»   » ఏం జరుగుతోంది?: పిల్లలు కావాలి, బోయ్ ఫ్రెండు‌కు బై, సల్మాన్ తో సై

ఏం జరుగుతోంది?: పిల్లలు కావాలి, బోయ్ ఫ్రెండు‌కు బై, సల్మాన్ తో సై

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: కెరీర్ పరంగా ఎంత ఒత్తిడి వున్నా కొత్త గోల్స్ ని సెట్ చేసుకోవటంలో ఎప్పుడూ ముందు ఉంటుంది కత్రినా కైఫ్ . నైఫ్ అంటే కత్తిలా తన శరీరాన్ని ఎప్పుడూ నాజూకుగా ఉంచుకుని ఎప్పటికప్పుడు తన అందాలు పెంచుకునే ఆమె ఇప్పుడు పిల్లలు కావాలంటోంది. అదీ ఆమె తన బోయ్ ఫ్రెండ్ రణబీర్ కపూర్ తో బ్రేక్ అప్ అయిన తర్వాత కావటం విశేషం.

కత్రినా నటించిన ప్రేమ కావ్యం ‘ఫితూర్’ రివ్యూ

రీసెంట్ గా ఓ ఇంటర్వూలో ఆమెను మీరు మీ 60 వ పుట్టిన రోజును ఎలా జరుపుకోవాలనుకుంటున్నారు అంటే... నేను నా స్నేహితులు, నా అందమైన పిల్లలు, నా మనవలుతో కలిసి అని చెప్పేసింది.

పెళ్లి వద్దు..పిల్లలు కావాలంటున్న సల్మాన్!

ఆమె తన కెరీర్ లో ఓ దశకు వచ్చిన ఈ సమయంలో ఇలా మాట్లాడటంతో ఆమె కొన్ని నిర్ణయాలకు వచ్చినట్లే అని, కొన్నిటికి మానసికంగా సిద్దపడినట్లే అని అర్దమవుతోంది. నిజానికి ఇది కరెక్ట్ ఏజ్ కూడా..ఈ వయస్సులో వివాహం చేసుకుని సెటిల్ అవ్వాలనుకోవటం మంచి ఆలోచనే మరి.

కత్రినా-రణబీర్ బ్రేకప్..ఖరీదు రూ. 21 కోట్లు?

అయితే బోయ్ ఫ్రెండ్ కు బ్రేకప్ చెప్పిన తర్వాత...ఆమె సల్మాన్ తో సై అంటోంది. ఇటీవల ఫితూర్‌ ప్రమోషన్స్‌ కోసం కత్రినా సల్మాన్‌ హోస్ట్‌ చేసిన బిగ్‌బాస్‌కి వెళ్లడం, ఫితూర్‌ కోసం తనని సహాయం చేయమని అడగడం లాంటివి చూస్తుంటే మళ్లీ వీరిద్దరూ ఒక్కటి కానున్నారా అన్న విషయమై బాలీవుడ్‌లో చెవులు కొరుక్కుంటున్నారట.

ఈ మధ్యన వోగ్ మ్యాగజైన్ నిమిత్తం జరిగిన హాట్ ఫొటో షూట్ ఫొటోలు చూస్తూ ...మరిన్ని విశేషాలు చదవండి

స్లైడ్ షో లో ఆ ఫొటోలు..

కొన్నాళ్ల క్రితం..

కొన్నాళ్ల క్రితం..

‘రణ్‌బీర్‌ కోసం నన్ను వదిలేశావ్‌..ఇందుకు తర్వాత చాలా బాధపడతావ్‌' ఇది సల్మాన్‌ ఖాన్‌ కొన్నేళ్ల క్రితం కత్రినాతో అన్న మాట.

చెట్టాపట్టాలు

చెట్టాపట్టాలు


కత్రినా కైఫ్‌ సినిమాల్లోకి వచ్చిన కొత్తలో సల్మాన్‌తో చెట్టాపట్టాలేసుకు తిరిగిన విషయం తెలిసిందే.

వ్యక్తిగత...

వ్యక్తిగత...


కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల సల్మాన్, కత్రినా విడిపోయారు.

గొడవ

గొడవ

తర్వాత కత్రినా రణ్‌బీర్‌తో స్నేహం చేస్తున్నట్లు తెలియగానే 2009లో ఓ సారి సల్మాన్‌ కత్రినా ఇంటికి వెళ్లి గొడవపెట్టుకున్నాడు.

ఏదో రోజు

ఏదో రోజు

రణ్‌బీర్‌ కోసం నన్ను వదిలేస్తున్నావ్‌.. అతను ఏదో ఒకరోజు నిన్ను వదిలేస్తాడు' అంటూ చాలాసేపు గొడవచేసి వెళ్లిపోయాడని వార్తలు వచ్చాయి.

మధ్యం తాగి

మధ్యం తాగి

సల్మాన్‌ మద్యం సేవించి ఉండడంతో అతని సహాయకుడు, డ్రైవర్‌ కలిసి ఆయనను ఇంటికి తీసుకెళ్లినట్లు సమాచారం.

నిజమైంది

నిజమైంది

అన్నట్టుగానే రణ్‌బీర్‌, కత్రినాల మధ్య విభేదాలు ఏర్పడి విడిపోయారు.

అనుమానాలు

అనుమానాలు

దాంతో మళ్లీ కత్రినా సల్మాన్‌తో స్నేహం కొనసాగిస్తోందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

మంచిదేగా

మంచిదేగా

సల్మాన్ తో వ్యవహారం ఎప్పుడు ఇండస్ట్రీలో కలిసి వచ్చేదే అంటున్నారు బాలీవుడ్ జనం

పెళ్లి చేసుకుంటుందా

పెళ్లి చేసుకుంటుందా

సల్మాన్ ని పెళ్లి చేసుకుని సెటిలైపోతుందా అనే సందేహాలు కూడా ఫ్యాన్స్ కు కలుగుతున్నాయి

English summary
Katrina Kaif's personal and professional life is in a huge turmoil right on but that doesn't stop her from being happy and setting new goals.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu