»   »  బెంగళూరులో ఖైదీ నెంబర్ 150 హంగామా: ఒక్క అభిమాని రూ. 4 లక్షలు !

బెంగళూరులో ఖైదీ నెంబర్ 150 హంగామా: ఒక్క అభిమాని రూ. 4 లక్షలు !

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగళూరు: మెగస్టార్ చిరంజీవి నటించిన 'ఖైదీ నెంబర్ 150' సినిమా కర్ణాటకలో కలెక్షన్ల పరంగా సంచలనాలు సృష్టిస్తోంది. దాదాపు 10 ఏళ్ల తరువాత చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమా చూసి అభిమానులు సందడి చేస్తున్నారు.

బెంగళూరు నగరంతో పాటు కర్ణాటక, హోసూరు, క్రిష్ణగిరి (తమిళనాడు)లో ఖైదీ నెంబర్ 150 సినిమా ప్రదర్శిస్తున్నారు. కర్ణాటకలో మొదటి రోజు రూ. 4.70 కోట్లు వసూలు చేసి గత సినిమాల రికార్డులు బ్రేక్ చేసింది.

బెంగళూరు నగరంలోని మెజస్టిక్, ఆర్ టీ నగర్, బనశంకరి, జయనగర, జేపీనగర్, మడివాళ, అగర, మారతహళ్ళి, కేఆర్ పురం, యలహంక, రాజాజీనగర్, యశవంతపుర, లాల్ బాగ్, ఎలక్ట్రానిక్ సిటితో పాటు అన్ని ప్రాంతాల్లోని మల్టీఫ్లెక్స్ థియేటర్లలో రిలీజైన ఈ సినిమా టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి.

ఆదివారం రాత్రి సెకండ్ షో వరకు అన్ని థియేటర్లలో టిక్కెట్లు ఇప్పటికే అమ్ముడు పోయాయి. సినిమా థియేటర్ లో అడుగుపెట్టిన మెగా అభిమానులు సందడి చేస్తున్నారు. బెంగళూరు నగరంతో పాటు కర్ణాటకలో ఖైదీ నెంబర్ 150 సినిమా రికార్డు కలెక్షలు వసూలు చేస్తుంది.

 ఒకే ఒక వ్యక్తి రూ. 4 లక్షలు

ఒకే ఒక వ్యక్తి రూ. 4 లక్షలు

కర్ణాటక స్టేట్ రామ్ చరణ్ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు మార్టీన్ బెంగళూరులోని ఆర్ టీ నగర్ లోని రాధకృష్ణ థియేటర్ దగ్గర తన సొంత దబ్బుతో నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చిరంజీవి, రామ్ చరణ్ ల మూడు కటౌట్లు ఏర్పాటు చేశారు. మూడు కటౌట్లకు భారీ గజమాలలు వేసి తన అభిమానాన్ని చాటుకున్నారు.

వీరకన్నడిగ అయినా బాస్ అంటే ప్రాణం

వీరకన్నడిగ అయినా బాస్ అంటే ప్రాణం

కర్ణాటక రాష్ట్ర రామ్ చరణ్ యువసేన అధ్యక్షుడు మార్టీన్ పుట్టుకతోనే కన్నడిగుడు. వీరి కుటుంబానికి తెలుగు మూలాలులేవు. అయితే చిరంజీవికి వీరాభిమాని అయిన మార్టీన్ అంచలంచెలుగా ఎదుగుతూ నేడు రామ్ చరణ్ అభిమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు.

థియేటర్ దగ్గర స్వీట్లు, దుస్తులు పంపిణి

థియేటర్ దగ్గర స్వీట్లు, దుస్తులు పంపిణి

ఖైదీ నెంబర్ 150 సినిమా విడుదల సందర్బంగా తమిళనాడు నుంచి తెప్పించిన భాణాసంచాను కాల్చి పండగ చేసుకున్నారు. థియేటర్ దగ్గర అభిమానులకు స్వీట్లు పంచిపెట్టారు. సంక్రాంతి పండుగ సందర్బంగా రాధకృష్ణ థియేటర్ లో చిరంజీవి సినిమా విడుదల కావడంతో అక్కడ పని చేస్తున్న సిబ్బంది అందరికీ కొత్త దుస్తులు పంచిపెట్టి మెగస్టార్ మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.

చిరంజీవి సినిమా చూడాలని 10 ఏళ్ల కోరిక

చిరంజీవి సినిమా చూడాలని 10 ఏళ్ల కోరిక

10 ఏళ్ల తరువాత వస్తున్న ఖైదీ నెంబర్ 150 సినిమా విడుదల సందర్బంగా చిరంజీవి, రామ్ చరణ్ కటౌట్ లు తన సొంత ఖర్చులతో ఏర్పాటు చెయ్యడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుగానే బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ ), స్థానిక పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నారు.

 స్వామినాయుడు స్పూర్ఫితో

స్వామినాయుడు స్పూర్ఫితో

ఆల్ ఇండియా చిరంజీవి యువత జాతీయ అధ్యక్షుడు రవణం స్వామి నాయుడును ఆదర్శంగా తీసుకుని తాను కర్ణాటకలో మెగాస్టార్ పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని, ఎప్పటికే స్వామినాయుడే మాకు స్పూర్ఫి అని మార్టీన్ మీడియాకు చెప్పారు.

చిరంజీవి పేరు మీద

చిరంజీవి పేరు మీద

ఖైదీ నెంబర్ 150 సినిమా ఘన విజయం సాధించాలని ఆల్ ఇండియా చిరంజీవి యువత జాతీయ అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు ఆధ్వర్యంలో దేశంలోని పలు పుణ్యక్షేత్రాల్లో పూజలు నిర్వహించారు. కాశీ, కర్ణాటకలోని శ్రీ ధర్మస్థలం, తమిళనాడులోని కంచి, ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల తదితర పుణ్యక్షేత్రాల్లో సినిమా సూపర్ హిట్ కావాలని ప్రత్యేక పూజలు నిర్వహించామని మార్టీన్ తెలిపారు.

మెగా ఫ్యామిలీతో

మెగా ఫ్యామిలీతో

మెగస్టార్ సినిమాలు విడుదల అవుతున్నాయంటే బెంగళూరు నగరంలో భారీ స్థాయిలో సందడి

చేస్తారు. బెంగళూరులో నివాసం ఉంటున్న ప్రవాసాంధ్రులతో పాటు పెద్ద ఎత్తున కన్నడిగులు సినిమా థియేటర్ల దగ్గర భారీగా బ్యానర్లు, ఫెక్సీలు ఏర్పాటు చేస్తారు.

 కర్ణాటకలో సేవా కార్యక్రమాలు

కర్ణాటకలో సేవా కార్యక్రమాలు

ప్రాణం ఉన్నంత వరకు మెగా ప్యామిలీ అభిమానుగానగానే ఉంటామని చిరంజీవి అభిమానులు తెలిపారు. మెగాస్టార్ పేరు మీద అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందుకు సహకరిస్తున్న తన స్నేహితులు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలుపుతున్నానని మార్టీన్ తదితర చిరంజీవి అభిమాన సంఘాల నాయకులు మీడియాకు చెప్పారు.

 వారం రోజుల నుంచి

వారం రోజుల నుంచి

ఖైదీ నెంబర్ 150 సినిమా విడుదల సందర్బంగా గత వారం రోజుల నుంచి తాము కటౌట్లు, బ్యానర్లు ఏర్పాటు చేశామని చిరంజీవి అభిమాన సంఘాల నాయకులు తెలిపారు. ఈ సందర్బంగా మెగాస్టార్ అభిమాన సంఘం నాయకులు శ్రీనివాసులు, సురేష్, చలపతి, రాజేష్, సుమన్, నారాయణ, రవి, అరుణ్ క్రిష్ణ, నాగరాజ్, యోసఫ్, గోవింద స్వామి, మురుగ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

English summary
Khaidi No 150 has been breaking records left, right and centre in terms of collections. While we earlier reported in our box office predictions that the film is set to open to a Rs. 34 crore share alone in both Andhra, Telangana and Karnataka.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu