»   » బాహుబలి షూటింగులో తిట్టాడు, అమ్మ దగ్గర వడ్డీకి డబ్బులు తీసుకున్నా: కార్తికేయ

బాహుబలి షూటింగులో తిట్టాడు, అమ్మ దగ్గర వడ్డీకి డబ్బులు తీసుకున్నా: కార్తికేయ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'బాహుబలి 2' సినిమా రిలీజ్ వేళ సినిమాకు పని చేసిన వారంతా మీడియా ఇంటర్వ్యూల్లో బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా కార్తికేయ ఓ టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

ఫస్ట్ పార్ట్ రిలీజ్ అప్పుడు భయం ఉండింది. ఫస్ట్ రెండు రోజులు బ్యాడ్ టాక్ రావడంతో అంతా అయిపోయింది.. ఇక రెండో పార్టు తీస్తామో లేదో అనే గంధరగోళంలో పడ్డామంతా. కానీ అద్భుతం జరిగింది. సినిమా పెద్ద హిట్టయింది. రెండో పార్ట్ విషయంలో ఎలాంటి భయం లేదు. ఫస్ట్ పార్టులో పాత్రల పరిచయం మాత్రమే జరిగింది. సోల్ ఆఫ్ ది ఫిల్మ్ సెకండ్ పార్టులోనే ఉంది. అందుకే ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నామని కార్తికేయ తెలిపారు.

బాహుబలిలో సీన్లు ఆ సీన్లు డైరెక్ట్ చేసా

బాహుబలిలో సీన్లు ఆ సీన్లు డైరెక్ట్ చేసా

సెకండ్ పార్టులో నేను ఎక్కువగా వార్ సీన్లు తీసాను. డ్రామా చాలా తక్కువ. రానాతో కొద్దిగా అక్కడక్కడ డ్రామా సీన్లు తీసాను. డ్రామా సీన్లు ఎమోషన్ తో కూడుకుని ఉంటాయి. వాటిని తీయడం చాలా కష్టం. వాటిని నాకు ఇచ్చినా చేయనని చెబుతాను అని కార్తికేయ తెలిపారు.

చత్రపతి సమయంలోనే

చత్రపతి సమయంలోనే

చత్రపతి సినిమా సమయంలో నేను 8వ తరగతి చదువుతున్నాను. అపుడు ఇంటికిందే ఎడిటింగ్ రూమ్ ఉండేది. ఎడిటింగ్ రూమ్ లో వెళ్లి కూర్చునే వాడిని. అపుడు నేను నస పెడితే రవి అనే ఎడిటింగ్ అసిస్టెంట్ నాకు ఎడిటింగ్ నేర్పించాడు. ఫస్ట్ టైమ్ చత్రపతికి 30 సెకన్స్ ఎడిట్ చేసాను. నాన్న దాన్ని చూసి చాలా బావుంది అన్నారు. నాన్న అలా అనగానే ఆ వయసులో ఏదో చేసేసామనే ఫీలింగ్ వచ్చింది. ముందు నుండి నాకు ఎడిటంగ్ అంటే చాలా ఇష్టమని కార్తికేయ తెలిపారు.

అమ్మదగ్గర వడ్డీకి డబ్బులు

అమ్మదగ్గర వడ్డీకి డబ్బులు

ఈగ సినిమా స్టార్ అయినపుడు ఫస్ట్ టైం మా అమ్మదగ్గర వడ్డీకి డబ్బులు తీసుకుని కెమెరా కొనుకుని ఈగకు మేకింగ్ వీడియోలు స్టార్ట్ చేసాను. తర్వాత నాలుగుదైదు సినిమాలకు చేసి నాలుగైదు కెమెరాలు కొని నాకంటూ ఓ టీంను ఏర్పాటు చేసుకున్నా... కీరవాణి బాబాయ్ మా టీంకు షోయింగ్ బిజినెస్ అని పేరు పెట్టారు అని కార్తికేక తెలిపారు.

చాలా సార్లు తిట్టారు

చాలా సార్లు తిట్టారు

బాముబలి అరేంజింగుల్లో ఉన్నపుడు సరిగా చేయకపోతే తిట్టడం మామూలే. చిన్నప్పటి నుండి నాకు తిట్లు అలవాటే... తిడితే ఫీలయ్యే రకం కాదు మనం. స్కూల్ రోజుల నుండి టీచర్ల తిట్లు, అమ్మ తిట్లు.... ఎన్ని తిట్లు తింటే అన్ని మెంట్లు పైకెక్కుదాం అన్నట్లుగా నా బిహేవియర్ ఉండేది అని కార్తికేయ తెలిపారు.

డైరెక్టర్ అవుదామనుకున్నా

డైరెక్టర్ అవుదామనుకున్నా

నాకు డైరెక్టర్ అవుదామని ఉండేది. మర్యాద రామన్న సినిమా అయిపోయింది ఈగ సినిమా సమయానికి డైరెక్షన్ డిపార్టు మెంటులో చేరుదామనుకున్నాను. కానీ అమ్మ అటు వైపు వద్దని అంది. డైరెక్షన్ డిపార్టుమెంటులో వద్దు నా కోసం ఒక నెల రోజులు ప్రొడక్షన్ డిపార్టుమెంటులో చేయ్... నీకు నచ్చకపోతే డైరెక్షన్ డిపార్టుమెంటులో చేరు అని చెప్పింది. ప్రొడక్షన్ డిపార్టుమెంటులో చేరిన తర్వాత నాకు తెలియకుండా దాన్ని ఎంజాయ్ చేయడం మొదలు పెట్టాను. అంతకు ముందు మ్యూజిక్ అని, హోటల్ మేనేజ్మెంట్ చాలా ట్రై చేసాను. ఫైనల్ గా ప్రొడక్షన్ డిపార్టుమెంటులో సెటిలయ్యాను అని కార్తికేయ తెలిపారు.

English summary
Karthikeya interview about Baahubali 2 movie. Baahubali 2: The Conclusion is an upcoming Indian epic historical fiction film directed by S. S. Rajamouli. It is the continuation of Baahubali: The Beginning.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu