twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా తండ్రి చనిపోయినా ఏడువలేదు..చిరంజీవి నా హీరో.. పవన్ కల్యాణ్ ఉద్వేగం

    పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన కాటమరాయుడు చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ కోసం హైదరాబాద్‌లోని శిల్పకళావేదిక వద్దకు భారీ అబిమానులు పోటెత్తారు. ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన కనిపించింది.

    By Rajababu
    |

    కాటమరాయుడు ప్రీ రిలీజ్ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. వేదిక వద్దకు రాలేకపోయిన అభిమానులందరికీ క్షమాపణలు. మీ అందరి క్షేమం కోరి చిన్నస్థాయిలోనే కార్యక్రమాన్ని నిర్వహించాను. ఇక్కడి రాలేక పోయిన మహిళలు, సోదరీమణులందరికీ మరోసారి క్షమాపణలు చెప్తున్నాను. ఏ పనైనా నిజాయితీతో పనిచేశాను. భవిష్యత్‌లో ఎలాంటి బాధ్యత అప్పగించినా నిబద్ధత, నిజాయితీతో వ్యవహరిస్తాను. ప్రజా సంక్షేమం కోసం అధికారం అంతిమ లక్ష్యం కాదు అని పవన్ కల్యాణ్ అన్నారు. పవన్ మాట్లాడేంత సేపు కాబోయే సీఎం.. సీఎం అని అభిమానులు గొంతెత్తి అరిచారు.

    పంచెకట్టు.. కోరమీసంతో పవన్

    పంచెకట్టు.. కోరమీసంతో పవన్

    కాటమరాయుడులో రైతుగా పంచకట్టు, కోర మీసంతో పవన్ కల్యాణ్ ఆలరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు అదే గెటప్‌లో రానున్నట్టు విశ్వసనీయ సమాచారం. కాటమరాయుడు గెటప్ వస్తే ఇక అభిమానుల ఆనందాన్ని ఆపడం ఎవరి తరం కాదు.

    కాటమరాయుడి సోదరులతో అలీ డాన్స్

    కాటమరాయుడి సోదరులతో అలీ డాన్స్

    కాటమరాయుడికి సోదరులుగా నటించిన కృష్ణ చైతన్య, అజయ్, కమల్ కామరాజ్, శివబాలజీ, వారికి జంటగా నటించిన వారిని వేదిక మీద నుంచి పవన్ అభిమానులకు పరిచయం చేశారు.
    రాజైనా, బంటైనా పాటకు వారితో కలిసి ఆలీ చిందేశారు. డాన్స్‌ హుషారుగా సాగడంతో అభిమానులు కూడా అలీ బృందంతో జత కలిశారు.

    త్రివిక్రమ్‌తో కలిసి పవన్ కల్యాణ్

    త్రివిక్రమ్‌తో కలిసి పవన్ కల్యాణ్

    అభిమానుల హోరు మధ్య ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి పవన్ కల్యాణ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేదిక వద్దకు వచ్చారు. పవన్ హాల్‌లోకి ప్రవేశించగానే ఫ్యాన్స్ అరుపులు, కేరింతలతో దద్దరిల్లింది. హాలులో ఏమవుతుందో కూడా తెలియరాలేదు.

    గ్యారంటీగా బ్లాక్ బస్టర్

    గ్యారంటీగా బ్లాక్ బస్టర్

    కాటమరాయుడు చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొన్నదని నిర్మాత బండ్ల గణేశ్ ట్వీట్ చేశారు. చిత్రానికి సెన్సార్ బోర్డు అధికారులు యూ సర్టిఫికెట్ జారీ చేశారు. సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ గణేష్ డిసైడ్ చేశారు. సినిమా ఘనవిజయం సాధిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

    కాటమరాయుడు పంచెకట్టుపై అలీ కామెంట్

    కాటమరాయుడు పంచెకట్టుపై అలీ కామెంట్

    పవన్ కల్యాణ్ పంచెకట్టు గురించి తనదైన శైలిలో వివరించారు. పంచె కిందకు ఉంటే ప్రశాంతంగా ఉంటారని, పంచె పైకెత్తారంటే బాక్సులు బద్దలవ్వాల్సిందేనని ఆయన వివరించారు. శరత్ మరార్ చాలా మంచి వ్యక్తి. ప్రతీ ఆర్టిస్టును చక్కగా చూసుకొన్నారు. టెక్నిషియన్స్ బాగా చూసుకోవాలని పవన్ కల్యాణ్ సూచన మేరకు ప్రతీ ఒక్కరికి ఎలాంటి లోటు రాకుండా చూసుకొన్నారు అని తెలిపారు.

    హాట్‌కేకుల్లా కాటమరాయుడు టికెట్లు

    హాట్‌కేకుల్లా కాటమరాయుడు టికెట్లు

    భారీ అంచనాల మధ్య పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన కాటమరాయుడు చిత్రం మార్చి 24న (శుక్రవారం) విడుదలయ్యేందుకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ అప్పుడే మొదలు కాగా దానికి అనూహ్య స్పందన కనిపిస్తున్నట్టు సమాచారం.

    కాటమరాయుడు వెబ్‌సైట్ క్రాష్

    కాటమరాయుడు వెబ్‌సైట్ క్రాష్

    ఆన్‌లైన్ స్టోర్‌లో కాటమరాయుడు పవన్ బ్రాండ్ దుస్తులు ఆన్‌లైన్‌లో katamarayudustore.com వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చని చిత్ర నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. చిత్ర యూనిట్ దిగ్భ్రాంతికి గురయ్యే రేంజ్‌లో అభిమానుల స్పందన కనిపించింది. అయితే హెవీ ట్రాఫిక్ వల్ల వెబ్ సైట్ కొద్ది గంటలలో క్రాష్ అయింది. ప్రస్తుతం ఈ వైబ్‌సైట్‌ను చేరుకోలేరనే సందేశం కనిపిస్తున్నది.

    ప్రీ రిలీజ్‌కు పోటెత్తిన అభిమానులు

    ప్రీ రిలీజ్‌కు పోటెత్తిన అభిమానులు

    పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన కాటమరాయుడు చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ కోసం హైదరాబాద్‌లోని శిల్పకళావేదిక వద్దకు భారీ అబిమానులు పోటెత్తారు. ఈ కార్యక్రమం కోసం పాసుల లేకున్నా పవన్ కల్యాణ్‌ను చూసేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. శిల్పకళా వేదిక ప్రాంగణం వద్ద అభిమానులు కిక్కిరిసిపోయారు. శిల్పకళా ఆడిటోరియం నిండిపోయింది. అప్పుడే ఉగాది పండుగ కళ అభిమానుల్లో కనిపించింది. జై పవన్ కల్యాణ్ అంటూ అభిమానులు హోరెత్తించారు.వేదిక వద్ద నల్లగొండ నుంచి ప్రత్యేకంగా వచ్చిన కళాకారులు డబ్బులు కొడుతూ సందడి చేశారు.

    నా తండ్రి చనిపోయినా ఏడువలేదు

    నా తండ్రి చనిపోయినా ఏడువలేదు

    నేను అనుకోకుండా హీరోను అయ్యాను. పరిశ్రమలో ఏదో ఒక సాంకేతిక నిపుణుడిగా కావాలనుకొన్నాను. కానీ విధి హీరోగా మార్చింది అని పవన్ కల్యాణ్ తెలిపారు. తాను నటించిన సినిమాల్లోని పాత్రలను ఈ సందర్భంగా గుర్తు చేసుకొన్నారు. సుస్వాగతంలో ప్రేమ కోసం బాధ్యతలను విస్మరించిన యువకుడి పాత్రను పోషించాను. క్లైమాక్స్‌లో తండ్రి చనిపోయినప్పుడు అక్కడ ఉండను. తండ్రి చనిపోయాడని ఆలస్యంగా తెలుసుకోని ఏడ్చే సన్నివేశంలో నిజంగానే ఏడ్చాను. నిజంగా భాదపడే ఫీలింగ్ రావడం కోసం నిజంగా చెంపలపై కొట్టుకొన్నాను. దాదాపు 40 సార్లు టేకులు తిన్నాను. ఆ నా తండ్రి చనిపోతే ఎలా ఏడుస్తానా నేను నిజంగా ఏడుస్తానా అని తర్వాత అనిపించింది. నా తండ్రి చనిపోయినప్పుడు ఏడుపు కూడా రాలేదు అని పవన్ గుర్తు చేసుకొన్నారు.

    అభిమానులు నాకు ప్రాణం

    అభిమానులు నాకు ప్రాణం

    నా జీవితంలోనూ, సినిమాల్లోను నేను ఎప్పుడు తమ్ముడ్నే. పాత్ర మేరకు మొదటిసారి ఈ సినిమాలో అన్నయ్యను అయ్యాను. ఈ సినిమాలో నా తమ్ముళ్లు అజయ్, చైతన్య కృష్ణ, శివ బాలాజీ, కమల్ కామరాజ్ నాకు బాగా నచ్చారు అని పవన్ చెప్తుండగా మేము కూడా సోదరులమే అని అభిమానులు అరిచారు. దాంతో మీరు నాకు సోదరులు కాదు. నా ప్రాణం. ప్రాణం సోదరులు ఒకటి కాదు అని అన్నారు.

    English summary
    Katamarayudu Pre release function: Huge response from Fans at Shilpa Kala Vedika of Hyderabad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X