»   » పవన్ కళ్యాణ్ హాట్ టాపిక్స్: 2 కోట్ల అడ్వాన్స్ ఇష్యూ... బ్యాక్ పెయిన్!

పవన్ కళ్యాణ్ హాట్ టాపిక్స్: 2 కోట్ల అడ్వాన్స్ ఇష్యూ... బ్యాక్ పెయిన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల గురించిన విశేషాలు తెలుసుకోవడానికి అభిమానుల్లో ఆసక్తి ఎంతగా ఉంటుందో అందరికీ తెలిసిందే. తాజాగా పవన్ కళ్యాణ్ గురించిన మరికొన్ని విషయాలు బయటకు వచ్చాయి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మైత్రి మూవీ మేకర్స్ నుండి తీసుకున్న రూ. 2 కోట్ల అడ్వాన్స్ తిరిగి ఇచ్చాడని ఇటీవల వార్తలు వచ్చాయి. త్రివిక్రమ్ సినిమాకు సంబంధించిన ఆయన ఈ అడ్వాన్స్ తీసుకున్నారు. అయతే అనుకోని కారణాలతో ఈ సినిమా ఇప్పుడు చేసే వీలయ్యే పరస్థితులు లేక పోవడంతో తాను అడ్వాన్స్ గా తీసుకున్న 2 కోట్లు తిరిగి ఇచ్చాడని టాక్ వచ్చింది.

పవన్ కళ్యాణ్‌కు తిరిగి ఇచ్చిన మైత్రి మూవీకర్స్

పవన్ కళ్యాణ్‌కు తిరిగి ఇచ్చిన మైత్రి మూవీకర్స్

అయితే పవన్ కళ్యాణ్ 2 కోట్లు తిరిగి ఇవ్వగా... మళ్లీ ఆ రెండు కోట్లు మైత్రి మూవీ మేకర్స్ వారు తిరిగా ఆయనకే ఇచ్చారట. త్రివిక్రమ్ తో కాక పోయినా మరో దర్శకుడితో పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని వారు ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

త్రివిక్రమ్-మహేష్ ఫిల్మ్

త్రివిక్రమ్-మహేష్ ఫిల్మ్

కాగా... త్రివిక్రమ్ ఇచ్చిన అడ్వాన్స్ అలాగే ఉంచి అతడితో మహేష్ బాబు 26వ సినిమా చేయాలని మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మరి ఇది కార్య రూపం దాలుస్తుందో? లేదో? అనేది క్లారిటీ రావాల్సింది.

పవన్ కళ్యాణ్ బ్యాక్ పెయిన్

పవన్ కళ్యాణ్ బ్యాక్ పెయిన్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు గతంలో బ్యాక్ పెయిన్ సమస్య ఉన్న సంగతి తెలిసిందే. ఆ మధ్య చికిత్స చేయించుకుని కాస్త కోలుకున్నాడు. ‘కాటమరాయుడు' చిత్ర షూటింగులో ఆ పెయిన్ మళ్లీ వచ్చిందని సమాచారం.

శృతి హాసన్‌ను ఎత్తుకోవడానికి నో

శృతి హాసన్‌ను ఎత్తుకోవడానికి నో

కాటమరాయుడు సనిమాలో శృతిహాసన్ ను పవన్ ఎత్తుకుని ఆసుపత్రికి తీసుకువెళ్లే ఓ సన్నివేశం వుంది. అయితే, అందులో నటించడానికి పవర్ స్టార్ ‘నో' చెప్పారట. బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్న పవన్ డాక్టర్ల సలహా మేరకే ఆ సన్నివేశంలో నటించలేదని తెలుస్తోంది.

English summary
Katamarayudu sets reports said that, Pawan kalyan suffering from back pain. As per sources Pawan kalyan suffering from serious back pain from few years.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu