»   » మళ్లీ పెళ్లి.... పవన్ కళ్యాణ్ పడిపడి నవ్వడానికి కారణం ఇదే!

మళ్లీ పెళ్లి.... పవన్ కళ్యాణ్ పడిపడి నవ్వడానికి కారణం ఇదే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇటీవల జరిగిన 'కాటమరాయుడు' ప్రి రిలీజ్ ఫంక్షన్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిర్మాత శరత్ మారార్ స్పీచ్ ఇస్తుండగా ఒక్కసారిగా పడి పడి నవ్విన సంగతి తెలిసిందే. పవన్ అలా నవ్వడానికి కారణం ఏమిటో అలీ వెల్లడించారు.

నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతూ....మీరు చాలా హాండ్సమ్ గా ఉన్నారు, పంచెకట్టులో డబల్ హాండ్సమ్ గా ఉన్నారు అంటూ కామెంట్ చేసారు. దీనికి పక్కనే ఉన్న అలీ... ఏంటి హ్యాండ్సమ్‌గా ఉన్నారు.. హ్యాండ్సమ్‌గా ఉన్నారు.. అని అన్నిసార్లు అంటున్నారు.. కొంపదీసి మళ్లీ పెళ్లి చేస్తాడా ఏంటి?' అంటూ పక్కన ఉన్న వారితో అంటూ పంచ్ విసిరాడు. అలీ మాటలు విన్న పవన్ పగలబడి నవ్వారు.

పవన్ అంతలా ఎందుకు నవ్వారో తెలుసుకోవడానికి అలీకి చాలా మంది ఫోన్‌ చేసారట.... ఈ విషయం అలీ ఇటీవల ఇంటర్వ్యూలో వెల్లడించారు.

rn

ఇంతలా నవ్వడం ఇదే తొలిసారి

తనదైన మేనరిజంలో కాలు బలంగా నేలకు తన్ని స్టేజ్ మొత్తం తిరుగుతూ కడుపుబ్బా నవ్వారు. పవన్ కళ్యాణ్ పబ్లిక్ వేడుకలో ఇంతలా నవ్వడం ఇదే తొలిసారి. పవన్ అంతలా నవ్వడం చూసి అంతా ఆశ్చర్య పోయారు.

నిస్సిగ్గుగా, నిజాయితీగా...: పవన్ రాజకీయ సందేశం, అభిమానులకు ఉపదేశం!

నిస్సిగ్గుగా, నిజాయితీగా...: పవన్ రాజకీయ సందేశం, అభిమానులకు ఉపదేశం!

నాకు ఏ పని ఇచ్చినా సరే అది తోట పని కావచ్చు, వీధులు ఊడ్చే పని కావచ్చు. ఎలాంటి పనైనా సరే నిస్సిగ్గుగా, చాలా నిజాయితీగా పని చేస్తాను. సినిమాలు కూడా నాకు భగవంతుడు ఇచ్చిన బిక్ష అనుకుని ఎంత కృతజ్ఞతగా చేయాలో, ఎంత ఒళ్లు దగ్గర పెట్టుకుని చేయాలో ఇన్ని సంవత్సరాలు అంతే ఒళ్లు దగ్గర పెట్టుకుని చేసాను. భవిష్యత్తులో ఎలాంటి బాధ్యతలు ఇచ్చినా కానీ అంతే ఒళ్లు దగ్గర పెట్టుకుని చేస్తాను.... అని పరోక్షంగా తన రాజకీయ ప్రయాణం గురించి ప్రస్తావించారు పవన్ కళ్యాణ్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

కోట్లలో ఒక్కడు... అంటూ పవన్ గురించి త్రివిక్రమ్ ఎమోషనల్ స్పీచ్!

కోట్లలో ఒక్కడు... అంటూ పవన్ గురించి త్రివిక్రమ్ ఎమోషనల్ స్పీచ్!

పవర్ స్టార్ సన్నిహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎమోషన్ గా స్పందించారు. దేవుడు కొన్ని శక్తులు కోట్లలో ఒకకరికే ఇస్తాడు... అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ త్రివిక్రమ్ గొప్పగా చెప్పుకొచ్చారు..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

కాటమరాయుడు లాభాలు, పవన్ వాటా వివరాలు

కాటమరాయుడు లాభాలు, పవన్ వాటా వివరాలు

కాటమరాయుడు సినిమాకు భారీగా లాభాలు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రీరిలీజ్ బిజినెస్ ద్వారా వచ్చిన లాభాల్లో పవన్ కళ్యాణ్ 60 శాతం తీసుకున్నారట.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ట్రైలర్


కాటమరాయుడు అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేసారు. ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మాస్ లుక్ లో అభిమానులను అలరించబోతున్నాడు.

English summary
As we all know that Katamarayudu pre-release event was held in a grand manner at Shilpakala Vedika on March 18th. During the event, Pawan laughing out hard when comedian Ali cracked a joke.“I didn’t know, why it is much shocking to the audience. That night, when Sharrath Marar praises Pawan Kalyan about his Pancha Kattu and I just said, Malli Pelli chestada enti? Pawan heard it and started laughing.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu