For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అజ్ఞాతవాసి కాదు.. అజ్ఞానవాసి.. పవన్ కల్యాణ్‌పై కత్తి దూసిన మహేష్

  By Rajababu
  |
  Pawan Kalyan Tour : Mahesh Kathi Post Against Pawan Kalyan Going Viral | Oneindia Telugu

  జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌లో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. స్వపక్షం, విపక్షం, మిత్రప్రక్షం అనే తేడా లేకుండా పవన్ విమర్శలు గుప్పిస్తున్నాడు. పవన్ ప్రసంగాలకు అభిమానుల నుంచి విశేష స్పందన వస్తున్నది. అయితే కొద్దికాలంగా పవన్ ఫ్యాన్స్, సినీ విమర్శకుడు కత్తి మహేశ్ మధ్య జరుగుతున్న మాటల యుద్దం మరోసారి పీక్స్‌కు చేరింది. ఏపీలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్‌పై కత్తి మహేశ్ విమర్శలతో చీల్చి చెండాడుతుండటం మరో కొత్త వివాదానికి దారి తీస్తున్నది.

   పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలపై అభ్యంతరం

  పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలపై అభ్యంతరం

  తండ్రి సీఎం అయితే కుమారుడు సీఎం కావాలని రూలుందా అని వైస్ జగన్‌ను ఉద్దేశించి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మహేష్ కత్తి అభ్యంతరం వ్యక్తం చేశాడు. తండ్రి ముఖ్యమంత్రి అయితే కొడుకు ముఖ్యమంత్రి అవ్వాలనే నిబంధన లేదు. అన్నయ్య హీరో అయితే తమ్ముడు హీరో అవ్వాలని ఎక్కడన్న ఉన్నదా? అని కత్తి ఘాటుగా స్పందించాడు. వారసత్వం మన ఫ్యూడల్ భావజాలపు బానిస భావన. అది అన్ని రంగాల్లో పోవాలి. కాకపోతే గురివింద తన నలుపెరగనట్టు మాట్లాడితేనే హస్యంగా అనిపిస్తుంది అని ఆయన కౌంటర్ ఇచ్చాడు.

   పవన్‌పై కత్తి సెటైర్లు

  పవన్‌పై కత్తి సెటైర్లు

  ఏపీలో టీడీపీ, బీజేపీకి ఇక మద్దతు ఇవ్వనని పవన్ చేసిన వ్యాఖ్యలపై కత్తి మహేశ్ వ్యాగ్రాస్త్రాలు విసిరాడు. రాష్ర్టంలో ఇక మిగిలింది వైఎస్ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్ మాత్రమే. ఇక ఆయన ఎవరికి మద్దతు ఇస్తాడు అనే ప్రశ్నించాడు. ప్రజారాజ్యం పార్టీని, చిరంజీవికి ద్రోహం చేసిన వారిని చెప్పుతో కొట్టడమే జనసేన ప్రధాన లక్ష్యంగా కనిపిస్తున్నది. రాజకీయాల్లో కక్ష సాధింపు పనికిరాదు. కక్ష సాధింపే ప్రధానమైతే ప్రజలకు ఏమి ఉపయోగపడుతుంది అని మహేశ్ కత్తి అన్నాడు.

   ముందు ఫ్యాన్స్‌ను కట్టడి చేయి

  ముందు ఫ్యాన్స్‌ను కట్టడి చేయి

  తప్పు చేస్తే నన్ను కూడా నిలదీయండి. పొరపాటు చేస్తానేమోగాని.. తప్పు మాత్రం చేయను అని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మహేష్ కత్తి సెటైర్లు వదిలాడు. సోషల్ మీడియాలో మీ ఫ్యాన్స్ చేస్తున్న రౌడీయిజాన్ని ఆపే ప్రయత్నం చేయి. లేకపోతే అది జనసేన పార్టీకి ముప్పుగా మారే ప్రమాదం ఉంది అని అన్నాడు.

   పవన్ ఎన్జీవో పెట్టుకో

  పవన్ ఎన్జీవో పెట్టుకో

  అధికారం నా లక్ష్యం కాదు అని పవన్ అనడంపై కూడా కత్తి మహేష్ స్పందించారు. రాజకీయాలంటేనే అధికారం, గెలుపు. అవి లేకుండా రాజకీయాలేందుకు.. ప్రజాసేవ చేయాలంటే స్వచ్ఛంద సేవా సంస్థను పెట్టుకో. అప్పుడు ఎవరికీ ఇబ్బంది ఉండదు అని కత్తి పేర్కొన్నాడు.

   రాజకీయాలపై అవగాహన లేదు

  రాజకీయాలపై అవగాహన లేదు

  రాజకీయాల్లో కనీస అవగాహన లేదన్నట్టు పవన్ ప్రసంగాలు కనిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఎలాంటి నాలెడ్జ్ లేకుండా మాట్లాడటం తప్పు అవుతుంది. పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి కాదు.. అజ్ఞానవాసి అని తీవ్రమైన పదజాలాన్ని కత్తి మహేష్ ఉపయోగించాడు. కత్తి మహేష్ వ్యాఖ్యలపై పవన్ అభిమానులు మండిపడుతున్నారు.

   నాపై పవన్ ఫ్యాన్స్ దాడి

  నాపై పవన్ ఫ్యాన్స్ దాడి

  తాజాగా ఓ టెలివిజన్ చానెల్‌లో కత్తి మహేష్ మాట్లాడుతూ.. కాటమరాయుడు సినిమాపై కామెంట్స్ చేస్తే నాపై దాడి చేసినంత పనిచేశారు. మా దేవుడి సినిమాపై కామెంట్ చేస్తారా అని నన్ను పవన్ ఫ్యాన్స్ వేధించారు. అన్ని విషయాల్లోను పవన్ ఫ్యాన్స్, పవన్ కల్యాణ్ అజ్ఞానంతో మాట్లాడుతున్నారు అని కత్తి మహేష్ ధ్వజమెత్తారు.

   నన్ను గొట్టంగాడినని..

  నన్ను గొట్టంగాడినని..

  నన్ను తీవ్ర పదజాలంతో దూషిస్తున్నారు. నన్ను ఓ గొట్టంగాడు అని తిడుతున్నారు. గొట్టంగాడిని అయితే ఎందుకు పట్టించుకొంటున్నారు. పవన్ ఫ్యాన్స్ నాపై మాటల దాడికి పాల్పడుతున్నారు. రోజు 500 కాల్స్‌కు పైనా వస్తున్నాయి. పవన్ ఫ్యాన్స్ నన్ను బెదిరిస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నేను కామన్ మ్యాన్‌ను. నా వెనుక ఏ పార్టీ లేదు అని కత్తి మహేష్ వివరణ ఇచ్చారు.

   పవన్ ఫ్యాన్స్‌తో వార్

  పవన్ ఫ్యాన్స్‌తో వార్

  కాటమరాయుడు సినిమాపై మహేష్ కత్తి కామెంట్స్ చేయడంతో పవన్ ఫ్యాన్స్‌తో వార్ మొదలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బిగ్‌బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత ఓ ఇంటర్వ్యూలో పవన్ గురించి కామెంట్లు చేయడంతో వివాదం మరింత రాజుకొన్నది. పవన్ ఫ్యాన్స్‌కు ధీటుగా కత్తి మహేష్ స్పందిస్తున్నారు.

  English summary
  War between Pawan Kalyan fans and Kathi Mahesh going like television serial in media. Kathi Mahesh opposed Pawan Kalyan statement recenly which made in AP Tour. He made blunt commments on Pawan Kalyan and Pawan Fans.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X