»   » 150 సెట్స్ మీదే చిరు కి ఆ అమ్మాయి హగ్... అంతా షాకింగ్ గా చూస్తూండిపోయారు

150 సెట్స్ మీదే చిరు కి ఆ అమ్మాయి హగ్... అంతా షాకింగ్ గా చూస్తూండిపోయారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు సినిమా రంగంలో చిరంజీవిని మొదటి యాక్షన్-డాన్స్ మాస్ హీరోగా చెప్పుకోవచ్చును. అంతకు ముందు హీరోల సినిమాలలో ఈ అంశాలున్నా వాటికి అంత ప్రాముఖ్యత ఉండేది కాదు. పసివాడి ప్రాణం చిత్రం ద్వారా తెలుగు తెరపై మొట్టమొదటి సారిగా 'బ్రేక్ డ్యాన్స్' చేసిన ఘనత చిరంజీవి కే దక్కుతుంది. దక్షిణాది హీరోలలో డాన్స్ చేయడంలో గొప్ప పేరు సంపాదించిన మొదటి హీరో చిరంజీవి మాత్రమే అని చెప్పడంలో సందేహం లేదు.

ఒక ప్పుడు చిరంజీవి సినిమా విడుదలైందంటే.... కేవలం ఆయన చేసే డాన్సులు, ఫైట్లు చూసేందుకు కొంత మంది ప్రేక్షకులు మళ్లీ మళ్లీ థియేటర్లకు వెళ్లే వారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం 'ఖైదీ నెం. 150' అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రధాన ఉద్దేశ్యం అభిమానులను ఎంటర్టెన్ చేయడమే. అందుకే ఎలాంటి ప్రయోగాలకు పోకుండా, బోర్ కొట్టించే సందేశాలు ఇవ్వకుండా కమర్శియల్ అంశాలపైనే దృష్టి పెట్టారు.

Khaidi No 150: on the sets a female Dancer hugd chiru.

అంతేకాదు సినిమా కోసం కష్టపడడమే కాకుండా ప్రత్యేకించి డాన్సుల కోసం కూడా చిరంజీవి కసరత్తులు చేస్తున్నాడు. అది చూసిన యంగ్‌ మెగా హీరోలు షాక్‌కి గురవుతున్నారు కూడా. ఏది ఏమైనా డాన్సుకి వయసుతో సంబంధం లేదు. చేయాలనే సంకల్పం ఉంటే అది ఖచ్చితంగా రక్తి కడుతుంది. సంకల్పంలో చిరంజీవికి సాటి లేరు. ఇక డాన్సుల విషయంలో డౌటే లేదు.

తాజాగా హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఐదు రోజులుగా 'ఖైదీ నెం. 150' మూవీ సాంగ్ ని చిత్రీకరించారు. చిరంజీవి, లక్ష్మి రాయ్‌లపై ఈ స్పెషల్ సాంగ్‌ను చిత్రీకరిచారు. ఈ సాంగ్ పూర్తి కావటంతో దీనికి సంబంధించిన న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న సమాచారం మేరకు...బాస్ ఈజ్ బ్యాక్ అన్న ఈ మాస్ సాంగ్ ని అన్నపూర్ణ స్టూడియోస్ లో చిత్రీకరించారు. దేవిశ్రీ అందించిన మాస్ బీట్ కి, లారెన్స్ స్టెప్స్ అందించారు. అయితే సాంగ్ చిత్రీకరణ సమయంలో చిరంజీవి డాన్స్ ని చూసి ఇంప్రెస్ అయిన ఓ ఫిమేల్ డాన్సర్...అక్కడిక్కడే చిరంజీవిని హత్తుకుందని అంటున్నారు.

ఈ పరిణామానికి చిరు సైతం షాక్ అయ్యాడట తరువాత ఆ అమ్మాయిని వివరాలు కనుక్కుంటే..చిరు ఈ వయస్సులోనూ డ్యాన్స్ చేస్తుంటే...యంగ్ స్టార్స్ డ్యాన్స్ చేస్తున్నట్టుగానే ఉందని, అందుకే తను చిరుని హగ్ చేసుకోవాలనిపించి ఆ విధంగా చేశానని చెప్పిందట. ...మరోవైపు ఆ డాన్సర్ పొగడ్తలకు ముగ్ధుడయ్యాడని అంటున్నారు. ఇక ఈ సినిమా తమిళంలో ఘన విజయం సాధించిన 'కత్తి'కి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన బిజినెస్ ఇండస్ట్రీ వర్గాలని ఆశ్ఛర్యపరిచేలా జరిగింది. ముఖ్యంగా నైజాం ప్రాంతంలో ఈ మూవీకి సంబంధించిన రైట్స్ పై క్రేజ్ మాత్రం భారీ గానే ఉంది..

English summary
Raai Laxmi, Chiranjeevi wrap up shooting of the item song, Boss is Back, for Khaidi No 150 and a female Dancer hugd chiru.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu