»   » బాలయ్య 'అల్లరి పిడుగు' హీరోయిన్ కి మళ్ళీ మనసైంది

బాలయ్య 'అల్లరి పిడుగు' హీరోయిన్ కి మళ్ళీ మనసైంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

మల్లీశ్వరి, అల్లరి పిడుగు చిత్రాల్లో నటించిన హీరోయిన్ కత్రినాకైప్ ఆ తర్వాత కనపడలేదు. రెమ్యునేషన్ ఎక్కువనించటం ఓ కారణమైతే ఆమె నటన సరిగ్గా రాదనే విమర్శలు ఇక్కడ వర్కవుట్ కానివ్వలేదు. దానికి తగ్గట్లుగానే కత్రినా కైఫ్ ఆ తర్వాత ఇక్కడ పనిచేయటానికి ఉత్సాహం చూపించలేదు. తాజాగా ఆమె నిర్ణయం మార్చుకున్నట్లుంది. ఆమె మాట్లాడుతూ...నేను కొన్ని దక్షిణాది సినిమాలు చేశాను. నా కెరీర్‌కు ఆ సినిమాలు కానీ... నేను ఆ సినిమాలకు కానీ ఎందుకూ ఉపయోగపడలేదు. బహుశా విదేశాల్లో పెరిగిన కారణంగా దక్షిణాది సినిమాల్లో ఇమడలేకపోయానేమో..పైగా నాకప్పుడు నటనలో పరిపక్వత కూడా తక్కువ. ఇప్పుడు నటనలో బాగానే పరిణతి సాధించాను. మళ్లీ మంచి అవకాశం వస్తే మాత్రం వదులుకోను' అంటూ తన మనసులో మాట బైటపెట్టింది. అంటే...త్వరలోనే కత్రినాకైఫ్ మళ్ళీ ఇక్కడ వారిని అలరిస్తుందన్నమాట. ఇంతకీ ఏ హీరో ప్రక్కన ఆమె చేయనుందో చూడాలి.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu