»   » మా హీరోయిన్ భర్తను లాగేసుకుంటావా? ఫేస్ బుక్ లో ఫ్యాన్స్ అసభ్యకామెంట్స్,పోలీస్ కంప్లైంట్

మా హీరోయిన్ భర్తను లాగేసుకుంటావా? ఫేస్ బుక్ లో ఫ్యాన్స్ అసభ్యకామెంట్స్,పోలీస్ కంప్లైంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొచ్చి: సోషల్ మీడియాలో అందుబాటులోకి వచ్చాక చాలా మంది తమపై తాము నియంత్రణ కోల్పోయి, ఎదుటి వారితో ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం ఎక్కువైంది. ముఖ్యంగా సెలబ్రెటీల విషయం అతి మరీ ఎక్కువైంది. అసభ్యంగా మాట్లాడటం కూడా జరుగుతోంది. దాంతో ఈ విషయంలో పోలీస్ కేసులుసైతం అవుతున్నాయి.

తాజాగా మళయాళ హీరోయిన్ కావ్యా మాధావన్ కు అలాంటి చేదు అనుభవం ఎదురైంది. ఫేస్ బుక్ లో ఆమెను ఉద్దేశిస్తూ అసభ్య కామెంట్స్ చేయటం కొందరు మొదలెట్టారు. కొద్ది రోజులు ఓపికపట్టిన ఆమె ఆ కామెంట్స్ చేస్తున్న వాళ్లను ఐడింటిఫై చేసి, ఎర్నాకులం ఐజీ కు సోషల్ మీడియా ఎటాక్ పై కంప్లైంట్ చేసింది.

వివరాల్లోకి వెళితే..రీసెంట్ గా కావ్య మాధవన్ తన తోటి నటుడు దిలీప్ ని వివాహం చేసుకుంది. వివాహం జరిగిన తర్వాత ఆమెపై సోషల్ మీడియా ఎటాక్ మొదలైంది. ఆమెను దిలీప్ ను ఎందుకు పెల్లిచేసుకున్నావంటూ, వేరే ఆమె కాపురంలో నిప్పులు పోసావంటూ తిట్టిపోస్తున్నారు.

Kavya Madhavan Files Police Complaint, But Why?

ఈ విషయమై కొచ్చికి చెందిన ఓ లేడీ సర్కిల్ ఇన్సిపెక్టర్ పర్శనల్ గా కావ్యమాధవన్ ని ఆమె రెసిడెన్సీలో కలిసి ఎంక్వైరీ చేసారు. దిలీప్, కావ్య ఇద్దరూ ఈ సోషల్ మీడియా ఎటాక్ ని స్ట్రాంగ్ అపోజ్ చెయ్యాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఆ ఎంక్వైరీలో వెళ్లడించారు.

ముఖ్యంగా కావ్య మాధవన్ , దిలీప్ లపై సోషల్ మీడియాలో ఎక్కువ ఎటాక్ చేస్తున్నది దిలీప్ మాజీ భార్య మంజు వారియర్ అభిమానులు కావటం గమనార్హం. మిగతావాళ్లు స్పందించినా మంజు వారియర్ అభిమానులతోనే తలనొప్పి ఎక్కువైంది. దిలీప్, కావ్య వివాహానికి సంభందించిన న్యూస్ వచ్చిన నాటి నుంచి ఈ సమస్య మొదలైంది. అందులో బాగంగా ఎటాకర్స్..దిలీప్ కుమార్తె మీనాక్షిని సైతం వదలటం లేదు.

ఇక ఈ విషయమై మీడియాతో మాట్లాడటానికి కావ్య, దిలీప్ ఇష్టపడటం లేదు. చాలా డిగ్నిఫైడ్ గా వ్యవహిస్తున్నారు. మరో ప్రక్క కావ్యా మాధవన్ తన నటనా కెరీర్ కు ఫుల్ స్టాఫ్ పెట్టాలని నిర్ణయించుకుందని వార్తలు వినపడుతున్నాయి. ఇప్పటికే కమిటైన ప్రాజెక్టులు ఫినిష్ చేసి, ఆమె తన వైవాహిక జీవితంలో బిజీ అవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్తున్నారు.

English summary
Kavya Madhavan, the actress who recently married co-star Dileep, has filed a complaint to Ernakulam range IG, against the social media attack. Kavya and Dileep have been heavily thrashed is social media, post their marriage.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu