»   » ‘కాటమరాయుడు’కి సర్ప్రైజ్, జనసేనాని కోసం ఏం చేసారో తెలుసా? (ఫన్నీ వీడియో)

‘కాటమరాయుడు’కి సర్ప్రైజ్, జనసేనాని కోసం ఏం చేసారో తెలుసా? (ఫన్నీ వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'కాటమరాయుడు' చిత్రం షూటింగులో భాగంగా సెట్లో ఉండగా సర్ప్రైజ్ గిఫ్ట్ అందుకున్నారు. సినిమాలో పవన్ కల్యాణ్‌కు తమ్ముడిగా నటిస్తున్న శివబాలాజీ ఆయన కోసం ప్రత్యేకంగా ఓ కత్తిని తయారు చేసి బహుమతిగా ఇచ్చారు.

జనసేన సింబల్‌తో కూడిన ఈ కత్తిపై జనసేన పార్టీకి సంబంధించిన నినాదాలు లిఖించి తయారు చేయించారు. తమ్ముడి నుండి ఈ బహుమానం అందుకున్న కాటమరాయుడు ఆ కత్తితో సెట్స్ లో సందడి చేసారు.


ఈ కత్తి గురించి శివబాలాజీ

ఈ కత్తి గురించి శివబాలాజీ

కాటమరాయుడు సెట్స్ లో పవన్ కళ్యాణ్ గారు నాపై చూపిన ఆప్యాయత ఎప్పటికీ మరిచిపోలేను. ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఆయనకు ఏదైనా సర్‌ప్రైజ్ ఇవ్వాలని చాలా కాలం ఆలోచించాను. ఓ ఫైన్ డే... ఆయనకు సరైన సర్‌ప్రైజ్ ఇదే అని ఆలోచన వచ్చింది. అందుకే ఈ కత్తిని తయారు చేయించాం అని శివబాలాజీ తెలిపారు.


డెహ్రడూన్ లో

డెహ్రడూన్ లో

ఈ కత్తిని ప్రత్యేకంగా డెహ్రడూన్ లో తయారు చేయించినట్లు శివబాలాజీ తెలిపారు. డిజైన్ కోసం చాలా రోజులు కసరత్తు చేసామని, చివరకు జనసేన పార్టీ సింబల్ తో జనసేనాని కోసం ఈ కత్తి తయారు చేయించామని తెలిపారు.


కత్తిపై గుర్తులు

కత్తిపై గుర్తులు

ఈ కత్తిపై జనసేన పార్టీ సింబల్ తో పాటు, పవన్ కళ్యాణ్ రూపం, పార్టీకి సంబంధించిన నినాదాలు లాంటివి చెక్కించారు. చూడటానికి కత్తి ఎంతో ఆకర్షణీయంగా ఉంది.


పవన్ కళ్యాణ్ ఇష్టాన్ని గ్రహించే

పవన్ కళ్యాణ్ ఇష్టాన్ని గ్రహించే

పవన్ కళ్యాణ్ కు ఆయుధాలంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే ఆయన సినిమాల్లో కూడా తుపాకులు, కత్తులు లాంటి వాటిని ఉపయోగిస్తుంటారు.


rn

అలీని ఆటపట్టించారు

కాటమరాయుడు సెట్లో కత్తి చేతపట్టిన పవన్ కళ్యాణ్ అలీ చేయి నరుకుతా అంటూ సరదాగా ఆటపట్టించారు. అందుకు సంబంధించిన దృశ్యాన్ని ఈ వీడియోలో చూడొచ్చు.


శివ బాలాజీ కోసం పవన్ కళ్యాణ్ ఏం చేసారో తెలుసా?

శివ బాలాజీ కోసం పవన్ కళ్యాణ్ ఏం చేసారో తెలుసా?

'కాటమరాయుడు' సెట్స్ లో జరిగిన ఓ సంఘటన ఇపుడు హాట్ టాపిక్ అయింది. శివ బాలాజీ ఇలా చేయడం వెనక ఓ కారణం ఉంది. రుణం తీర్చుకునేందుకే శివ బాలాజీ బహుషా ఇలా చేసాడు కాబోలు.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


English summary
Power Star Pawan Kalyan gets a pleasant surprise on the sets of Katamarayudu. The team Katamarayudu is seen having so much fun on the sets.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu