»   » బాహుబలి, బజ్రంగి భాయిజాన్....ఆ ఐడియా కీరవాణి ఇచ్చారట!

బాహుబలి, బజ్రంగి భాయిజాన్....ఆ ఐడియా కీరవాణి ఇచ్చారట!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇటీవల విడుదలైన తెలుగు మూవీ ‘బాహుబలి', హిందీ మూవీ ‘బజ్రంగి భాయిజాన్' బాక్సాఫీసు వద్ద భారీ విజయాలు నమోదు చేసాయి. వందల కోట్లు కలెక్షన్లు రాబడుతున్నాయి. ఈ రెండు చిత్రాలకు కథ అందించింది ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్. అయితే ఈ రెండు సినిమాలకు సంబంధించి కీలకమైన ఐడియాలు సంగీత దర్శకుడు కీరవాణి ఇచ్చినవేనంట. ఈ విషయాన్ని రచయిత విజయేంద్రప్రసాద్ స్వయంగా వెల్లడించారు.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి' తెలుగు సినిమా చరిత్రలోనే ఓ పెద్ద హిట్. సినిమా చివర్లో బాహుబలికి ఎంతో నమ్మకస్తుడైన కట్టప్ప అతన్ని పొడవటం....క్లైమాక్స్ లో పెద్ద ట్విస్ట్. ఈ సీన్ కారణంగానే జనాలు సెకండ్ పార్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అసలు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే ప్రశ్న ఇపుడు సర్వత్రా చర్చనీయాంశం అయింది. వాస్తవానికి ఈ సీన్ సినిమా మధ్యలో ఎక్కడో ఒక చోట పెడదామనుకున్నారట. అయితే మధ్యలో కాకుండా సినిమా చివర్లో పెడితే బావుంటుందని, సెకండ్ పార్ట్‌కు హైప్ పెంచినట్లవుతుందనే ఐడియా కీరవాణి ఇచ్చారట.


Keeravani ideas for Bajrangi Baijaan

ఇక బజ్రంగి భాయిజాన్ సినిమాకు సంబంధించి.........ఏదో ఒక దేశం నేపథ్యం ఎంచుకోవాలని రచయిత అనుకున్నారు. ఏదో ఒకటి కాకుండా పాకిస్థాన్ నేపథ్యం ఎంచుకుంటే భావోద్వేగాలు బాగా పండుతాయనే సలహా కీరవాణి ఇచ్చారని, అందు వల్లే ఆ సినిమాలో భావోద్వేగాలు బాగా పండాయని విజయేంద్రప్రసాద్ చెప్పుకొచ్చారు.

English summary
"Keeravani suggested me to shift entire Bajrangi Baijaan story to Pakistan backdrop and the idea sounded very good. There are many inspirational stories running in my mind helped to complete this film,’ Vijayendra Prasad said.
Please Wait while comments are loading...