twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘అజ్ఞాతవాసి’ని చీల్చి చెండాడిన కత్తి.... (మహేష్ కత్తి రివ్యూ)

    By Bojja Kumar
    |

    Recommended Video

    'అజ్ఞాతవాసి' పై మహేష్ కత్తి రియాక్షన్..!

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మహేష్ కత్తి మధ్య రగులుతున్న వివాదం గురించి అందరికీ తెలిసిందే. వీరి మధ్య వివాదం మొదలైందే.... సినిమాల మూలంగా. ఫిల్మ్ క్రిటిక్ అయిన మహేష్ కత్తి గతంలో పవన్ కళ్యాణ్ సినిమాలను తన రివ్యూల్లో విమర్శించడం, దానికి పవన్ ఫ్యాన్స్ బూతులు తిడుతూ రెచ్చిపోవడంతో మొదలై ఇపుడు ఇంత పెద్దగా గొడవగా మారింది.

    ఈ నేపథ్యంలో కత్తి మహేష్ 'అజ్ఞాతవాసి' సినిమాపై ఎలాంటి రివ్యూ ఇవ్వబోతున్నారని అందరూ ఆసక్తిగా ఎదు చూస్తున్నారు. మరి కత్తి మహేష్ ఈ సినిమా గురించి ఏ చెప్పారో ఓ సారి చూద్దాం.

     చాలా ఎక్స్ పెక్ట్ చేశాను

    చాలా ఎక్స్ పెక్ట్ చేశాను

    నేను టీజర్ చూసినపుడు ఇంప్రెస్ కాలేదు. ట్రైలర్ చూసిన తర్వాత చాలా ఎక్స్ పెక్ట్ చేశాను. ఎందుకంటే సినిమాటోగ్రఫీ బ్రహ్మాండంగా అనిపించింది. బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా నచ్చింది. అనిరుధ్ మ్యూజికల్స్ అని వేస్తున్నారు కాబట్టి ఈజ్ వర్త్ ఇట్ అని నిజంగానే అనిపించింది. ‘కొడాకా కోటేశ్వరరావు' అనే సరదాగా పాడిన పాట తప్ప మిగతా పాటలన్నీ నాకు నచ్చాయి. ఆ పాటల్లో బలమైన అర్థాలు కనిపించాయి. ఈ అర్థాలను త్రివిక్రమ్ స్క్రీన్ మీదకు ఎలా తీసుకొస్తాడు అనేది బిగ్గెస్ట్ ఇంట్రస్ట్.... అందుకే ఈ సినిమాను ఆసక్తిగా చూశాను అని మహేష్ కత్తి తెలిపారు.

     ఈ గొడవలన్నీ పక్కన పెట్టి చూశాను

    ఈ గొడవలన్నీ పక్కన పెట్టి చూశాను

    నా చుట్టు పక్కల జరుగుతున్న విషయాలను పక్కన పెట్టి సినిమాను సినిమాలాగా చూద్దామని థియేటర్‌కు వెళ్లాను. కానీ త్రివిక్రమ్ డిసప్పాయింట్ చేశాడు. పవన్ కళ్యాణ్ కూడా డిసప్పాయింట్ చేశాడు... అని మహేష్ కత్తి తెలిపారు.

     కానీ కథ అలా సాగలేదు

    కానీ కథ అలా సాగలేదు

    సినిమాలో ఎంత మంది టాప్ టెక్నీషీయన్స్ ఉన్నా....కథ మీదే అసలు భారం ఉంటుంది. ఈ కథ ఫ్రెంచి సినిమా ‘లార్గోవించ్' కు కాపీ అని అందరికీ తెలుసు. కానీ కథలో ఉండే ఇంటిగ్రిటీ ఎక్కడుంది? తండ్రి చనిపోతే కొడుకు వచ్చి ఆ ప్లేసులో ఉండాలి, ఆ బిజినెస్ అంతా చూసుకోవాలి అనేది బేసిక్ ఎమోషన్. బేసిక్ ఎమోషన్‌ను ఎంత కన్విక్షన్ తో హీరో నిరూపిస్తాడు అనేది సినిమా అంతా అవ్వాలి... కానీ సినిమా అలా లేదు అని మహేష్ కత్తి తెలిపారు.

     నాలుగు కామెడీ సీన్లు, కొన్ని చౌకబారు రొమాంటిక్ సీన్లు

    నాలుగు కామెడీ సీన్లు, కొన్ని చౌకబారు రొమాంటిక్ సీన్లు

    ఒక మంచి ఎమోషనల్ డ్రైవ్ ఉన్న కథ అన్నపుడు... తండ్రిని చంపేసిన వాళ్లతోనో, తన ఎంపైర్ ను స్వాధీనం చేసుకున్న వారితోనో హీరో వచ్చి పోరాడాలి. అది మైండ్ గేమ్ ఆడతాడా? ఫిజికల్ ఫైట్ చేస్తాడా? లేక పోతే కౌంటర్ ప్లాట్ వేసి ఎదుర్కొంటాడా? అనేది చాలా ముఖ్యం. కానీ అవేమీ లేకుండా ఏదో నాలుగు కామెడీ సీన్లు పడేసి, కొన్ని చౌకబారు రొమాంటిక్ సీక్వెన్సెస్ యాడ్ చేసి ఇదే సరిపోతుందిలే తెలుగు ప్రేక్షకులు అనే ఒక ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది బాగోలేదు అని మహేష్ కత్తి తెలిపారు.

     ఎవరూ అప్రిషియేట్ చేయరు

    ఎవరూ అప్రిషియేట్ చేయరు

    ఒక సీరియస్ కథకు కామెడీ ట్రీట్మెంట్ వేస్తే సినిమా అపహాస్యం అవుతుంది. కథకు చేయాల్సింది చేయక పోగా దాన్ని నాశనం చేస్తే ఎవరూ అప్రిషియేట్ చేయరు. అజ్ఞాతవాసి సినిమా విషయంలో అదే జరిగింది... అని మహేష్ కత్తి తెలిపారు.

     పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌తో గొడవ వల్ల చెప్పడం లేదు

    పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌తో గొడవ వల్ల చెప్పడం లేదు

    నేను ఇదంతా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌తో గొడవ వల్ల చెప్పడం లేదు. ఒక సినిమా ప్రేమికుడిగా, విశ్లేషకుడిగా ఇదంతా చెబుతున్నాను. పవన్ కళ్యాణ్ మీద కోపంతో చెబుతున్నది కాదు. ఎందుకు నాకు ఇది నచ్చలేదు అని చెప్పడమే నా రివ్యూ అవుతుంది.... అని మహేష్ కత్తి తెలిపారు.

     అపహాస్యం పాలు చేసే హాస్యం ఉంది

    అపహాస్యం పాలు చేసే హాస్యం ఉంది

    సినిమాలో అపహాస్యం పాలు చేసే హాస్యం ఉంది. సినిమా ఫస్ట్ సీన్లో హీరో చైర్ గురించి చెబుతూ ఒక సౌకర్యం కోసం ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది అనే డైలాగ్ చెబితే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆ తర్వాత హీరో వెళ్లి ఏం చేస్తాడు? సరదాగా వెళ్లి ఆ ఇద్దరు హీరోయిన్లను పడగొట్టడానికి ట్రై చేస్తుంటాడు. అంటే హీరోలో ఒక కన్వెక్షన్ ఏమైనట్లు? మీరు సినిమాపై ఒక ఉన్నతస్థాయి ఎక్స్‌పెక్టేషన్స్ పెంచి హీరో క్యారెక్టర్ ఇదీ అని చెప్పి ఇలా చేయడం ఏమిటి. నిజానికి టైటిల్ సీక్వెన్స్ లో ఉండే పాట వింటే హీరో ఇపుడే ఆకాశం నుండి దిగివచ్చిన దేవుడులాగా అనిపిస్తుంది. కానీ ఇతడు నేలబారు, చౌకబారు రొమాన్సులు, కామెడీలు చేస్తుంటాడు. ఆ అమ్మాయిలు పిచ్చోళ్లలాగా అతడి వెనక తిరుగుతుంటారు.... అని మహేష్ కత్తి తెలిపారు.

     ఇదో మేజర్ మైనస్ పాయింట్

    ఇదో మేజర్ మైనస్ పాయింట్

    ఒక అస్తిత్వం అనేది క్యారెక్టర్‌కు ఉంటే ఆ క్యారెక్టర్ ఎక్కడి నుండి వచ్చింది. దాడి ఎమోషనల్ బ్యాగేజ్ ఏమిటి? చెబుతున్న డైలాగులు ఏమిటి? అనే దానికన్నా చేస్తున్నదేమిటి అనేదగ్గరికి దిగజారుడుతనం కనపడుతుంది. సినిమాలో ఇదో మేజర్ మైనస్ పాయింట్.... అని మహేష్ కత్తి తెలిపారు.

    హీరోయిన్ల క్యారెక్టర్ల విషయానికొస్తే....

    హీరోయిన్ల క్యారెక్టర్ల విషయానికొస్తే....

    హీరో అంటే ఉన్నతమైన క్యారెక్టర్ ఉన్నవాడు. హీరోయిన్ అంటే ఔన్యత్యానికి ప్రతీక అవ్వాలి. వారిద్దరూ ప్రేమించుకుంటే బావుంటుందని ఆశించాలి. ఇక్కడ అతడిని చూడగానే పడిపోయే ఇద్దరు హీరోయిన్లు. వాళ్లకు ఏ మాత్రం క్యారెక్టరైజేషన్ లేదు. అంటే పాత్ర ఔచిత్యాలుగానీ, పాత్రోచితమైనటువంటి నటనగానీ ఈ రెండు లేనటువంటి హీరోయిన్లు. చివరకు వచ్చే సరికి ఇంతేనా..? ఈ మాత్రం దానికి ‘అజ్ఞాతవాసి' అనే భారీ టైటిల్ ఎందుకు? అనే నిరాశ కలుగులుతుంది.... అని మహేష్ కత్తి తెలిపారు.

    కామెడీ ఓకే, సందర్భాలు బాగోలేవు

    కామెడీ ఓకే, సందర్భాలు బాగోలేవు

    సినిమాలో కామెడీ బాగానే ఉంది. కానీ వచ్చే సందర్భాలు బాగాలేవు. ఉదాహరణకు హీరో అనేవాడు ఆఫీసులో వచ్చి తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించి అక్కడున్న వారిని ఇబ్బంది పెట్టి ఇన్ఫర్మేషన్ లాగాలి. ఇది సీరియస్ మిషన్. ఈ సీరియస్ మిషన్లో వర్మ , శర్మ అనే ఇద్దరి మధ్య తను చేసే కామెడీ... కొడకా కోటేశ్వరరావు అంటూ తను పాడే పాటలు.... హీరో ఔన్నత్యాన్ని దిగజార్చాయి. నవ్వించడానికి కామెడీ కావాలి. కేవలం రావు రమేష్ పాత్ర, వెన్నెల కిషోర్ పాత్ర వారు క్యారెక్టర్ నుండి బయటకు వెళ్లకుండా విత్ ఇన్ ది క్యారెక్టర్లో కామెడీ ప్లే చేయడానికి ట్రై చేసినపుడు మాత్రమే నిజంగా అది ఉన్నతమైన హాస్యంగానూ, త్రివిక్రమ్ మార్క్ హాస్యంగానూ, గౌరవ ప్రదమైన హాస్యంగానూ అనిపిస్తుంది.... అని అలా లేదు అని మహేష్ కత్తి తెలిపారు.

     పవన్ కళ్యాణ్ నంగి హావ భావాలు ఇబ్బందిగా అనిపిస్తాయి

    పవన్ కళ్యాణ్ నంగి హావ భావాలు ఇబ్బందిగా అనిపిస్తాయి

    పవన్ కళ్యాణ్ నంగి హావ భావాలు ఇబ్బందిగా అనిపిస్తాయి. ఆయన్ను ఎంతో ఉన్నతమైన హీరోగా ప్రొజెక్టు చేసి ఇక్కడ ఎందుకు ఇవన్నీ, అవసరమా హీరోకు, హీరో మైండ్ సెట్ ఏమిటి? నిజంగా మైండ్ సెట్లో ఆ పాత్ర ఉందా? అనే ఆలోచన మనకు వచ్చి కొంచెం ఇబ్బందిగా మనమే సీట్లో ఫీలయ్యామంటే అది కచ్చితంగా ఉన్నతమైన హాస్యం అయితే కాదు. నేనైతే దిగజారుడు హాస్యం అంటాను.... అని మహేష్ కత్తి తెలిపారు.

     అలాంటపుడు ఒక కన్విక్షన్ తో వెళ్లాలి.

    అలాంటపుడు ఒక కన్విక్షన్ తో వెళ్లాలి.

    పవన్ కళ్యాణ్ ఒక ఉన్నతమైన ఆశయాలతో రాజకీయాల్లోకి వస్తున్నాడు. అజ్ఞాతవాసి తన ఆఖరి సినిమా అన్నాడు. అలాంటపుడు ఒక కన్విక్షన్ తో వెళ్లాలి. ఎన్టీఆర్ గారిని తీసుకుంటే అపుడు ‘నా దేశం' తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ ఇలాంటి సినిమాతో వస్తాడని అనుకోలేదు.

     అదో చెత్త అని అందరికీ తెలుసు

    అదో చెత్త అని అందరికీ తెలుసు

    పవన్ గత సినిమా ‘కాటమరాయుడు' క్షమించవచ్చు. ఎందుకంటే అదొక రీమేక్, అదో చెత్త అందరికీ తెలుసు, అంతకు ముందు తమిళంలోనూ ఎవరూ చూడని సినిమా అది... అని కత్తి తెలిపారు.

     త్రివిక్రమ్ ఇలా చేస్తాడనుకోలేదు

    త్రివిక్రమ్ ఇలా చేస్తాడనుకోలేదు

    త్రివిక్రమ్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ కు ఒక బ్యాక్ బోన్ గా, ఒక థింక్ ట్యాంక్ గా పని చేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కెరీర్ నిలబెట్టే సినిమా తీస్తాడు అని అంతా భావించారు. అందులోనూ పొలిటికల్ కెరీర్ లోకి అడుగు పెడుతున్న హీరో గురించి తీస్తున్నారంటే ఆ మాత్రం ఎక్స్ పెక్ట్ చేయడంలో తప్పులేదుగా. కథలో పాత్ర ఔన్నత్యం అయినా ఉండాలి, ఆ పాత్రలో గొప్పదనంతనం అయినా ఉండాలి. అందులో నుండి పవన్ కళ్యాణ్ లోని ఇండివిడ్యువాలిటీని ప్రొజెక్ట్ చేసే విధంగా ఉండాలి. లేదా పొలిటికల్ యాంబిషన్స్ ను ప్రొజెక్ట్ చేసే విధంగా ఉండాలి. ఇవేమీ లేకపోతే ప్రేక్షకుడికి ఎందుకు సినిమా చూస్తున్నట్లు అనే ఫీలింగ్ వస్తుంది... అని కత్తి అభిప్రాయ పడ్డారు.

     ఇంటిగ్రిటీ దిగజార్చే సీన్లు పడకూడదు

    ఇంటిగ్రిటీ దిగజార్చే సీన్లు పడకూడదు

    ఒక వేళ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లకు పోయినా ఈ సినిమా బాగోలేదనే చెబుతాను. ఎందుకంటే కథ సీరియస్ అయినపుడు, హీరో ఎమోషనల్ అయినపుడు అతడి ఇంటిగ్రిటీ పారామౌంటౌ అని చెబుతున్నపుడు అతడి ఇంటిగ్రిటీ దిగజార్చే సీన్లు పడకూడదు. హీరోకు ఒక స్టేచర్ ఉంటుంది, విలన్ అతడికి ప్రత్యర్థి... వీరిద్దరికి మధ్య వార్ ఏమిటనేది చూపించాలి. కానీ ఇక్కడ హీరో ఎవరెవరిమీదో పడి కొడుతుంటాడు. కమెడియన్ రఘుబాబును కొడుతూ అతడి మీద ఏకంగా పాట. ఆ తర్వాత వర్మ, శర్మ మీద ఒక సీక్వెన్స్.... ఇదేమీ బాగోలేదని మహేష్ కత్తి తెలిపారు.

     ఫ్యాన్ మూమెంట్స్

    ఫ్యాన్ మూమెంట్స్

    సినిమాలో ఫ్యాన్ మూమెంట్ చూసుకుంటే... సినిమా ఓపెనింగ్ బావుంది. ఒక యాక్షన్ సీక్వెన్స్ తో సినిమా ఓపెన్ అవుతుంది. కొరియోగ్రఫీలో కూడా ఫ్యాన్ మూమెంట్స్ కనిపిస్తాయి. కానీ సినిమాలో ఫ్యాన్ మూమెంట్స్ మనకు కనిపించవు.... అని కత్తి మహేష్ విమర్శించారు.

    English summary
    Kathi Mahesh Exclusive Review On "Agnyaathavaasi" . Agnyaathavaasi directed by Trivikram Srinivas and starring Pawan Kalyan, with Keerthy Suresh, Anu Emmanuel, Kushboo, Aadhi Pinisetty and Boman Irani in supporting roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X