»   » స్కూల్ పిల్లలతో అసభ్య ప్రవర్తన, సీనియర్ నటుడు అరెస్ట్

స్కూల్ పిల్లలతో అసభ్య ప్రవర్తన, సీనియర్ నటుడు అరెస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

పాలక్కడ్‌:కొన్ని సంఘటనలు వింటూంటే మనం ఏ సమాజంలో బ్రతుకుతున్నామా అనే డౌట్ వస్తుంది. సమాజంలో పెద్ద మనుష్యులుగా చలామణి అయ్యేవారి అసలు స్వరూపాలు బయిటపడినప్పుడు మానవత్వంపై నమ్మకం చచ్చిపోతుంది. ఇదంతా ఎందుకు చెప్పవల్సి వస్తోందంటో కేరళలో ఓ నటుడు చేసిన వెధవ పని వలన. ఏకంగా స్కూల్ ఆవరణలోనే విద్యార్థినులతో ఓ నటుడు సభ్యత మరిచి, అన్ని మరిచి, అసభ్యంగా ప్రవర్తించడం కేరళలో సంచలనం సృష్టించింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ ఘటనలో మలయాళ సీనియర్‌ నటుడు శ్రీజిత్‌ రవిని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించారు. కారులో ఉన్న ఓ వ్యక్తి నగ్నంగా తమవైపు చూస్తూ వెకిలి హావభావాలకు పాల్పడ్డాడని, తమ ఫొటోలను తీసుకున్నాడని కొందరు విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పథిరిపాలెంలోని ఓ ప్రముఖ పాఠశాలలో ఈ ఘటన జరిగింది.

Kerala actor Sreejith Ravi 'flashes' school girls, gets arrested

ఆ వ్యక్తి ఉన్న కారు నంబర్‌ను పోలీసులకు అందజేశారు. ఆ కారు ఎవరిదని ఆరాతీస్తే.. అది ప్రముఖ నటుడు శ్రీజిత్‌ రవిదని తేలింది. దీంతో ఆయనను కస్టడీలోకి తీసుకొని పోలీసులు ప్రశ్నించారు. దాదాపు 15 మంది స్టూడెంట్స్ ఈ కంప్లైంట్ చేసారు.

శ్రీజిత్ రవిని POCSO Act (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్) యాక్ట్ ప్రకారం సెక్షన్ ఐపిసి 509 గా కేసు పెట్టి అరెస్ట్ చేసారు. అయితే మెదట శ్రీజిత్ రవి వాటిన్నిటిని వేరే వారు అనుకుని తనను అరెస్ట్ చేస్తున్నారంటూ , పిల్లలు పొరబడ్డారని తప్పించుకోబోయాడు. కానీ పిల్లలను తీసుకువచ్చి ప్యారేడ్ నిర్వహించి మరీ అరెస్ట్ చేసాడు. శ్రీజిత్ మరో సీనియర్ నటుడు టిజె రవి కుమారుడు.

English summary
Sreejith Ravi, Mollywood actor and son of yesteryear cine artist T G Ravi, was on Thursday arrested by Ottappalam Police for allegedly exposing himself before a group of school girls.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu