»   » లేటెస్ట్ అప్‌డేట్స్: కాటమరాయుడు సునామీ.. రికార్డులపై పవర్ స్టార్ సర్జికల్ స్టైక్స్

లేటెస్ట్ అప్‌డేట్స్: కాటమరాయుడు సునామీ.. రికార్డులపై పవర్ స్టార్ సర్జికల్ స్టైక్స్

Written By:
Subscribe to Filmibeat Telugu

పవన్ కల్యాణ్ నటించిన కాటమరాయుడు చిత్రం ఊహించిన విధంగానే తొలి ఆట నుంచే హౌస్ ఫుల్ కలెక్షన్లతో దుమ్మురేపుతున్నది. మిడిల్ ఈస్ట్ దేశాల్లో, దుబాయ్‌లో మార్నింగ్ షోలకు భారీగా అభిమానులు పోటెత్తారు. అన్ని థియేటర్లు ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది. దుబాయ్‌తోపాటు పలు దేశాల్లో గతంలో ఏ తెలుగు సినిమాకు రాని విధంగా కాటమరాయుడు చిత్రానికి అనూహ్య స్పందన లభిస్తున్నది.

Katamarayudu
అర్ధరాత్రి నుంచే హంగామా

అర్ధరాత్రి నుంచే హంగామా

హైదరాబాద్‌లోని కూకట్ పల్లిలోని బ్రమరాంబ థియేటర్ వద్ద గురువారం రాత్రి 11 గంటల నుంచే అభిమానులు హంగామా మొదలైంది. అభిమానులు భారీగా థియేటర్ వద్దకు చేరుకోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. పరిస్థితి చేజారి పోతుండటంతో పోలీసులు రంగంలోకి దిగారు. రోడ్డుపైన ఉన్న అభిమానులపై లాఠీచార్జి చేశారు.

రికార్డులుపై కాటమరాయుడు సర్జికల్ స్టైక్స్

రికార్డులుపై కాటమరాయుడు సర్జికల్ స్టైక్స్

మొదటి ఆట ప్రారంభం నుంచే కనిపిస్తున్న ప్రభంజనాన్ని బట్టి చూస్తే పలు రికార్డు బద్దలయ్యే ఖాయం అనే మాట వినిపిస్తున్నది. టాలీవుడ్ లోని ఆల్ టైమ్ రికార్డులపై కాటమరాయుడు సినిమా సర్జికల్ స్ట్రైక్స్ చేయనున్నది అని అభిమానులు చెప్పుకొంటున్నారు.

తమిళనాడులో సంచలనం

తమిళనాడులో సంచలనం

తమిళనాడు వ్యాప్తంగా కాలేజీ విద్యార్థులు మార్నింగ్ షో టికెట్లు బ్లాక్ చేసినట్టు వార్తలు అందుతున్నాయి. తమిళనాడులో టాలీవుడ్ సినిమాకు ఇంత మొత్తంలో ఓపెనింగ్స్ రాలేదు.

ఆస్ట్రేలియాలో రచ్చ రచ్చ

ఆస్ట్రేలియాలో రచ్చ రచ్చ

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో 1000 టికెట్లకు పైగా అడ్వాన్స్ బుక్ అయినట్టు వార్తలు అందాయి. ఇది ఆస్ట్రేలియాలో తెలుగు సినిమాకు ఓ రికార్డు.

పీవీఆర్‌లో 33 షోలు

పీవీఆర్‌లో 33 షోలు

హైదరాబాద్ పీవీఆర్ ఫోరమ్ మల్టిప్లెక్స్‌లో రికార్డు స్థాయిలో షోలు ప్రదర్శించనున్నారు. మొదటి రోజు దాదాపు 33 ఆటలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. అభిమానుల నుంచి పెద్ద మొత్తంలో డిమాండ్ పెరుగడంతో అదనంగా 17 షోలు జోడించినట్టు థియేటర్ నిర్వాహకులు వెల్లడించారు.

ఏలూరులో బెనిఫిట్ షో హల్ చల్

ఏలూరులో బెనిఫిట్ షో హల్ చల్

ఏలూరులో గురువారం అర్ధరాత్రి 1 గంటకు తొలి బెనిఫిట్ షో ప్రారంభం కానున్నది. ఆ తర్వాత ఉదయం 4 గంటలకు, 7 గంటలకు షోలు ఏర్పాటు చేశారు. ఒంటిగంట ఆటకు రూ. 250, రూ.150, రూ.100 ధరతో టికెట్లు అమ్మారు. 4 గంటల షో కోసం రూ. 200, రూ.150, రూ.100 ధరతో టికెట్లు అమ్మడం జరిగింది. ఉదయం 7 గంటల షో కోసం రూ. 200, రూ.150, రూ.100 వెలతో టికెట్లు అమ్మినట్టు సమాచారం.

బెంగళూరులో రికార్డులు బ్రేక్

బెంగళూరులో రికార్డులు బ్రేక్

బెంగళూరులో కాటమరాయుడు ఓ రికార్డు నెలకొల్పింది. మొదటి రోజే దాదాపు 400 షోలు ప్రదర్శించనున్నారు. ఇప్పటి వరకు ఓ తెలుగు సినిమా ఇన్ని షోలు ప్రదర్శించిన దాఖలాలు లేవు. కర్ణాటకలోనూ కాటమరాయుడు ప్రభంజనం మొదలైంది.

అమెరికాలో ట్రెండ్ ఫాలో.

అమెరికాలో ట్రెండ్ ఫాలో.

అమెరికాలో షో ప్రారంభానికి ముందే పంచెలు, టవల్స్ పంపిణీ చేసేందుకు సిద్ధం చేశారు. కాటమరాయుడులో పవన్ కల్యాణ్ గెటప్ మాదిరిగా అభిమానులు పంచె ధరించి టవల్‌తో సినిమా చూడటానికి ఫ్యాన్స్ అన్ని ఏర్పాట్లు చేశారు.

English summary
Katamarayudu tsunami starts all over the globe. Thursday midnight huge number fans gathered for benefit show at Bramaramba Theatre of Kukatpally. In Bangolre, there 400 shows are Exhibiting on day one.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu