»   » అన్నీ మూసుకో... దీపిక పదుకొనెపై కత్రినా కైఫ్ ఫైర్!

అన్నీ మూసుకో... దీపిక పదుకొనెపై కత్రినా కైఫ్ ఫైర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అయిన కత్రినా కైఫ్, దీపిక పదుకొనె మధ్య మరోసారి మాటల యుద్దం మొదలైందా? అంటే అవుననే అంటున్నారు బాలీవుడ్ జనాలు. గతంలో దీపిక పదుకొనె, రణబీర్ కపూర్ మధ్య ప్రేమ వ్యవహారం నడించింది. దీపికతో విడిపోయిన తర్వాత రణబీర్ కపూర్ కత్రినాతో ఎఫైర్ మొదలు పెట్టాడనే వార్తలు గుప్పుమన్నాయి. అప్పటి నుంచి దీపిక-కత్రినా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది.

ఇటీవల కత్రినా కైఫ్ తన బాయ్ ఫ్రెండ్ రణబీర కపూర్‌తో కలిసి స్పెయిన్ దేశం వెళ్లి అక్కడ హాలిడే ఎంజాయ్ చేసిన సంగతి తెలిసిందే. వీరు సీక్రెట్‌గా స్పెయిన్ వెళ్లిన విషయాన్ని గ్రహించిన కొందరు వారిని సీక్రెట్‌గా పోటోలు తీసారు. దీంతో అక్కడ కత్రినా బాయ్ ఫ్రెండుతో కలిసి బికినీలో సరసాలాడిన విషయం మీడియా ద్వారా బట్టబయలైంది.

తమ బండారం బయట పడిపోవడంతో అసహనానికి గురైన కత్రినా కైఫ్....తమ ప్రైవేటు లైఫ్‌ను రచ్చకీడ్చారంటూ మీడియాపై మండి పడింది. ఇలా చేయడం సబబు కాదంటూ ఓ లేఖాస్త్రం సంధించింది. కత్రినా ఇలా మీడియా వారిపై మండి పడటం దీపికకు అస్సలు నచ్చలేదు. దీంతో తనదైన రీతిలో కత్రినాపైకి విమర్శలు విసిరింది.

'సెలబ్రిటీలు, పబ్లిక్ ఫిగర్స్ అన్నాక ఇలాంటి జరుగడం సాధారణమే. ఇంత మాత్రానికే కత్రినా అలా చేయడం సరికాదు. ఆమె మీడియాపై నిందలు వేయడం మంచిదికాదు' అంటూ స్టేట్ మెంట్ ఇచ్చిందట. దీంతో చిర్రెత్రిన కత్రినా దీపికపైకి ఎదురు దాడికి దిగిందట. ఆమె అన్నీ మూసుకుని కూర్చుంటే మంచిందని ఫైర్ అయిందట.

English summary
It looks like Deepika Padukone's recent 'gyaan' did not go down well with actress Katrina Kaif at all. It is said that Deepika's recent statement against Katrina over her bikini act in Spain, has irked the latter. Reportedly, Kat wants Dippy to keep her words of wisdom to herself.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu