»   »  బాలయ్య గౌతమీపుత్ర శాతకర్ణి పూజకు కెసిఆర్, చిరు, ఉద్ధండులు

బాలయ్య గౌతమీపుత్ర శాతకర్ణి పూజకు కెసిఆర్, చిరు, ఉద్ధండులు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి హీరో బాలకృష్ణ వందో సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి పూజా కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు హాజరయ్యారు. ఆయనను ఈ కార్యక్రమానికి బాలయ్య ఆహ్వానించిన విషయం తెలిసిందే. కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరయ్యారు.

KCR and Chiranjeevi attends Gothami Putra satakarni puja

గౌతమీపుత్ర శాతకర్ణి పూజా కార్యక్రమం శుక్రవారం ఉదయం సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖుల సమక్షంలో జరిగింది. ప్రముఖ సినీ దర్శకులు దాసరి నారాయణ రావు, రాఘవేంద్ర రావు కూడా హాజరయ్యారు. ముహూర్తపు షాట్‌కు రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించారు.

KCR and Chiranjeevi attends Gothami Putra satakarni puja

దాసరి నారాయణ రావు ప్రకటించగా కెసిఆర్ క్లాప్ కొట్టారు. ఆ తర్వాత బాలయ్యతో కెసిఆర్ కరచాలనం చేశారు. బాలయ్య వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అంతకు ముందు కెసిఆర్‌కు బాలయ్యతో పాటు క్రిష్ స్వాగతం పలికారు.

English summary
Telangana CM K chandrasekhar Rao and Congress Rajya Sabha member attended Nandmauri Balajrishna's 100th film Gouthamiputra Satajarni.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu