»   » చిన్న సినిమాని ఉరి తీయకండీ , సెన్సార్ వాళ్ళతో కలిసి చేసిన కుట్ర ఇది

చిన్న సినిమాని ఉరి తీయకండీ , సెన్సార్ వాళ్ళతో కలిసి చేసిన కుట్ర ఇది

Posted By:
Subscribe to Filmibeat Telugu

నవకళ వారి శ్రీ శ్రీమాన్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై శశాంక మౌళి, మమతా రాహుత్‌, పావని హీరో హీరోయిన్‌లుగా శ్రీను విజ్జగిరి, ప్రసాద్‌కుమార్‌ నిర్మాతలుగా రత్న దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కత్రినా కరీనా మధ్యలో కమల్‌హాసన్‌'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఏప్రిల్‌ 7న విడుదలకు సిద్ధమైంది. అయితే తెలుగు సెన్సార్‌ సభ్యులు సెన్సార్‌ విషయంలో రిజిక్ట్‌ కాబడిన ఈ చిత్రం ఢిల్లీ సెన్సార్‌ నుండి ఎటువంటి కట్స్‌ లేకుండా 'ఎ' సర్టిఫికెట్‌ని సొంతం చేసుకుంది.

ఢిల్లీ సెన్సార్‌ సభ్యులకు ధన్యవాదాలు

ఢిల్లీ సెన్సార్‌ సభ్యులకు ధన్యవాదాలు

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ..ముందుగా ఈ సినిమాని సెన్సార్‌ చేసి ఒక్క కట్‌ లేకుండా 'ఎ' సర్టిఫికెట్‌ని ఇచ్చిన ఢిల్లీ సెన్సార్‌ సభ్యులకు ధన్యవాదాలు. అయితే తెలుగులో ఈ చిత్రానికి సెన్సార్‌ చేయకుండా రిజిక్ట్‌ చేసిన తీరు మమ్మల్ని ఎంతగానో బాధించింది. వారు రిజిక్ట్‌ చేసే కంటెంట్‌ ఇందులో ఏమాత్రం లేదని ఢిల్లీ సెన్సార్‌ నిరూపించింది.

చాలా బాధాకరం

చాలా బాధాకరం

ఇక్కడ ఎక్జామిన్‌ కమిటీ, రివైజింగ్‌ కమిటీలు చిన్న సినిమాల విషయంలో వ్యవహరిస్తున్న తీరు చాలా బాధాకరం. చివరకు 8 నెలల పాటు ఫైట్‌ చేసి ఢిల్లీ నుండి సెన్సార్‌ క్లియరెన్స్‌ తెచ్చుకుంటే.. సినిమా రిలీజ్‌కి రెడీ అయిన ఈ సమయంలో ఆలిండియా డెమోక్రటిక్‌ ఉమెన్స్‌ అసోసియేషన్‌ నుండి ఈ సినిమా పోస్టర్స్‌ ఆపేయాలంటూ నోటీసులు పంపించారు.

 కావాలని ఇబ్బందికి గురిచేయడానికే

కావాలని ఇబ్బందికి గురిచేయడానికే

ఏప్రిల్‌ 7న రిలీజ్‌కి అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత, పోస్టర్స్‌ అన్నీ డిస్పాచ్‌ అయిన తర్వాత ఇప్పుడు ఆపేయాలంటే అది ఎలా సాధ్యమవుతుంది? లక్షల ఖర్చు పెట్టి పోస్టర్స్‌ ప్రింట్‌ చేయించాము. ఈ టైమ్‌లో మమ్మల్ని కావాలని ఇబ్బందికి గురిచేయడానికే.. ఇక్కడి సెన్సార్‌ వాళ్ళతో కుమ్మక్కయి..ఇలా చేస్తున్నారు.

చిన్న సినిమాని, బ్రతికించండి

చిన్న సినిమాని, బ్రతికించండి

సినిమాలో కంటెంట్‌ మీద వాళ్ళకి ఏమైనా అనుమానాలు ఉంటే సినిమా చూసి మాట్లాడమనండి. ఇందులో అమ్మాయిల గురించి చాలా పాజిటివ్‌గా చూపించాము. ఒక అమ్మాయి బ్యాడ్‌గా ఆలోచిస్తే ఎంత వరకు వెళుతుంది అనే కోణంలో సినిమా ఉంటుంది. అంతే తప్ప ఆడవాళ్ళని కించపరిచే సన్నివేశాలు ఈ చిత్రంలో లేవు. దయచేసి చిన్న సినిమాకి సహకరించి, బ్రతికించండి. అని అన్నారు.

కార్యక్రమంలో

కార్యక్రమంలో

ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు రత్న, శశాంక మౌళి తదితరులు పాల్గొన్నారు. శశాంక మౌళి, మమతా రాహుత్‌, పావని, అనంత్‌, ఖయ్యం, రాకెట్‌ రాఘవ, ఫిష్‌ వెంకట్‌, జబర్ధస్త్‌ మహేష్‌, శ్రీధర్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: వి.ఎస్‌.పి. తెన్నేటి, సంగీతం: శ్రీకర్‌, కెమెరా: ప్రసాద్‌, శ్రావణ్‌ కుమార్‌, సహనిర్మాతలు: ఎస్‌. మల్లయ్య, బి. జగన్‌, కర్నె ఇందిరా వెంకట రెడ్డి, నిర్మాతలు: శ్రీను విజ్జిగిరి, ప్రసాద్‌కుమార్‌, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: రత్న.

English summary
According to movie makers, Katrina Kareena madhyalo Kamal Haasan has faced some problems at Censors but they have some how come out of those problems successfully.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu