For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఖర్చుకు, సంగీతం క్వాలిటీకి సంబంధం లేదు: కీరవాణి

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: నాగశౌర్య, అజయ్‌, సనా, ఇంద్రజ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా `దిక్కులు చూడకు రామయ్యా'. త్రికోటి దర్శకత్వం వహిస్తున్నారు. రజని కొరప్రాటి సమర్పణలో సాయి కొర్రపాటి నిర్మించారు. కీరవాణి సంగీతం అందించారు. ఈ నెల 10న ఈ సినిమా ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా పాత్రికేయులతో కాసేపు ముచ్చటించారు.

  ‘దిక్కులు చూడకు రామయ్యా' లాంటి చిన్న సినిమాకు కమిట్ కావడానికి కారణం ఏమిటి?

  పెద్ద సినిమాలకే పనిచేయాలనే నియమాన్ని నేనెప్పుడూ పెట్టుకోలేదు. నచ్చితే ఏ సినిమా అయనా చేస్తాను. బెస్ట్ ట్యూన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తా. దిక్కులు చూడకు రామయ్య సినిమా విషయంలో నిర్మాత సాయికొర్రపాటి నన్ను పూర్తిగా నమ్మారు. గతంలో ఆయనతో కలిసి ఈగ చిత్రానికి పనిచేసిన అనుభముంది. స్నేహ పూర్వక వాతావరణంలో పనిచేసే వెసులుబాటు వుంది కాబట్టే ఈ చిత్రానికి సంగీతాన్నందించాను.

   మంచి కథ అంటే?

  మంచి కథ అంటే?

  పాత్రల ఔచిత్యం, లక్ష్యం దెబ్బతినకుండా కథ అసాంతం ఆసక్తికరంగా సాగితే అది నా దృష్టిలో మంచి సినిమానే.

   సినిమా విజయంలో సంగీతం ప్రభావం?

  సినిమా విజయంలో సంగీతం ప్రభావం?

  కేవలం సంగీతం బాగున్నంత మాత్రాన సినిమాలు విజయం సాధించలేవు. కథ, కథనాలు బాగుంటేనే సినిమాలు ఆడతాయి.

   బడ్జెట్ ఎక్కువ ఖర్చు చేస్తే సంగీతం క్వాలిటీ పెరుగుతుందా?

  బడ్జెట్ ఎక్కువ ఖర్చు చేస్తే సంగీతం క్వాలిటీ పెరుగుతుందా?

  అర్థవంతమైన సాహిత్యం, క్రొంగొత్త స్వరాల మేళవింపుతోనే మంచి పాట పుడుతుంది. ఎక్కడినుంచో సింగర్స్, సాంకేతిక నిపుణుల్ని తెప్పించి పనిచేయినంత మాత్రాన సంగీతంలో నాణ్యత రాదు. దారి ఖర్చులు పెరుగుతాయి. నా దృష్టిలో బడ్జెట్ సంగీతాన్ని ఎంత మాత్రం ప్రభావితం చేయదు.

   చిన్న సినిమాల పరిస్థితి ఎలా ఉంది?

  చిన్న సినిమాల పరిస్థితి ఎలా ఉంది?

  నా దృష్టిలో బడ్జెట్ ఆధారంగా చిన్న సినిమా, పెద్ద సినిమా అనే నిర్ధారణకు రాలేము. 50లక్షల్లో సినిమా తీసి దాన్ని విడుదల చేసుకోగలిగితే నా దృష్టిలో అది పెద్ద సినిమానే. 100కోట్ల బడ్జెట్‌లో సినిమా తీసి దాన్ని విడుదల చేయలేకపోతే అది చిన్న సినిమానే.

  మ్యూజిక్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో నిలబడాలంటే?

  మ్యూజిక్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో నిలబడాలంటే?

  కాలంతో పాటు మారాలి. ట్రెండ్‌తో పాటు మారుతూ మన ప్రత్యేకతను కాపాడుకోవాలన్నదే నేను నమ్మిన సిద్ధాంతం. అలా కాని పక్షంలో ఇక్కడ నిలబడలేం.

   స్వరకల్పనకు కొందరు ఎక్కువ సమయం తీసుకోవడంపై మీ అభిప్రాయం?

  స్వరకల్పనకు కొందరు ఎక్కువ సమయం తీసుకోవడంపై మీ అభిప్రాయం?

  సంగీతం ఓ కళారూపం. దీనికి ఎలాంటి కొలమానాలు వుండవు. అందులో వందశాతం పరిపూర్ణత ఎవరూ సాధించలేరు. ఒక్కోసారి స్వరసృష్టికి ఆర్నేళ్లయినా పట్టొచ్చు...ఆరేళ్లయినా పట్టొచ్చు.

   ఈ మధ్య సినిమాలెక్కువగా చేయడం లేదు ఎందుకని?

  ఈ మధ్య సినిమాలెక్కువగా చేయడం లేదు ఎందుకని?

  వాస్తవాన్ని అంగీకరించాలి. నేను సినిమాల్ని తగ్గించలేదు. అవే తగ్గాయి. ప్రస్తుతం ట్రెండ్ మారుతోంది. అందుకు అనుగుణంగానే నాకు అవకాశాలొస్తున్నాయి.

   మీరు ఎక్కువగా రాజమౌళి కాంపౌండ్ చిత్రాలకే పరిమితమై పోయారనే విమర్శలొస్తున్నాయి?

  మీరు ఎక్కువగా రాజమౌళి కాంపౌండ్ చిత్రాలకే పరిమితమై పోయారనే విమర్శలొస్తున్నాయి?

  ఒకరు మనల్ని మాత్రమే కోరుకుంటున్నారంటే సంతోషించాల్సిన విషయమే కదా. నేను పాలలాంటి వాణ్ణి. దానికి చక్కెర కలిస్తేనే రుచి కుదురుతుంది.

  ఈ తరం మ్యూజిక్ డైరెక్టర్లలో మీకు నచ్చిన వారు?

  ఈ తరం మ్యూజిక్ డైరెక్టర్లలో మీకు నచ్చిన వారు?

  స్వామి రారా ఉయ్యాల జంపాల చిత్రాలకు పనిచేసిన ఎం.ఆర్.సన్నీ స్వరాలు బాగుంటున్నాయి. అతని పాటల్లో కొత్తదనం వుంటోంది.

  English summary
  "The lyrics were written by my dad and composing music to his lines has always been a challenge. I liked the story of the film very much and that's what inspired the music. It's not a typical album loaded with romantic numbers. Every song in the movie happens for a reason and are all integral part of the narrative," Keeravani said.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X