»   » మీరు నమ్మక పోవచ్చు, కానీ నిజం ...! బ్రేకప్ నుంచి బయటపడేందుకే అలా చేసాను: పాపం కత్రినా కైఫ్

మీరు నమ్మక పోవచ్చు, కానీ నిజం ...! బ్రేకప్ నుంచి బయటపడేందుకే అలా చేసాను: పాపం కత్రినా కైఫ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినీ ప్రపంచం లో ప్రేమలో పడటాలూ, విడిపోవటాలూ మామూలే. అందరిముందూ చెట్టాపట్టలు వేసుకు తిరిగి అంతలోనే మళ్ళీ ఓకరికొకరు తెలియనట్టుగా ఉండటం... కలిసే పనిచేయాల్సి రావటం సాధారనమే అయినా.... వాళ్ళకీ బ్రేకప్ అన్నప్పుడు అందరికీ ఉండే భాదే ఉంటుంది నిజానికి నటులలో ఈ భాద అధికంగా ఉండేదీ..., కెరీర్ మీద కూడా ప్రభావం చూపించేదీ ఈ ప్రేమ వ్యవహారాలే...

ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తల్లో సల్మాన్ తో ప్రేమలో పడ్డ కత్రినా అతనే లోకంగా ఉంది. సల్మాన్ వల్ల కొన్ని ఆఫర్లు కూడా వచ్చాయన్నది కూడా నిజమే. అయితే కొన్ని కారణాల వల్ల ఆ బంధం విడివడక తప్పలేదు. ఆ సందర్భం లోనే "నేను మంచి భర్తని కాలేనేమో" అంటూ సల్మాన్ ఒక మీడియా ఇంటర్వ్యూలో అన్నాడు కూడా... చాలాకాలమే ఈ ఇద్దరూ భాదపడ్డారు.

కొన్నాళ్ళకి కోలుకున్న సల్మాన్ తాను చేసిన తప్పులతో కేసుల్లో ఇరుక్కున్నా అతని ఎఫైర్లు మాత్రం యథావిది గా సాగాయి. రెండు సంవత్సరాల తర్వాత... ఇంకొకరితో ప్రేమలో పడింది కత్రినా... అయితే ఆ రెండో ప్రేమలో కూడా ఆమె అమెకు చేదు అనుభవమే ఎదురయ్యింది..... ఆ భాదని ఎలా తట్టుకుందో... ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఆమె మళ్ళీ "కాలా చష్మాలో" వంటి సినిమాల్లో నటించి ఇప్పుడు కూడా గతం లో లాగే ప్రశం సలు పొంద గలిగిందో ఈ మధ్యే చెప్పింది ఆ వివరాలు స్లైడ్ షోలో....

సల్మాన్

సల్మాన్

సల్మాన్ తో బ్రేక్ అప్ తర్వాత రెండుసంవత్సరాలు సింగిల్ గానే ఉన్న కత్రినా మళ్ళీ ఒక సారి ప్రేమలో పడింది. గత ఏడాది వరకు ఆమెరణ్బీర్ కపూర్ తో సన్నిహితంగా తిరిగింది. ప్రేమలో మునిగితేలింది. ఇద్దరూ ఒకే ప్లాటులో ఉండి సహజీవనం చేసినట్టు వార్తలు వచ్చాయి.

బాలీవుడ్‌

బాలీవుడ్‌

అయితే అకస్మాత్తుగా వారిద్దరూ వేరయ్యారు. ఒకరికొకరు ఎదురుపడలేనంత దూరమయ్యారు.,,బాలీవుడ్‌ ప్రేమపక్షులు పేరొందిన కత్రినాకైఫ్‌-రణ్‌బీర్‌ కపూర్‌ గత ఏడాది చివర్లో బ్రేకప్‌ జరిగినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

రణబీర్‌తో

రణబీర్‌తో

మరి, రణబీర్‌తో వేరయిన తర్వాత కత్రిన ఎలా గడిపింది? ఈ బ్రేకప్‌ అనంతర పరిణామాలను ఎలా ఎదుర్కొంది? ఆ డిప్రెషన్‌ నుంచి ఎలా కోలుకుంది? తదితర విషయాలపై ఈ మద్య ఒక ఇంటర్వ్యూ లో కత్రిన స్పందించింది.

జిమ్‌కు వెళ్లి

జిమ్‌కు వెళ్లి

నేను తరచూగా జిమ్‌కు వెళ్లి వ్యాయమాలను చేశాను. తద్వారా దానిని (బ్రేకప్‌ను) ఎదుర్కొన్నారు' అని ఆమె ఓ మీడియా సంస్థకు తెలిపింది.

వ్యాయామం

వ్యాయామం

భాదలో ఉన్న మనసుని తేలిక పరిచేది వ్యాయామం మాత్రమే అని మానసిక వద్యులు కూడా చెప్పారు. ఏడుస్తూ కూర్చోలేనుకదా... నాకూ ఇంకా జీవితం ఉంది... మరెన్నో కలలున్నాయి...

పిచ్చిపట్టినట్టు

పిచ్చిపట్టినట్టు

ఒక్కోసారి పిచ్చిపట్టినట్టు అలసిపోయే దాకా ఎక్సర్ సైజులు చేసేదాన్ని అయితే అందుకు అవసరమయిన డైట్ని కూడా ఖచ్చితంగా పాటించేదాన్ని...

వర్క్ అవుట్

వర్క్ అవుట్

నిజానికి మనం వర్క్ అవుట్ స్టార్ట్ చేస్తే క్రమశిక్షన కూదా దానంతట అదే అలవడుతుంది.... ఏ విషయం లోనూ మీ అశ్రద్ద వహించలేరు. నా వరకూ నేనూ మరో గెలుపుకోసమే జిం లో గడుపుతున్నాను అనుకునే దాన్ని. అంటూ తన మానసిక బలానికి వెనుక సీక్రేట్ ని చెప్పేసింది కత్రిన..

కత్రిన

కత్రిన

బ్రేకప్‌ అనంతరం కత్రిన చేసిన ఈ కసరత్తు ఊరికే పోలేదు. తన తాజా సినిమా "బార్‌ బార్‌ దేఖో'లో మరింతగా బ్యూటీఫుల్‌గా దర్శనమిచ్చింది ఈ సుందరి. తనకంటే వయస్సులో చిన్నవాడైన సిద్ధార్థ్ కపూర్‌తో జత కట్టిన ఈ అమ్మడు.. అతనికి ఈడు-జోడుగా అలరించింది.

హాట్‌ హాట్

హాట్‌ హాట్

హాట్‌ హాట్ అందాలతో ప్రేక్షకుల కనులవిందు చేసింది. ఇప్పటికే సిద్ధార్థ్-కత్రిన జోడీ కలిసి ఆడిపాడిన 'కాలాచష్మా పాట ఆన్‌లైన్‌లో దుమ్మురేపుతుండగా..

ట్రైలర్‌

ట్రైలర్‌

తాజాగా బుధవారం విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ కూడా హల్‌చల్‌ చేస్తోంది. వయస్సు పెరుగుతున్నా హీరోయిన్‌గా తన చరిష్మా ఏమాత్రం తగ్గలేదని ఈ సినిమా ట్రైలర్‌తో కత్రిన మరోసారి చాటింది.

వయస్సు

వయస్సు

వయస్సు పెరుగుతున్నా తనలో మరింత అందం పెరుగుతూందే తప్ప తగ్గటం లేదు....ఏలా? అని అడిగినప్పుడు. " నా మనసుని అందంగా ఉంచుకోవటం వల్లనే నా శరీరాన్ని అందంగా ఉంచుకోవాలనే స్పృహ పెరిగింది. నాకంటూ ఉన్న ఒకే ఒక జీవితాన్ని కన్నీళ్ళతో.., భాదగా ఉండే రోజులతో నింపేయటం నాకు నచ్చదు. అంటూ సమాధానమిచ్చింది.

English summary
Katrina Kaif reveals how she dealt with Ranbir Kapoor breakup: Go to the gym and do crunches
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu