»   » మహేష్ తోనే కాదు, పవన్ కు కూడా కమిటయ్యింది, కానీ స్ట్రిక్టు గా చెప్పిందట

మహేష్ తోనే కాదు, పవన్ కు కూడా కమిటయ్యింది, కానీ స్ట్రిక్టు గా చెప్పిందట

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: వరస సినిమా ఆఫర్స్ రావటం వేరు, వాటిని నిలబెట్టుకోవటం వేరు. ముఖ్యంగా సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా తమ పాత్ర, నటన గురించి మాట్లాడుకుంటే వాళ్లకు కెరీర్ బాగుంటుంది. ఇదే సూత్రాన్ని ఇప్పుడు కీర్తి సురేష్ నమ్మి అమలు చేస్తోందిట. ఈ మేరకు ఆమె ఎంత పెద్ద హీరో అయినా చాలా స్ట్రిక్ట్ గా ఉంటోందని చెప్తోంది.

In Pics : నితిన్ - పవన్ - త్రివిక్రమ్ మూవీ లాంచ్

'నేను శైలజ' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ కీర్తీసురేష్. ఆమెకు వరసపెట్టి స్టార్ హీరోల సరసన ఆఫర్స్ వస్తున్నాయి. మహేష్, కొరటాల చిత్రంలో ఆమెను తీసుకోబోతున్నారని వార్తలు వింటూండగానే, పవన్ కళ్యాణ్ సరసన ఆమె ఎంపికైందని వార్తలు గుప్పుమన్నాయి. కీర్తి సురేష్ సైతం ఈ విషయాన్ని తన ట్వీట్ ద్వారా ఖరారు చేసింది.

తన తర్వాతి చిత్రం పవన్‌కల్యాణ్‌, త్రివిక్రమ్‌లతో కావడం చాలా సంతోషంగా ఉందని ట్వీట్‌ చేశారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం సమకూరుస్తున్నారు. తెలుగులో అనిరుధ్ సంగీతం అందిస్తున్న తొలి చిత్రమిది.

పవన్‌-త్రివిక్రమ్‌ కలయికలో వచ్చిన 'జల్సా', 'అత్తారింటికి దారేది' బ్లాక్ బస్టర్స్ అవటంతో ఈ చిత్రంపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. డిసెంబరు నుంచి ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం పవన్‌కల్యాణ్‌ 'కాటమరాయుడు' చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

తమిళనాట... రజనీమురుగన్, రెమో చిత్రాల విజయాలు ఈ మాలీవుడ్ బ్యూటీని క్రేజీ స్టార్‌నే చేశాయని చెప్పొచ్చు. ప్రస్తుతం విజయ్‌కు జంటగా భైరవా చిత్రంలో నటిస్తున్న కీర్తీసురేశ్, త్వరలో మరోస్టార్ హీరో సూర్య సరసన తానా చేర్న్‌ద్దకూటం చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు.

Keerthy Suresh in Pawan Kalyan-Trivikram film!

ఇక తెలుగులో నానీకి జంటగా నేను పక్కా లోకల్ చిత్రంలో నటిస్తున్నారు. బాబీసింహాతో జత కట్టిన పాంబు చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇలా చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న కీర్తీసురేష్ స్క్రిప్టు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటోందంటున్నారు.

తన కథలు బాగుంటే, తన పాత్ర బాగుంటుంది, అవే హిట్ అవుతాయని, అందుకే కథల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు ఆమె రీసెంట్ గా చెప్పారు. అలాగే నటనలోనూ గత పాత్రలకు భిన్నంగా అభినయాన్ని చూసించాలన్న విషయంలోనూ తగిన శ్రద్ధ చూపిస్తున్నానని చెప్పారు.

ముఖ్యంగా తన వద్దకు కథలు చెప్పడానికి వచ్చే దర్శక నిర్మాతలు ఇది ఆ తరహా పాత్ర అని, ఇంతకు ముందు పలానా నటి ఇలాంటి పాత్రలో నటించారని చెబుతుంటారన్నారు. అలాంటి వాటి గురించి తన వద్ద చెప్పవద్దని తాను వారికి చాలా స్ట్ట్రిక్ట్‌గా చెబుతానన్నారు.

ఎందుకంటే తానా పాత్రలో నటించేటప్పుడు అంతకు ముందు దర్శకుడు చెప్పిన ఆ నటి నటనే తన మదిలో మెదులుతుందన్నారు. అది తనకు ఇష్టం లేదన్నారు. నటనలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకుని నటిగా మంచి పేరు తెచ్చుకోవాలన్నదే తన పాలసీ అని కీర్తీసురేశ్ చెప్తోంది. మంచిదేగా.

English summary
Keerthy Suresh is signing plush projects.Keerthy Suresh tweeted, "Very happy to announce my next Telugu film with PawanKalyan sir Director #Trivikram sir, Production HaarikaHassine anirudhofficial."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu