»   » త్వరలో ఓ ఇంటిదాన్ని అవుతున్నా.. స్పెషల్‌గా ఫ్యాన్స్‌కు కత్రినా ఆహ్వానం.. ఇంటర్నెట్‌లో వైరల్

త్వరలో ఓ ఇంటిదాన్ని అవుతున్నా.. స్పెషల్‌గా ఫ్యాన్స్‌కు కత్రినా ఆహ్వానం.. ఇంటర్నెట్‌లో వైరల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ అందాల సుందరి కత్రినా కైఫ్ గత ఏడాది కాలంగా కొనసాగిస్తున్న ఇంటి వేట ముగిసింది. త్వరలో సొంత ఇంటిలోకి మారనున్నది. ఈ విషయాన్ని కత్రినా కైఫ్ ఫేస్‌బుక్‌ ద్వారా అభిమానులకు తెలియజేసింది. సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉంటూనే తనకు నచ్చిన ఇంటిని కొనుగోలు చేసింది.

మా ఇంటికి రండి..

మా ఇంటికి రండి..

త్వరలోనే కొత్త ఇంట్లోకి మారబోతున్నాను. మీరు మా ఇంటిని సందర్శించండి. త్వరలోనే అడ్రస్ తెలియజేస్తాను అని ఫ్యాన్స్‌కు తాజాగా కత్రినా కైఫ్ పేస్ బుక్‌లో ఓ పోస్ట్ పెట్టింది. కత్రినా ఆహ్వానంపై అభిమానులు పొంగిపోతున్నారు. అడ్రస్ చెప్పమని కామెంట్లతో సునామీ సృష్టిస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్

సోషల్ మీడియాలో వైరల్

గత రెండు రోజుల క్రితం పెట్టిన ఈ పోస్టును ఇప్పటికే దాదాపు 2.25 మంది లైక్ చేశారు. సుమారు 12 వేల మంది షేర్ చేశారు. 7 వేల మంది కామెంట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కత్రినా పోస్ట్ వైరల్‌గా మారింది.

నమ్మబుద్ది కావడం లేదు..

నమ్మబుద్ది కావడం లేదు..

మీరు నిజంగా ఆహ్వానించారా? నమ్మబుద్ధి కావడం లేదు. నేను నిన్ను కలువడం కోసం ముంబైకి చాలా సార్లు వచ్చాను. అయితే సెక్యూరిటీ గార్డులు మీరు లేరని చెప్పారు. దాదాపు నాలుగు గంటలు వేచి చూశాను. మరోరోజు నిన్ను కలువడానికి వచ్చాను. కానీ కుదర్లేదు. దాంతో నిన్ను చూడలేకపోయాను. ఇప్పుడు నీవు ఆహ్వానం పంపావు. ఈసారైనా నిన్ను చూస్తానేమో అని ఓ అభిమాని తన ఆవేదనను వ్యక్తం చేయడం గమనార్హం.

 సొంత ఇంటి కల

సొంత ఇంటి కల

గతంలో బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో కత్రినా కొంతకాలం అఫైర్ కొనసాగించింది. వారిద్దరి మధ్య బ్రేకప్ అయిన తర్వాత రణ్‌బీర్ సొంత ఇంటిని కొనుక్కొన్నాడు. ఇప్పుడు కత్రినా సొంత ఇంటి కల సాకారం కానున్నది. ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్‌తో కలిసి నటిస్తుండటం గమనార్హం.

సల్మాన్, షారుక్‌తో కైఫ్

సల్మాన్, షారుక్‌తో కైఫ్

ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రూపొందుతున్న జగ్గా జాసూస్ చిత్రంలో మాజీ ప్రియుడు రణ్‌బీర్ సరసన కత్రినా నటిస్తున్నది. అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న టైగర్ జిందా హై చిత్రంలో సల్మాన్ ఖాన్‌తో నటిస్తున్నది. అలాగే ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో రూపొందే షారుక్ సినిమాలో కూడా కత్రినా కనిపించనున్నది. ఈ సినిమాలో షారుక్ మరుగుజ్జు పాత్రలో కనిపించనున్నారు.

English summary
Katrina has been house-hunting for a year now, and it looks like she has finally found her dream home. Over 2 lakh fans have liked the post and the actor has been flooded with requests to share her address from fans who are eager to accept her open invitation.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu