»   » నితిన్ నెక్ట్స్ వచ్చే నెలలో ముహూర్తం

నితిన్ నెక్ట్స్ వచ్చే నెలలో ముహూర్తం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'గుండె జారి గల్లంతయ్యిందే ‌'ఘన విజయంతో నితిన్ వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. 'హార్ట్‌ఎటాక్‌'ని 'కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌'గా తీసుకురాబోతున్న నితిన్‌ మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. కరుణాకరన్‌ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాకి నిఖితా రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తారు. ఈ సినిమా చిత్రీకరణను వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభిస్తారు.

నిర్మాత మాట్లాడుతూ... ''కరుణాకరన్‌ సినిమా అంటే ముందుగా గుర్తొచ్చేది 'తొలిప్రేమ'. ఈ సినిమా కూడా అదే తరహాలో ఉంటుంది. నితిన్‌ పాత్ర చిత్రణ వైవిధ్యంగా ఉంటుంది. ఇంకా హీరోయిన్ ను ఎంపిక చేయలేదు. త్వరలో పూజాకార్యక్రమాలతో లాంఛనంగా సినిమాని ప్రారంభిస్తాము'' అని అన్నారు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా హన్సికని అడుగుతున్నట్లు సమాచారం.

ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా 'హార్ట్‌ఎటాక్‌' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే . క్యారక్టరైజేషన్ తో సినిమా నడుస్తుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో నితిన్‌ని ఓ పోకిరి ప్రేమికుడిగా చూపించబోతున్నారు. తొలిసారిగా నితిన్ ...పూరి దర్శకత్వంలో నటించటంపై మంచి అంచానాలే ఉన్నాయి. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల అనుకున్నారు కానీ వాయిదా వేసారు.

నిర్మాత మాట్లాడుతూ... ''మాస్‌, క్లాస్‌ అంశాలు మేళవించిన ప్రేమ కథ ఇది. నితిన్‌ గెటప్‌, ఆయన పాత్ర చిత్రణ ఆకట్టుకొంటాయి. స్పెయిన్‌లో చిత్రీకరించిన సన్నివేశాలు ఆకర్షణగా నిలుస్తాయి. అనూప్‌ రూబెన్స్‌ అందించిన పాటలు యువతరాన్ని అలరిస్తాయనే నమ్మకం ఉంది'' అని చెప్తున్నారు.

నితిన్ ఈసినిమాపై ఎంతో నమ్మకంగా ఉన్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించాలనే కోరిక ఎప్పటి నుండో ఉంది. ఇప్పటికి ఆ కోరిక నెరవేరబోతోంది. పూరిగారు కథ చెప్పగానే ఎప్పుడెప్పుడు ఈ షూటింగ్ మొదలవుతుందా అని ఆసక్తి నాలో మొదలైంది. ఈ సినిమా నా కెరీర్‌కు ఎంత ముఖ్యమైనదిగా భావిస్తున్నానని అంటున్నాడు నితిన్.అనూప్ రూబెన్స్ ఈచిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

English summary
Nithin has completed the shoot of Heart Attack. He will now be heading for the shooting of director Karunakaran’s film from January 2014. Female lead of the film has not been finalized as yet. Sources tell us that Hansika was considered for this role. The muhurat ceremony of the film will happen soon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X