»   » ప్యామిలీతో కలిసి రుద్రమదేవి చూడనున్న కేసీఆర్

ప్యామిలీతో కలిసి రుద్రమదేవి చూడనున్న కేసీఆర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలంగాణ ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర రావు తన కుటుంబ సభ్యులతో కలిసి ‘రుద్రమదేవి' సినిమా చూడబోతున్నారు. ఈ మేరకు దర్శకుడు, నిర్మాత గుణశేఖర్ వారి కోసం ఆదివారం ప్రత్యేకంగా షో ఏర్పాటు చేస్తున్నారు.

కాతీయ సామ్రాజ్యాన్ని పాలించిన రుద్రమదేవి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా కావడంతో ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. చిత్ర దర్శకుడు గుణశేఖర్‌, ఆయన భార్య, ప్రముఖ నిర్మాత దిల్‌రాజు తదితరులు గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన సంగతి తెలిసిందే.


మనకు చారిత్రక చిత్రాలు చాలా అరుదనే చెప్పాలి. అప్పుడప్పుడు వచ్చినా అవి భక్తిరక ప్రధానంగా ఉండి, అసలు చరిత్రను మరుగుపరిచేలా తయారవుతున్నాయి. ఇలాంటి పరిస్ధితుల్లో మన తెలుగు జాతి గొప్పతనాన్ని,మన వారసత్వాన్ని గుర్తు చేస్తూ వస్తున్న చిత్రం 'రుద్రమదేవి' . చిన్నప్పటినుంచీ పాఠాల్లో చదువుకున్న ఈ చరిత్ర ఇప్పుడు కళ్ల ముందు ఉంచారు గుణశేఖర్.


KCR and family to watch Rudhramadevi

ఈ చిత్రంలో రుద్రమదేవిగా అనుష్క, గోన గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ హైలెట్. చాళుక్య వీరభద్రునిగా రానా, గణపతిదేవునిగా కృష్ణంరాజు, శివదేవయ్యగా ప్రకాష్‌రాజ్, హరిహరదేవునిగా సుమన్, మురారిదేవునిగా ఆదిత్యమీనన్, నాగదేవునిగా బాబా సెహగల్, కన్నాంబికగా నటాలియాకౌర్, ముమ్మడమ్మగా ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేం జరాషా, మదనికగా హంసానందిని, అంబదేవునిగా జయప్రకాష్‌రెడ్డి, గణపాంబగా అదితి చంగప్ప, టిట్టిబిగా వేణుమాధవ్, ప్రసాదాదిత్యగా అజయ్ నటించారు.


ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.'

English summary
Telangana CM KCR passed a GO exempting Rudhramadevi from paying entertainment tax. In a press meet to thank the CM for his kind gesture, Gunasekhar revealed that KCR promised him to watch the film on Sunday along with his family.
Please Wait while comments are loading...