Don't Miss!
- News
అజ్మీర్ దర్గాకు చాదర్ సమర్పించిన సీఎం KCR
- Sports
Australia Open 2023 ఫైనల్లో సానియా జోడీ!
- Lifestyle
లైఫ్ పార్ట్నర్తో మరింత రొమాంటిక్‌గా ఎలా ఉండాలో తెలుసా?
- Finance
అదరగొట్టిన జున్‌జున్‌వాలా కంపెనీ.. షేర్లు కొనేందుకు ఎగబడతున్న ఇన్వెస్టర్లు
- Technology
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- Automobiles
'బొలెరో నియో లిమిటెడ్ ఎడిషన్' లాంచ్ చేసిన మహీంద్రా.. ధర ఎంతో తెలుసా?
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
మొగుడు పోయిన పెళ్ళాన్ని కూడా వదలవా.. చావు కబురు చల్లగా అంటూ కార్తికేయ మాసీ లుక్
టాలెంటెడ్ హీరో కార్తికేయ ఎలాంటి పాత్ర చేసినా అందులో ఎదో ఒక కొత్తదనం ఉండేలా చూసుకుంటున్నాడు. ఫామ్ లో ఉన్నప్పుడు ఇష్టం ఉన్నట్లు సినిమాలు చేయకుండా కేవలం తనకు సెట్టయ్యే మంచి కంటెంట్ ఉన్న కథలని సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఇక ఫైనల్ గా ఈ హీరో గీత ఆర్ట్స్ దృష్టిలో పడ్డాడు. నెక్స్ట్ ఆ బ్యానర్ సపోర్ట్ తో రానున్న చావు కబురు చల్లగా అనే సినిమా ఫస్ట్ గ్లింప్స్ ని విడుదల చేశారు. కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా విసుదలైన ఆ ఫస్ట్ గ్లింప్స్ నెటిజన్స్ ని అమితంగా ఆకట్టుకుంటోంది.

అంచనాలు డోస్ పెంచిన ఫస్ట్ గ్లింప్స్
గీత ఆర్ట్స్ అనుబంధ సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతున్న చావు కబురు చల్లగా సినిమాపై ఓ వర్గం అభిమానుల్లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఎందుకంటే ‘ఆర్ఎక్స్ 100' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ మరొక డిఫరెంట్ పాత్రలో కనిపిస్తున్నట్లు అర్ధమవుతోంది. ఇక విడుదలైన గ్లింప్స్ అంచనాల డోస్ కూడా పెంచింది.

శవాల్ని స్మాశానాలకు తీసుకెళ్లే వ్యాన్ డ్రైవర్..
శవాల్ని స్మాశానాలకు తీసుకెళ్లే వ్యాన్ డ్రైవరు బస్తి బాలరాజు పాత్రలో నటించిన కార్తికేయ లుక్ నెవర్ బిఫోర్ అనేలా ఉంది. రోజూ ఏడుపులను చూసీ చూసీ.. ఏడుపంటేనే విరక్తి పుట్టుకొస్తుంది. కానీ ఒక అమ్మాయి ఏడుస్తుంటే మాత్రం చాలా బావుందని చెప్పడం చూస్తుంటే ఆ పాత్ర నైజం అర్థమపోతోంది.

డబుల్ మీనింగ్ డైలాగ్స్..
ఇక సినిమాలో ఫన్ కూడా గట్టిగానే ఉన్నట్లు అర్ధమవుతోంది. చావులకు వెళ్లి కూడా అక్కడ మొగుడు పోయిన పెళ్లాలకు లైన్లు వేసే అలవాటు కూడా ఉందని అమని చెప్పడం ఆకట్టుకుంటోంది. ఇక సినిమాలో రియాలిటీ కోసం డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా గట్టిగానే వాడినట్లు అర్ధమవుతోంది. అమ్మాయిని చూడగానే చేతి మీద వెంట్రుకలు మాత్రమే లేచాయా..లేదా..? అని భద్రం బాబు పంచ్ హైలెట్ గా నిలుస్తోంది.
'చావు కబురు చల్లగా' కూడా.. అదే రేంజ్ లో..
మొత్తానికి కార్తికేయ ఒక సరికొత్త కంటెంట్ తో ఆకట్టుకోబోతున్నాడని అర్ధమవుతోంది. ఇక లావణ్య త్రిపాఠీ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు కౌశిక్ దర్శకత్వం వహిస్తున్నాడు. సాధారణంగా జీఏ2 పిక్చర్స్ సినిమాలు చాలా వరకు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, ప్రతి రోజు పండగే.. వంటి సినిమాలు ఏ స్థాయిలో సక్సెస్ అయ్యాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఈ సారి చావు కబురు చల్లగా కూడా అదే రేంజ్ లో హిట్టయ్యేలా ఉందని అనిపిస్తోంది.