»   » మీడియావాళ్లు నా మాటలు వక్రీకరించి రాసారంటూ సీనియర్ నటి ఫైర్

మీడియావాళ్లు నా మాటలు వక్రీకరించి రాసారంటూ సీనియర్ నటి ఫైర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయిన మాజీ హీరోయిన్ కస్తూరి రీసెంట్ గా .... ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ మారిన క్యాస్టింగ్ కౌచ్ అంశంపై కామెంట్స్ చేసి సంచలనం సృష్టించారు.

తన కెరీర్ లోనూ, జీవితంలోనూ నో అనే పదం వినడం ఇష్టం లేని ఓ హీరో.. తన నుంచి ఫేవర్ కోరుకున్నాడని. పడక గడికి రమ్మనటం నిజమేనంటూ చెప్పింది. అలాగే తాను ఆయనతో ఒకటే సినిమా చేయగా.. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నాడని కస్తూరి కామెంట్స్ చేసింది. దీంతో యూజ్ యూజువల్ గా మీడియాలో రచ్చ మొదలైంది.

Kasthuri blasts media for wrong interpretation

కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహంతో ఫలానా హీరో అంటూ.. ఓ సీనియర్ స్టార్ ని హైలెట్ చేయటం మొదలుపెట్టేశాయి. అయితే.. తాను చెప్పిన వ్యక్తి తెలుగు హీరో లేదా తమిళ హీరో అనే మాటను కస్తూరి ఎక్కడా వాడలేదు. ఈ నేపద్యంలో కస్తూరి మళ్లీ స్పందించింది.

"ఒక వ్యక్తి ఎవడో అబద్ధాన్ని రాస్తాడు. ఇక ప్రతీ ఒక్కరూ అదే అబద్ధాన్ని పట్టుకుని కాపీ.. పేస్ట్ చేసేస్తారు. ఇలాంటి కల్పితాలను సృష్టించి రాసేసేముందు కనీసం ఒరిజినల్ ఇంటర్వ్యూ అయినా చూడండి" అంటూ మీడియాకు నీతులు చెప్పింది కస్తూరి.

ఇంతకీ ఆమె తెలుగులో చేసిన చిత్రాలు గుర్తు చేసుకుంటే... గ్యాంగ్ వార్, నిప్పు రవ్వ, సోగ్గాడి పెళ్లాం, మెరుపు, చిలక్కొట్టుడు. అన్నమయ్య, ఆకాశవీధిలో, డాన్ శీను చిత్రాలలో నటించింది కస్తూరి. ప్రస్తుతం యూఎస్ లో ఉంటున్న ఈమె.. తన కూతురుకు డ్యాన్స్ నేర్పించడం కోసమే ఇండియా వచ్చి, ఇంటర్వూ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది.

English summary
Kasthuri tweeted, "One guy writes a lie, and EVERYONE copies & pastes the same lie. At least read d original interview be4 writing fictional nonsense."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu