For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వీళ్ల పర్శనల్ ప్రేమ,బ్రేకప్ కు నిర్మాత బలి,అందురూ తిట్టిపోస్తున్నారు

  By Srikanya
  |

  ముంబై: షూటింగ్ నెలలు, సంవత్సరాల తరబడి జరుగుతూంటే ఎవరికైనా మండుతుంది. ముఖ్యంగా స్టార్ హీరో,హీరోయిన్స్ కు వేరే కమిట్ మెంట్స్ ఉంటాయి. అలాంటప్పుడు పట్టుకున్న ఒక ప్రాజెక్టే జీవితకాలం లేటు అన్నట్లు సాగితే..ఇప్పుడు అదే పరిస్దితి కత్రినాకైఫ్ ఎదుర్కొంటోంది.

  ఏం చేయాలో అర్దం కాక,అలాగని పైకి చెప్పుకోలేక,మీడియా వారు ఇదే ప్రశ్నను అడిగితే సర్ది చెప్పలేక సతమతమవుతోంది. అయితే ఇందులో కత్రినా తప్పు కూడా ఉండటంతో ఆమె సైలెంట్ అయ్యిపోయిందని వినపడుతోంది.

  కత్రినా, రణబీర్ కపూర్ జంటగా రూపొందుతున్న 'జగ్గా జాసూస్‌' చిత్రం ప్రారంభమై చాలా కాలం అయ్యింది. లాంగ్ గ్యాప్ లతో,ఫోస్ట్ ఫోన్ లతో షూటింగ్ జరుగుతూ వస్తోంది. అయితే ఇప్పటివరకూ వెలుగు చూడలేదు. ఇంతలా లేటు ...కత్రినా లాంటి స్టార్, రణబీర్ లాంటి హీరో చేసే సినిమాకు ఉండటం ఆశ్చర్యమే. దాంతో సినిమాపై వచ్చిన హైప్ కూడా పోతోంది.

  ఇదే విషయమై బాలీవుడ్ లైఫ్ పత్రిక వారు కత్రినాను ప్రశ్నించారు. మీరు సహనం కోల్పోయినా..ఈ చిత్రం షూటింగ్ లో అని, అయితే కత్రినా అలాంటిదేమీ లేదని, తాను ఫైనల్ ప్రొడక్ట్ కోసం ఎదురుచూస్తున్నాని చెప్పింది. అయితే ఆమె నిజంగానే ఈ ప్రాజెక్టుతో విసుగెత్తిందని,కమిటయ్యాను కాబట్టి తప్పదు అన్నట్లు చేస్తోందని, బాలీవుడ్ లో వినపడుతోంది.

  ఇంతకీ ప్రాజెక్టు డిలే లో కత్రినా పాత్ర ఎంత అనేది ..స్లైడ్ షోలో...

  అదే కారణం

  అదే కారణం

  బ్రేకప్ ఎఫెక్ట్ ఈ సినిమాపై పడిందని అంటున్నారు. బాలీవుడ్‌ ప్రేమపక్షులు రణ్‌బీర్‌ కపూర్‌, కత్రినా కైఫ్‌ విడిపోయిన సంగతి తెలిసిందే. దీని ప్రభావం 'జగ్గా జాసూస్‌'పై పడిందని బాలీవుడ్‌ వర్గాలు చెప్పుకొంటున్నాయి. ఇద్దరూ ఒకరి మొహాలు మరొకరు చూసుకోవటం ఇష్టం లేక సెట్ కు రావటం లేదని, దాంతో యూనిట్ ఏం చెయ్యాలో తల పట్టుకుంటోందని చెప్తున్నారు.

  ఎడమొహం

  ఎడమొహం

  అనురాగ్‌ బసు తెరకెక్కిస్తున్న 'జగ్గా జాసూస్‌'లో రణ్‌బీర్‌, కత్రినా జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ మొదలయ్యేనాటికి ప్రేమలో ఉన్న రణ్‌బీర్‌, కత్రినా ముగింపుకొచ్చే సరికి ఎడమొహం పెడమొహంగా మారిపోయారు. ఇది ఎవరూ ఊహించని పరిణామం. ఇలాంటిది జరిగుతుందని నామ మాత్రంగా తెలిసినా ప్రెజెక్టు మొదలెట్టేవాళ్లమే కాదంటున్నారు.

  గుసగుసలు

  గుసగుసలు

  ఈ బ్రేకప్ తో 'జగ్గా జాసూస్‌' ప్రచార కార్యక్రమాల్లో రణ్‌బీర్‌, కత్రినా పాల్గొనే పరిస్థితి లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో డిస్ట్రిబ్యూట్స్, బయ్యర్లు కంగారుపడుతున్నారు. ఇప్పటికే బిజినెస్ అయిన ఈ సినిమాకు ప్రమోషన్ లేకపోతే తాము మునిగిపోతామని చెప్పుతున్నారు. ఎవరి బాధలు వారివి అన్నట్లుగా హీరో,హీరోయిన్స్ మాత్రం నోరు మెదపటం లేదు.

  అబ్బే అలాంటిదేం లేదు

  అబ్బే అలాంటిదేం లేదు

  నిర్మాత సిద్ధార్థ్‌ రాయ్‌ కపూర్‌ స్పందిస్తూ ''ఈ వార్తలు నిజం కాదు.

  రణ్‌బీర్‌, కత్రినా వృత్తి ధర్మం పాటించే నటులు. తమ చిత్రం ప్రేక్షకులకు చేరువకావడానికి అవసరమైన అన్ని విషయాల్లో వారు సహకరిస్తారు. 'జగ్గా జాసూస్‌' ప్రచార కార్యక్రమాల్లోనూ వారు పాల్గొంటారు''అని చెప్పారు.

  బ్రతిమాలే కార్యక్రమం

  బ్రతిమాలే కార్యక్రమం

  అటు కత్రినాని, ఇటు రణబీర్ ని ఇద్దరినీ కలిపి సినిమా పూర్తి చేయటమే ఒక పెద్ద యజ్ఞం అనుకుంటే వీళ్లను ప్రమోషన్ కు రప్పించటం అంటే మళ్ళీ వీళ్ల కాళ్లు పట్టుకోవాలా..ఏంటిరా దేముడా అన్నట్లుగా నిర్మాత సిద్దార్దరాయ్ భాధపడుతున్నాడట. ఆయన పరిస్దితి ఎవరికీ చెప్పుకోలేడు అన్నట్లు తయారైంది.

  కంప్లైంట్ ఇద్దామంటే

  కంప్లైంట్ ఇద్దామంటే

  పోనీ కత్రినాపైన గానీ, రణబీర్ మీద కానీ ఫిల్మ్ ఛాంబర్ లో కంప్లైంట్ చేద్దామంటే మీడియా ఏ విధంగా దీన్ని ప్రొజెక్టు చేసి లేనిపోని రూమర్స్ ప్రచారం చేస్తుందో అని భాదఫడుతున్నట్లు బాలీవుడ్ పత్రికలు రాసుకొస్తున్నాయి. ఏదైనా నిర్మాతను ఇలా ఏడిపించటం భావ్యం కాదు కదా.. ఇద్దరూ కాంప్రమైజ్ అయ్యి ..ఈ సినిమా విషయం అటో , ఇటో తేల్చేస్తే సరి

  హిట్ లేదు

  హిట్ లేదు

  మూడేళ్ళ క్రితం విడుదలైన 'యే జవానీ హై దివానీ' సినిమా తరవాత రణబీర్‌కు విజయం అందించిన సినిమా లేదు. ప్రస్తుతం రణబీర్‌ నటించిన ఆయే దిల్‌ హై ముష్కిల్‌, జగ్గా జాసూస్‌ సినిమాలు నిర్మాణాంతర పనుల్లో ఉన్నాయి. జగ్గా జాసూస్‌ స్వంత బ్యానర్‌ షురు ప్రొడక్షన్స్‌ క్రింద తయారవుతోంది.

  ప్రేమ రోగి

  ప్రేమ రోగి

  ఇక వ్యక్తిగత విషయానికొస్తే అతణ్ణి ప్రేమరోగి అని చెప్పక తప్పదు. దీపికా పదుకొణేతో సావాసం చేసి, డేటింగ్‌ దాకావెళ్ళి, నిశ్చితార్ధం జరుగుతుందేమో అని అభిమానులు అంచనా వేసిన వేళ... ఆ సంబంధం బెడిసికొట్టింది. ఇందుకు తను మానసికంగా ఎదగక పోవడమే కారణమని రణబీర్‌ ఒప్పుకున్నాడు.

  ఫలితం లేదు

  ఫలితం లేదు

  తరవాత రణబీర్‌ జీవితంలోకి ప్రవేశించిన కత్రినా కైఫ్‌ ఒక అడుగు ముందుకేసి, రణబీర్‌ను అతని తల్లిదండ్రుల నుంచి దూరంగా తీసుకెళ్ళగలిగింది.

  కారణాలు ఏవైతేనేం రణబీర్‌, కత్రినా నుంచి విడిపోయి ఒంటరివాడైపోయాడు. మరలా తల్లిదండ్రులకు దగ్గరయ్యాడు.

  రెండు ఫెయిల్యూర్

  రెండు ఫెయిల్యూర్

  కెరీర్ పరంగానూ హిట్ లు లేవు, వ్యక్తిగత లైఫ్ లోనూ అన్ని బ్రేక్ అప్ లే.. అటు సినిమాలు ఆడక, ఇటు ప్రణయతాపం తీరక రెంటికి చెడ్డ రేవడి చందాన సతమతమౌతున్నాడు. కనీసం జాసూస్‌ సినిమా అయినా విజయవంతమైతే వ్యాకులత నుంచి బయటపడగలడని అతని తల్లి,తండ్రులు ఎదురుచూస్తున్నారు.

  కత్రినా గురించి ఇలా

  కత్రినా గురించి ఇలా

  ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా చెప్పడం రణ్‌బీర్‌ కపూర్‌ స్టైల్‌. ఇటీవల కత్రినా కైఫ్‌ గురించి మాట్లాడుతూ.. ''నా తల్లిదండ్రుల తర్వాత నన్ను అంతగా ప్రభావితం చేసింది కత్రినానే, అందుకే ఆమె నాకు ప్రత్యేకం'' అని చెప్పాడు. అంటే ఇంకా కత్రినానే బాబు కలవరిస్తున్నాడన్నమాట.

  అలా మొదలైంది

  అలా మొదలైంది

  తన ప్రేయసి కత్రినాతో ప్రేమాయణం గురించి చెప్పాడు. ''అజబ్‌ ప్రేమ్‌కీ గజబ్‌ కహానీ' సినిమాతో కత్రినాకి నాకు మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. అప్పటినుంచే మా మధ్య ప్రేమ చిగురించింది. ఆమెపై ఎంత ప్రేమ ఉందో చెప్పడానికి మాటలు చాలవు' అని అన్నాడు. ఇంత ప్రేమించిన ఈ హీరోని కత్రినా ఎందుకు ఒంటరిని చేసిందో మాత్రం చెప్పలేదు.

  English summary
  Katrina Kaif and Ranbir Kapoor starrer Jagga Jasoos has been in the making since a long time and the film has not seen the light of the day yet. The constant delays and postponment have made fans feel that the film is not worth it and all the hype has fizzled out.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X