప్రారంభమయ్యాక నాలుగేళ్లకు పైగా ఈ ప్రాజెక్ట్ సమయం తీసుకుందనే విషయం తెలిసిందే కానీ.. అసలీ ప్రాజెక్ట్ పనులు మొదలైనప్పటి నుంచి ఆరేళ్లకు పైగా కాలాన్ని బాహుబలి కోసం వెచ్చించారు బాహుబలి అండ్ టీమ్. ఒక సినిమా కోసమే అయిదేళ్ళకు పైబడి పని చేయటం ఇన్ని సంవత్సరాల భారతీయ సినీ చరిత్రలోనే జరగలేదు.

జీవితాంతం గుర్తుంచుకునే ప్రయాణం

జీవితాంతం గుర్తుంచుకునే ప్రయాణం

'బాహుబలి' తన జీవితాంతం గుర్తుంచుకునే ప్రయాణం అని.. ఈ సినిమాకు తొలి అడుగు పడే సమయానికి తనకు 19 ఏళ్లు మాత్రమే అని.. ఇది పూర్తయ్యేటప్పటికి తనకు 26 ఏళ్లు వచ్చాయని.. ఈ ఆరేడేళ్లలో తాను ఎంత ఎదిగానో మాటల్లో చెప్పలేనని అన్నాడు కార్తికేయ. వ్యక్తిగతంగా.. వృత్తిగతంగా తనలో ఎంతో మార్పు వచ్చిందని.. ఈ ప్రయాణంలో తాను కలిసిన ప్రతి వ్యక్తి నుంచీ ఎంతో నేర్చుకున్నానని కార్తికేయ అన్నాడు.

19 ఏళ్ల పిల్లాడిని

19 ఏళ్ల పిల్లాడిని

'బాహుబలి ప్రయాణం నా జీవితంలో చాలా కీలకం. ఈ ప్రాజెక్ట్ పనులు మొదలైనపుడు నా వయసు 19 ఏళ్ల పిల్లాడిని. ఇప్పుడు 26 ఏళ్ల యువకుడిని. అంటే నా లైఫ్ లో కీలకమైన వయసును బాహుబలితోనే గడిపాను. ఓ వ్యక్తి నమ్మకానికి ఇది సిసలైన పరీక్ష. మా మధ్య ఎన్నో అనుబంధాలను కూడా ఈ చిత్రం నెలకొల్పింది.

శోభు యార్లగడ్డ

శోభు యార్లగడ్డ

నిర్మాత శోభు యార్లగడ్డ లేకపోతే ఇంతటి కల తీరేది కాదు. మొదటి భాగం విడుదల సమయంలో తొలి రెండు రోజులు టాక్ తేడా వచ్చినపుడు.. ఆయన ఒక్కరే నమ్మకంగా నిలవగలిగారు. ఆయన నమ్మకమే ఈ చిత్రాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లింది' అంటూ బాహుబలి ప్రయాణంపై వివరించాడు ఎస్ ఎస్ కార్తికేయ.

డివైడ్ టాక్ వచ్చినపుడు

డివైడ్ టాక్ వచ్చినపుడు

'బాహుబలి: ది బిగినింగ్'కు తొలి రెండు రోజులు డివైడ్ టాక్ వచ్చినపుడు తామంతా కంగారు పడితే.. శోభు మాత్రం ధైర్యంగా నిలబడ్డాడని.. సినిమాను అద్భుతంగా ప్రమోట్ చేసి గొప్ప స్థాయికి తీసుకెళ్లాడని.. నావల్స్, వీఆర్, కామిక్స్.. ఇలా ఎన్నో విధాలుగా సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాడని చెప్పాడు.

వల్లి పిన్ని

వల్లి పిన్ని

'వల్లి పిన్ని చూపించిన పట్టుదల అమోఘం. ఎప్పటికప్పుడు మమ్మల్ని మోటివేట్ చేస్తూనే ఉంది. ఊహలను వాస్తవం చేసేందుకు ఆకాశమే హద్దు అనేందుకు ఈ ప్రాజెక్ట్ నిదర్శనం.. బాబా- అమ్మా-మయూ.. నా జీవితంలో ఎంతో ముఖ్యమైన ఈ ప్రయాణాన్ని మీతో కలిసి షేర్ చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది ' అంటూ బాహుబలి తో తన అనుబందాన్నీ, అనుభవాన్నీ చెప్పాడు కార్తికేయ....

English summary
"A journey etched so deep into me! A journey that defined me! A journey called #Baahubali!" Tweeted SS Karthikeya Who is the Sone of Rajamauli, hi attached a Letter To the Tweet...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu