»   » చిరుతో కలిసి మొదటి బ్యాచులో చూస్తా, అన్నగారి అభిమానిగా...: బాలయ్య గౌతమీపుత్ర శాతకర్ణిపై కెసిఆర్

చిరుతో కలిసి మొదటి బ్యాచులో చూస్తా, అన్నగారి అభిమానిగా...: బాలయ్య గౌతమీపుత్ర శాతకర్ణిపై కెసిఆర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అన్నగారి (ఎన్టీఆర్) అభిమానిగా తాను సుప్రసిద్ధ నటుడు బాలకృష్ణకు హృదయపూర్వక ఆశీస్సులు పలుకుతున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చెప్పారు. బాలకృష్ణ పేరును, ఎన్టీఆర్ ప్రశస్తిని కెసిఆర్ ప్రస్తావించినప్పుడు ప్రేక్షకుల నుంచి పెద్ద యెత్తున హర్షధ్వానాలు చెలరేగాయి.

అత్యంత అభిమాన నటుడు నటరత్న అని కెసిఆర్ అన్నప్పుడు కూడా పెద్ద యెత్తున హర్షధ్వానాలు చెలరేగాయి. గౌతమీపుత్ర శాతకర్ణిపై సినిమా తీయడం చిన్న విషయం కాదని, శాతకర్ణి ఒక శకానికి నాందిపలికిన మహాపురుషుడని అన్నారు. తెలుగుజాతి క్రీ.శ., క్రీ.పూ. అని అనుకుంటుండేదని, గౌతమీ పుత్ర శాతకర్ణి తెలుగుజాతికి ఓ శకానికి నాంది పలికాడని ఆయనఅన్నారు.

KCR wants see Gouthamiputa Satakarni in first batch

తెలుగుజాతికి గుర్తుండిపోయే విధంగా బాలకృష్ణ ఈ సినిమా నిర్మించతలపెట్టడం గర్వించదగిన విషయమని ఆయన అన్నారు. గౌతమీపుత్ర శాతకర్ణి రెండు వందల రోజులు ఆడుతుందని కెసిఆర్ అన్నారు. అన్ని ప్రాంతాల ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం గౌతమీపుత్ర శాతకర్ణి చరిత్ర అని ఆయన అన్నారు.

నందమూరి కుటుంబం బట్ల అభిమానాన్ని చాటుకోవడానికి తాను వచ్చానని చెప్పారు. మద్రాసీలుగా తెలుగుజాతిని పిలిచేవారని, అటువంటి సమయంలో తెలుగుజాతి ఉందని ప్రపంచానికి చాటిన మహా నాయకుడు ఎన్టీఆర్ అని ఆయన అన్నారు. తెలుగుజాతి గర్వించదగిన నటుడు ఎన్టీఆర్ అని ఆయన అన్నారు.

KCR wants see Gouthamiputa Satakarni in first batch

ఎన్టీఆర్ గార్డెన్‌ను తొలగిస్తారనే దుష్ప్చచారం చేస్తున్నారని, అది ఎన్టీఆర్ గార్డెన్‌గానే ఉంటుందని, ఎన్టీఆర్ కేవలం ఒక తరం నటుడు మాత్రమే కాదని, తెలుగుజాతి ఉన్నంత గుర్తుండిపోయే నటుడని ఆయన అన్నారు. రెండు రాష్ట్రాల ప్రజల్లో ఎన్టీఆర్ అంటే తెలియనివారుండరని ఆయన అన్నారు. ఎన్టీఆర్ స్మారక చిహ్నాలను గుండెలో పెట్టుకుని కాపాడుకుంటామని చెప్పారు.

మెగాస్టార్ చిరంజీవి అని పలికిన తర్వాత కెసిఆర్... వెంకటేష్ గురించి ప్రస్తావిస్తూ ఆయనను ఏమంటారో తెలియదని అన్నారు. దాంతో ఎవరో అందించడంతో విక్టరీ వెంకటేష్ అని చెప్పారు. సినిమా పూర్తయిన తర్వాత మొదటి బ్యాచులో తనకు గౌతమీ పుత్రశాతకర్ణి సినిమా చూపించాలని ఆయన బాలయ్యను కోరారు. చరిత్రకు సంబంధించిన సినిమా కాబట్టి తాను చూడాలని అనుకుంటున్నట్లు తెలిపారు.

KCR wants see Gouthamiputa Satakarni in first batch

చిరంజీవితో కలిసి తాను సినిమా సినిమా చూడాలని అనుకుంటున్నట్లు కెసిఆర్ చెప్పారు. ఇక్కడ ఉన్నవాళ్లంతా మొదటి బ్యాచులో సినిమా చూడడానికి ఉండాలని అన్నారు. ఆ అవకాశం బాలకృష్ణ, దర్శకుడు కల్పించాలని ఆయన అన్నారు. కెసిఆర్ మాట్లాడుతున్నంత సేపు బాలకృష్ణ అభిమానులు పెద్ద యెత్తున హర్షధ్వానాలు చేశారు.

English summary
Telangana CM K chandrasekhar Rao and Congress Rajya Sabha member attended Nandmauri Balajrishna's 100th film Gouthamiputra Satajarni.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu