»   » రణబీర్‌కు షాక్: పెళ్లిలో బేషరం డ్యాన్స్ అని కత్రినా

రణబీర్‌కు షాక్: పెళ్లిలో బేషరం డ్యాన్స్ అని కత్రినా

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ సుందరాంగి కత్రినా కైఫ్, రణబీర్ కపూర్‌ గత కొద్దికాలంగా ప్రేమాయణం నడుపుతున్నారని, త్వరలో వీరిద్దరి చేసుకుంటారని పుకార్లు షికార్లు చేస్తూ వచ్చాయి. అయితే తాజాగా కత్రినా ఓ ప్రకటన చేసి ఆ పుకార్లకు బ్రేకులు వేయసింది.

గతంలో కత్రినా కైఫ్ సల్మాన్‌ ఖాన్‌తో ప్రేమాయణం నడిపింది. అది పెళ్లి వరకు వచ్చి ఆగిపోయింది. అయితే అకస్మాత్తుగా సల్మాన్‌కు సలాం కొట్టేసి దూరం జరిగింది. ఆ తర్వాత బాలీవుడ్ బాయ్ రణబీర్ కపూర్‌‌తో కత్రినా పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయింది. వీరిద్దరూ స్పెయిన్ బీచ్‌లో ఎంజాయ్ చేస్తూ మీడియా కెమెరాలకి చిక్కారు. ఆ ఫొటోలు తీవ్ర దుమారం రేపాయి. వారిద్దరు పెళ్లి చేసుకోవడమే మిగిలిందంటూ ప్రచారం ప్రారంభమైంది.

అయితే అకస్మాత్తుగా కత్రినా రణబీర్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ధూమ్ 3 ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో ముచ్చటిస్తూ ఆ అమ్మడు -తాను రణబీర్‌ని పెళ్లి చేసుకోబోవడం లేదంటూ చెప్పేసింది.

అంతేకాదు, రణ్‌బీర్‌ పెళ్లిలో 'బేషరం' సాంగ్‌కి డ్యాన్స్ కూడా చేయాలని వుందని చెప్పింది. దాంతో కత్రినా కైఫ్, రణబీర్ మధ్య ఏం జరిగిందా అని బాలీవుడ్‌లో అందరూ జుట్టు పీక్కుంటున్నారట.

English summary
Bollywood beauty Katrina Kaif cleared that she is not going to marry Ranbhir Kapoor.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu